Apple: ఆపిల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటున్న గవర్నమెంట్

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ (Apple) కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ (Apple) ప్రొడక్ట్స్ (Products) ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ (Apple) సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ (Products) ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా మరో పక్క గవర్నమెంట్, ఆపిల్ (Apple) వినియోగదారులకు హెచ్చరిక జారి చేసింది. కొన్ని ఆపిల్ […]

Share:

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ (Apple) కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ (Apple) ప్రొడక్ట్స్ (Products) ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ (Apple) సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ (Products) ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా మరో పక్క గవర్నమెంట్, ఆపిల్ (Apple) వినియోగదారులకు హెచ్చరిక జారి చేసింది. కొన్ని ఆపిల్ (Apple) వర్షన్స్ నిజానికి హ్యాక్ (Hack) కి గురయ్యే అవకాశం ఉందని రిస్క్ (Risk) తీసుకోవద్దని, అప్డేట్ చేసుకోమంటూ గవర్నమెంట్ హెచ్చరిస్తోంది. 

వెంటనే అప్డేట్ చేసుకోవాలి అంటూ..: 

భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ (Security) ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), iPhone, iPad మరియు Apple వాచ్‌లతో సహా ఆపిల్ (Apple) ఉత్పత్తుల్లోని ఉన్న వల్నరబిలిటీ గురించి ఆపిల్ (Apple) వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. అయితే రిస్క్ (Risk) విషయాన్నీ పక్కనపెట్టి, అప్డేట్ చేసుకోకపోతే తప్పకుండా తమ డేటా (Data) రిస్క్ (Risk) లో పడే అవకాశం ఉందని గవర్నమెంట్ హెచ్చరిస్తోంది.

CERT-In Apple ఉత్పత్తులలో చాలా వరకు వన్నరబిలిటీస్ అనేవి కనిపించాయని హెచ్చరించింది CERT-In. ఇందులో భాగంగా, హ్యాకర్లు తమ ఆపిల్ (Apple) ప్రొడక్ట్స్ (Products) యాక్సిస్ చేయడం, ఇన్ఫెక్టెడ్ కోడ్ ను ఆపిల్ (Apple) ఐఫోన్, ఆపిల్ (Apple) ఐప్యాడ్, ఆపిల్ (Apple) వాచెస్ లో ఇంజెక్ట్ చేయడం, సెక్యూరిటీ (Security) సిస్టంని కూడా దెబ్బతీసే డేటా (Data) దొంగలించడం వంటి అనేక రకాల హానికరమైన చర్యలను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ భద్రతా లోపాలు వినియోగదారు డేటా (Data) రిస్క్ (Risk) లో పడడం, గోప్యత, ఆపిల్ (Apple) పరికరాల సరైన పనితీరును దెబ్బతీసే అవకాశం ఉన్నందున, వినియోగదారులకు సమాచారం ఇవ్వడం మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకం కాబట్టి ఈ భద్రతా లోపాలు గణనీయమైన ముప్పును కలిగిస్తాయని సైబర్ సెక్యూరిటీ (Security) ఏజెన్సీ హెచ్చరించింది. 

ఈ లిస్టులో ఉన్న ఆపిల్ ప్రొడక్ట్స్ రిస్క్ లో ఉన్నాయి: 

17.1కి ముందు Apple iOS వెర్షన్‌లు మరియు 17.1కి ముందు iPadoS వెర్షన్‌లు

16.7.2కి ముందు Apple iOS వెర్షన్‌లు మరియు 16.7.2కి ముందు iPados వెర్షన్‌లు

15.8కి ముందు Apple iOS వెర్షన్‌లు మరియు 15.8కి ముందు iPados వెర్షన్‌లు

14.1కి ముందు Apple macOS Sonoma వెర్షన్‌లు

13.6.1కి ముందు ఆపిల్ (Apple) మాకోస్ వెంచురా వెర్షన్‌లు

12.7.1కి ముందు Apple macOS Monterey వెర్షన్‌లు

17.1కి ముందు Apple tvOS వెర్షన్‌లు

10.1కి ముందు Apple watchOS వెర్షన్‌లు

17.1కి ముందు ఆపిల్ (Apple) సఫారి వెర్షన్‌లు 

రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే: 

ఇప్పటికే ఆపిల్ (Apple) ప్రొడక్ట్స్ (Products) లో ఉన్న చాలా వల్నరబిలిటీ (vulnerabilities) బయటపడడంతో, సైబర్ సెక్యూరిటీ (Security) వాళ్లు కచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆపిల్ (Apple) వినియోగదారులకు సలహా ఇస్తున్నారు. అయితే తమ పర్సనల్ డేటా (Data)ను సురక్షితంగా కాపాడుకోవాలనుకుంటున్న ఆపిల్ (Apple) వినియోగదారులు, తప్పకుండా, ఆపిల్ (Apple) iOS, macOS, tvOS, watchOS, Safariకు ఉన్న కొత్త లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఒకవేళ అప్డేట్ చేసుకోని పక్షంలో తప్పకుండా తమ ఆపిల్ (Apple) ఐఫోన్, ఆపిల్ (Apple) ఐప్యాడ్, ఆపిల్ (Apple) వాచెస్ లో ఉన్న సెన్సిటివ్ డేటా (Data)ను హ్యాకర్లు దొంగలించే అవకాశం ఉంది అంటున్నారు.