అందుబాటులోకి ఐఫోన్ 15 సిరీస్ ..

టెక్ లవర్స్ ఎంతోగానే ఇష్టపడే ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లు వచ్చేశాయి. లేటెస్ట్ ఫీచర్లు, కొత్త అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 15ను ఆపిల్ (Apple) సంస్థ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 వాచీలను కూడా ఆపిల్ లాంచ్ చేసింది. ప్రస్తుత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 15 ధరల విషయంలో ఆపిల్ కంపెనీ వ్యూహాత్మకంగా […]

Share:

టెక్ లవర్స్ ఎంతోగానే ఇష్టపడే ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లు వచ్చేశాయి. లేటెస్ట్ ఫీచర్లు, కొత్త అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 15ను ఆపిల్ (Apple) సంస్థ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 వాచీలను కూడా ఆపిల్ లాంచ్ చేసింది. ప్రస్తుత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 15 ధరల విషయంలో ఆపిల్ కంపెనీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.  ఐఫోన్ 15 ప్రో మాక్స్  మినహా మిగతా అన్ని మోడల్స్ రేట్లు పెంచలేదు.

టాప్ ఎండ్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర మాత్రమే 100 నుంచి 1,199 డాలర్ల వరకు పెరిగింది. ఇందులో రెండు రెట్లు ఎక్కువగా డేటా స్టోరేజీ ఉండటం గమనార్హం. మనదేశంలో ఐఫోన్ 15 ధరలు 799 డాలర్లు (రూ.79,900), ఐఫోన్ 15 Plus ధరలు 899 డాలర్లు(రూ.89,899) నుంచి ప్రారంభవుతాయి. 1 టీబీ హైఎండ్ టాప్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర రూ.1,99,900గా ఉంది. 1 టీబీ ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,84,900గా ఉంది.

సీ పోర్ట్ తో చార్జింగ్

మొదటిసారిగా యూఎస్బి టైప్- సీ పోర్ట్‌ చార్జింగ్ తో ఐఫోన్లను తయారు చేయడం విశేషం. యూరోపియన్ యూనియన్ ఆదేశాలతో దిగివచ్చిన యాపిల్ సంస్థ ఎట్టకేలకు సీ పోర్ట్ చార్జింగ్ తో ఐఫోన్లను విడుదల చేసింది. అయితే యూజర్లు తమ ఎయిర్‌పాడ్‌లు తాజా ఐఫోన్‌ల మాదిరిగానే అదే కనెక్టర్‌ కావాలనుకుంటే మాత్రం కొత్త పెయిర్ కోసం 249 డాలర్లు(రూ. 20650) ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత లైట్నింగ్ ఛార్జర్‌లను ఉపయోగించాలనుకుంటే 29 డాలర్లతో (రూ. 2405) ఆపిల్ నుండి అడాప్టర్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ సంస్థకు చైనా సెగ

లేటెస్ట్ ఐఫోన్ల ధరలు పెద్దగా పెరగకపోవడంతో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరలు పెంచకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) లెక్కల ప్రకారం గత త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు దాదాపు 7% పడిపోయాయి. హువాయ్ టెక్నాలజీ నుంచి పోటీ, ఐఫోన్లపై చైనా నిషేధం కారణంగా ఆపిల్ సంస్థకు సెగ తాకింది. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ల ధరలు పెంచలేదని ఇండస్ట్రీ ఎక్ప్ ఫర్ట్స్ పేర్కొంటున్నారు.

యూఎస్ వెలుపల పెరిగిన ధరలు

ఐఫోన్ 14 ప్రో మాక్స్ తో పోల్చుకుంటే ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర దాదాపు 10 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇది గతంలో అందించిన 128 గిగాబైట్‌లతో పోలిస్తే 256 గిగాబైట్ల డేటా నిల్వను కలిగి ఉంది. అయితే యూఎస్ వెలుపల ఐఫోన్ల ధరలు బాగానే పెరిగాయి. ముఖ్యంగా కెనడాలో ఐఫోన్ 15 ప్రో ధర 50 డాలర్లు, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ప్రైస్ 200 డాలర్లు పెరిగింది. ఇండియాలో ప్రో మాక్స్ ధర దాదాపు 14% పెరిగింది. కొన్ని దేశాల్లో మాత్రం ఐఫోన్ల ధరలు తగ్గాయి. UKలో, ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ ధరలు అంతకుముందు మోడల్స్ కంటే 100 పౌండ్లు (125 డాలర్లు) తక్కువగా ఉన్నాయి.

రెండు కొత్త స్టోరేజ్ ప్లాన్స్

ఐఫోన్ ధరలు పెంచనప్పటికీ అదనపు సేవలు, యాక్సెసరీస్ నుంచి ఆదాయాన్ని అందుకునేలా ఆపిల్ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా రెండు కొత్త స్టోరేజ్ టైర్‌లను రూపొందించింది. 6-టెరాబైట్ స్టోరేజ్ కోసం నెలకు 30 డాలర్లు, 12-టెరాబైట్ స్టోరేజ్ కోసం నెలకు 60 డాలర్లతో వీటిని ప్రవేశపెట్టింది. టాప్-ఎండ్ ఐ క్లౌడ్  ప్లాన్ 2-టెరాబైట్ స్టోరేజ్ కోసం 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 15ప్రో, ప్రో మాక్స్ యూజర్లు స్పీడ్ గా డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటే వారు కొత్త కేబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆపిల్ 69 డాలర్లకి విక్రయిస్తోంది.

సెప్టెంబర్ 22 నుంచి సేల్స్

లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఐఫోన్ 15 దక్కించుకోవాలంటే సెప్టెంబర్ 22 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజు నుంచి సేల్స్ మొదలవుతాయి. ఈ నెల నుంచి ప్రిబుకింగ్స్ ప్రారంభమవుతాయి.