అతి త్వరలోనే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ ప్రతి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగే ఈవెంట్ వండర్ లస్ట్ లో భాగంగా ఆపిల్ కొత్తగా లాంచ్ చేయబోతున్న కొన్ని ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి పరిచయం చేస్తుంది.  వండర్ లస్ట్ […]

Share:

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ ప్రతి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగే ఈవెంట్ వండర్ లస్ట్ లో భాగంగా ఆపిల్ కొత్తగా లాంచ్ చేయబోతున్న కొన్ని ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి పరిచయం చేస్తుంది. 

వండర్ లస్ట్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతోంది?: 

ప్రతి ఎటా ఆపిల్ తన సంస్థ నుంచి విడుదల కాబోతున్న కొన్ని ప్రొడక్ట్స్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 12న ఆపిల్ సంస్థ నిర్వహించబోతున్న వండర్ లస్ట్ ఈవెంట్ జరగబోతున్నట్లు సమాచారం. అయితే తప్పకుండా ఈ ఈవెంట్లో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం కాబోతోంది ఐఫోన్ 15, అంతేకాకుండా ఐఫోన్ 15 ప్రో మాక్స్. అయితే ముఖ్యంగా ఈవెంట్ విశేషాలు ప్రత్యేకించి ఈవెంట్లో ఎగ్జిబిట్ చేస్తున్న ప్రతి ఒకటి లైవ్ లో చూడాలి అనుకుంటే ఆపిల్ ఐఫోన్ యూజర్లకు ప్రత్యేకమైన ఆపిల్ టీవీ ఆప్ ద్వారా చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈవెంట్ యూట్యూబ్ లో కూడా ప్రసారమయ్యే అవకాశం ఉంటుంది. 

ప్రత్యేకమైన ఆకర్షణలు: 

ఐఫోన్ 15: 

ఆపిల్ తన ఐఫోన్ 14 తరువాత సిరీస్ కి సంబంధించి, ఈ సంవత్సరం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు, అయితే కొత్త మోడళ్లలో గుర్తించదగిన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ముఖ్యమైన ఆకర్షణ. ఇటీవలి నివేదికల ప్రకారం, ప్రతి మోడల్‌లో థండర్‌బోల్ట్/ USB 4 కనెక్షన్తో పాటుగా 35W వరకు వేగంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉన్న USB టైప్-C పోర్ట్‌తో కొత్త ఐఫోన్ సిరీస్ వస్తున్నట్లు భావిస్తున్నారు. మొత్తం నాలుగు మోడల్‌లు కూడా గత సంవత్సరం ప్రో మోడల్‌లతో వచ్చిన డైనమిక్ ఐలాండ్‌ తో వస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ A16 బయోనిక్ చిప్‌కు అప్‌గ్రేడ్ తో వస్తున్నట్లు సమాచారం. అయితే ప్రో మోడల్‌లను 3nm A17 బయోనిక్ ప్రాసెసర్‌కు మార్చే అవకాశం ఉంటుంది. 

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మ్యూట్ స్విచ్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌ అక్టోబర్ ఉన్నట్లు సమాచారం. ఈ బటన్ ప్రోగ్రామబుల్ కావచ్చు. టాప్-ఆఫ్-లైన్ మోడల్ నిజానికి ద బెస్ట్ ఆప్టికల్ జూమ్ పనితీరును అందించే పెరిస్కోప్ కెమెరాతో వచ్చేస్తుంది. రెండు మోడల్‌లు కొత్త కలర్ ఆప్షన్‌లతో టైటానియం ఛాసిస్‌లో వస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ వాచ్: 

కొత్త స్మార్ట్‌వాచ్ మోడళ్లను విడుదల చేయాలనే ఆలోచనా ఇప్పుడు ఆపిల్ సంస్థకు లేనట్లే అంటూ కొంతమంది అంటున్నారు. అయితే కొత్త నివేదికల ప్రకారం, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ అల్ట్రా మరియు ఆపిల్ వాచ్ సిరీస్ 9 కొత్త S9 చిప్‌తో వచ్చే అవకాశం ఉందని, ఇది 2020 లో లాంచ్ చేసిన సిరీస్ 6 మోడల్ నుండి వాచ్‌లోని ప్రాసెసర్‌కు మొదటి అప్‌గ్రేడ్, అంతేకాకుండా మరింత ఆ హాయ్ పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ ఎయిర్పోర్ట్స్: 

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఎయిర్ ఫోర్స్ ప్రో సెకండ్ జనరేషన్ కు మరిన్ని మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి సెప్టెంబర్ 12న జరగబోయే వండర్లస్ట్ ఈవెంట్లో ఆపిల్ తన కొత్త ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతోంది. అయితే ప్రస్తుతం విడుదల కాబోయే ఎయిర్పోర్ట్స్ యూఎస్బీ టైప్ సి పోర్టుతో వస్తున్నట్లు సమాచారం.

ఇలా జరగబోయే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్లో మరెన్నో ఆకర్షణీయమైన కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ఆపిల్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.