కాలిన గాయాల విషయంలో జాగ్రత్త వహించండి

కాలిన గాయాలు 7-8 రోజులలో పూర్తిగా నయమవుతాయి. కాబట్టి, గాయంపై ఎండిపోయిన చర్మాన్ని తీయకండి. కరోనా మహమ్మారి  కారణంగా చాలా మంది వ్యక్తులు ఇంట్లో వాక్సింగ్ చికిత్సలను ఎంచుకున్నారు. కానీ మీకు సౌందర్య నిపుణుడిగా అనుభవం లేకపోతే, స్వీయ వాక్సింగ్ ఇబ్బంది అనిపించడమే కాకుండా.. మైనపు కాలిన గాయాలకు కూడా దారితీయవచ్చు. ఇదే విషయాన్ని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ హర్షల్ రంగ్లానీ కూడా నొక్కి చెప్పారు. వాక్సింగ్ అనేది చాలా సాధారణమైన జుట్టు తొలగింపు పద్ధతి. కానీ.. […]

Share:

కాలిన గాయాలు 7-8 రోజులలో పూర్తిగా నయమవుతాయి. కాబట్టి, గాయంపై ఎండిపోయిన చర్మాన్ని తీయకండి.

కరోనా మహమ్మారి  కారణంగా చాలా మంది వ్యక్తులు ఇంట్లో వాక్సింగ్ చికిత్సలను ఎంచుకున్నారు. కానీ మీకు సౌందర్య నిపుణుడిగా అనుభవం లేకపోతే, స్వీయ వాక్సింగ్ ఇబ్బంది అనిపించడమే కాకుండా.. మైనపు కాలిన గాయాలకు కూడా దారితీయవచ్చు.

ఇదే విషయాన్ని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ హర్షల్ రంగ్లానీ కూడా నొక్కి చెప్పారు. వాక్సింగ్ అనేది చాలా సాధారణమైన జుట్టు తొలగింపు పద్ధతి. కానీ.. మైనపు కాలిన గాయాలు కూడా ఏర్పడవచ్చు. చాలా వరకు మైనపు ప్రేరిత కాలిన గాయాలు పైన కనిపించేలా మాత్రమే ఉంటాయి. అదే విధంగా 7 నుండి 10 రోజులలో చర్మం సాధారణ స్థితికి వస్తుంది. అయినప్పటికీ.. ఒకవేళ అవి అలా తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలని నిపుణుడు డాక్టర్ హర్షల్ రంగ్లానీ సూచించారు:

కాలిన ప్రదేశం నుండి చీము కారడం (ఇది ఇన్ఫెక్షన్‌ని సూచిస్తుంది).  నయం అయిన మంట నుండి మిగిలిపోయిన వర్ణద్రవ్యం రావడం (దీనిని పోస్ట్-ఇన్ఫ్లమేటరీ హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు ), ముఖం వంటి సున్నితమైన ప్రాంతాలలో విస్తృతమైన కాలిన గాయాలు (ఇవి సూర్యరశ్మికి కూడా బహిర్గతమవుతాయి) ఏర్పడటం వంటివి జరుగుతాయి

వివిధ కారణాల వల్ల కాలిన గాయాలు సంభవించవచ్చు. బాంబే స్కిన్ క్లినిక్ వ్యవస్థాపకుడు, వైద్య డైరెక్టర్, చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ బతుల్ పటేల్ ప్రకారం.. ఈ క్రింది కారణాల వల్ల కాలిన గాయాలు సంభవించవచ్చు:

అత్యంత వేడి మైనపును ఉపయోగించడం
మళ్లీ మళ్ళీ వాక్సింగ్ చెయ్యడం
పెరిగిన వెంట్రుకలను తీయడానికి ఒకే స్పాట్‌లో మళ్లీ మళ్లీ వాక్సింగ్ చేయడం
నిపుణులచే వ్యాక్సింగ్ చేయకపోతే

