ఈ ప‌జిల్ ఎన్ని చ‌తుర‌స్రాలు ఉన్నాయో చెప్ప‌గ‌ల‌రా?

ప‌జిల్స్ అనే పేరు ఎత్తినప్పుడు మనకు గుర్తుకు వచ్చేవి లెక్కలే. లాజిక్స్ తో ఆలోచిస్తే రీజనింగ్ ప్రశ్నలు, ఆటలలో మిస్టరీలను ఛేదించడం ఇలా ఎన్నో ఉన్నాయి. మెదడుకు పని చెప్తూ కొన్ని ఫజిల్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎక్కువ మంది ఇలాంటి క్లిష్టమైన ఫజిల్స్ ఆడదానికే ఇష్టపడుతారు. ఎందుకంటే అందులో ఉన్న సవాళ్లు చాలా కిక్ ని ఇస్తుంది. ఎలాంటి ఫజిల్ ని అయినా ఛేదించగలం అని అనుకునే కొంత మంది మేధావులు ఉంటారు. అలాంటి వారి […]

Share:

ప‌జిల్స్ అనే పేరు ఎత్తినప్పుడు మనకు గుర్తుకు వచ్చేవి లెక్కలే. లాజిక్స్ తో ఆలోచిస్తే రీజనింగ్ ప్రశ్నలు, ఆటలలో మిస్టరీలను ఛేదించడం ఇలా ఎన్నో ఉన్నాయి. మెదడుకు పని చెప్తూ కొన్ని ఫజిల్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎక్కువ మంది ఇలాంటి క్లిష్టమైన ఫజిల్స్ ఆడదానికే ఇష్టపడుతారు. ఎందుకంటే అందులో ఉన్న సవాళ్లు చాలా కిక్ ని ఇస్తుంది. ఎలాంటి ఫజిల్ ని అయినా ఛేదించగలం అని అనుకునే కొంత మంది మేధావులు ఉంటారు. అలాంటి వారి కోసం మా దగ్గర ఒక ఆసక్తికరమైన ఫజిల్ ఉంది. ఈ ప‌జిల్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ గా మారింది. క్రింద చూపిస్తున్న ఈ ప‌జిల్స్ లో ఎన్ని  చతురస్రాలు ఉన్నాయో కనుక్కోవడమే ఈ ప‌జిల్ యొక్క సారాంశం.

ఇంస్టాగ్రామ్ లో పాపులర్ పేజీ :

ఇంస్టాగ్రామ్ లో ‘మ్యాథ్ ప‌జిల్ అనే ఒక పాపులర్ పేజీ ఉంది. ఇందులో లెక్కలతో కూడిన ప‌జిల్స్ కోకొల్లలుగా ఉన్నాయి. అందులో షేర్ చెయ్యబడిన ఈ ప‌జిల్ కి కామెంట్ సెక్షన్ లో రికార్డు స్థాయి కామెంట్స్ వచ్చాయి. కొంతమంది ఈ ఫోటో ని చూసి 9 చతురస్రాలు ఉన్నాయి అని, మరికొంత మంది అయితే 10 చతురస్రాలు ఉన్నాయి అని కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి వీటిల్లో ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది కనుక్కోవడం చాలా కష్టమైనది. చాలా మంది నేరుగా చూసి చెప్పేస్తుంటారు. కానీ ఆ ఫోటో ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని డిజిట్స్ కనిపిస్తాయి. వాటిని ఛేదిస్తే సగం ప‌జిల్ పూర్తి చేసినట్టే. ఒకసారి ట్రై చెయ్యండి చూద్దాం. ఇలాంటి ప‌జిల్స్ ఆ పేజీ లో చాలా ఉన్నాయి. అందులోకి ప్రవేశిస్తే ఒక సరికొత్త ప్రపంచం లోకి ప్రవేశించినట్టే, బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకు ఇలాంటి ప‌జిల్స్ సాల్వ్ చెయ్యడం వల్ల బుర్ర బాగా షార్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప‌జిల్స్ తో పోలిస్తే బ్యాంకు పరీక్షలలో వచ్చే ఫజిల్స్ కఠినత్వం చాలా తక్కువ.

మెదడుకు పని చెప్పే ఈ ప‌జిల్స్ ని పరిష్కరించండి:

మనలో ఎక్కువ మ్యాథ్స్ సబ్జెక్టు ని పెద్దగా ఇష్టపడము, స్కూల్ కి వెళ్తున్న రోజుల్లో మ్యాథ్స్ క్లాస్ వస్తుంది అంటేనే భయపడేవాళ్ళం, అలా ఉండేది. కానీ కొంతమందికి మాత్రం మ్యాథ్స్ అంటే తెగ ఇష్టం, వీళ్ళు లెక్కల్ని బోర్ కొడుతున్నపుడల్లా సరదాగా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ ప‌జిల్స్ ని పరిష్కరించడం భలే సరదాగా ఉంటుంది. అయితే ఇదే ఇంస్టాగ్రామ్ పేజీ నుండి మరో ఆసక్తికరమైన ప‌జిల్స్ వచ్చింది. అదేమిటి అంటే 1+4 = 5 అయితే 2 +5 = 12 , 3 +6  = 21 అట, మరి 8 +11 = ? అని ప్రశ్న. ఇది కూడా ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అయినా ప‌జిల్. కొంతమంది 96 అని , మరికొంత మంది 40 అని, మరికొంతమంది 52 అంటూ సమాధానం ఇచ్చారు. మరి వీటిల్లో ఏది కరెక్ట్ ?, ఒక్కసారి మీరే ఆలోచించండి. మరో విచిత్రమైన ప‌జిల్ కూడా ఒకటి ఉంది , అదేమిటంటే 2×6= 4, 4×7=1, 8×3=1  అయ్యినప్పుడు, 5×5 = ?. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తారో లేదో చూద్దాం.