డాక్టర్ రంగ్లానీ ప్రకారం, మైనపు కాలిన గాయాలను తగ్గించడానికి ఇక్కడ ఐదు దశలు ఉన్నాయి:

కాలిన ప్రాంతాన్ని చల్లబరచడం

ఆ ప్రాంతాన్ని చల్లబరచడానికి వెంటనే ఒక గుడ్డలో లేదా గాజుగుడ్డలో మంచు (నేరుగా మంచును వేయవద్దు). ముక్కను వేసి మెల్లిగా మర్దన చెయ్యండి. మీరు కాలిన ప్రదేశంలో చల్లటి నీటిని పోయవచ్చు. ఇది చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా ఎరుపు మరియు మంటను తగ్గిస్తుంది. చల్లటి స్నానం కూడా మైనపు మంటను నయం చేయడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

కలబంద

అలోవెరా ఉన్న జెల్‌ను రోజుకు ఎన్నిసార్లయినా, చర్మం నయం అయ్యే వరకు అప్లై చేయండి. ఇంట్లో మీ మొక్క నుండి నేరుగా కలబందను అప్లై చెయ్యవద్దు. ఎందుకంటే ఇది మరింత చికాకుపెడుతుంది. ప్యాక్ చేయబడిన కలబంద ఏదైనా చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాలకు చికిత్స చేయడానికి మరియు గాయాలను నయం చేయడానికి కలబంద ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు కూడా  చెబుతున్నాయి.

చర్మాన్ని తేమగా ఉంచడం

ఇతర ఎంపికలయినా సెంటల్లా ఆసియాటికా ఉన్న క్రీంలు కూడా ఉన్నాయి. ఇవి చర్మానికి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇంకా చర్మాన్ని గాయం నుండి కూడా నయం చేస్తాయి. పెట్రోలియం జెల్లీని ఉపయోగించి.. చర్మాన్ని తేమగా ఉంచడం కూడా వైద్య శాస్త్రంలో ఒక భాగమే..

కాలిన చర్మాన్ని తీయకండి

మైనపు కాలిన గాయాలు చాలా పైన ఉండటం వల్ల అవి 7 నుండి 8 రోజులలో పూర్తిగా నయం అవుతాయి. అందువల్ల పైన ఎండిన చర్మాన్ని తియ్యకూడదు.

సూర్య రష్మి

కాలిన గాయం సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశంలో ఉంటే (ఉదాహరణకు, పై పెదవి ప్రాంతం)  క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్ వాడండి. ఇది ఆ ప్రాంతం వర్ణద్రవ్యం పొందకుండా, నొప్పిని నిరోధిస్తుంది. ముదురు రంగు చర్మ రకాలు (మెలనిన్-రిచ్ స్కిన్) ఉన్న వ్యక్తులు పిగ్మెంటేషన్ ఎక్కువ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

మైనపు కాలిన గాయాలను ఎలా నివారించాలి?

*ఎల్లప్పుడూ  సెలూన్‌లు మరియు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల వద్దకు వెళ్ళండి.

*మీరు ఇంట్లోనే వ్యాక్సింగ్ చేస్తుంటే, వ్యాక్స్ ఎక్కువగా వేడెక్కకుండా జాగ్రత్త వహించండి. 

* ముఖంపై శరీర భాగాలకు మైనపును ఉపయోగించవద్దు.

* మీరు కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్‌లు లేదా రెటినోయిడ్‌లను ఉపయోగిస్తుంటే.. ఫేషియల్ వాక్సింగ్ చేయడం మానుకోండి.. ఎందుకంటే ఇవి చర్మాన్ని  దెబ్బతినేలా చేస్తాయి

ముగింపులో, కాలిన గాయాలను నివారించడానికి వాక్సింగ్‌కు ప్రత్యామ్నాయంగా లేజర్ హెయిర్ రిమూవల్‌ కూడా చేయవచ్చిని  డాక్టర్ పటేల్ సిఫారసు చేశారు.