ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ లో వచ్చిన మార్పులు.. ఫీచర్స్ ఇవే..

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.  ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో కొత్త కెమెరా హార్డ్ వేర్, యూఎస్‌బీ టైప్-సీ […]

Share:

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. 

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో కొత్త కెమెరా హార్డ్ వేర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్‌ల భవిష్యత్తును మార్చే కనీసం 5 అతిపెద్ద డిజైన్ మార్పులతో రానున్నట్టు లీక్‌లు సూచించాయి. ఐఫోన్ 15 మోడల్‌లు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో పాటు USB టైప్-సి పోర్ట్‌తో రానున్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో సాలిడ్-స్టేట్ బటన్‌లను అందించే అవకాశం ఉంది. ఫిజికల్ బటన్‌లు లేకపోవచ్చు. 

ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ ఇలా.. 

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మోడల్ అతి పెద్ద డిజైన్ మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్‌లను USB టైప్-C పోర్ట్‌తో అందించనుంది. USB-C పోర్ట్‌తో ఫోన్‌లను విక్రయించేందుకు యూరప్ కొత్త చట్టానికి కట్టుబడి ఉంటామని కంపెనీ తెలిపింది. యూరోపియన్ యూనియన్ జారీ చేసిన యూనివర్సల్ ఛార్జింగ్ ప్రమాణాల ఆదేశాన్ని ఆపిల్ ఫాలో అవుతుంది.  కాగా ఈ ప్రమాణాలతో 2023 ఐఫోన్‌లలో అందిస్తుందనేది కంపెనీ చెప్పలేదు. ఆపిల్ లైటనింగ్ పోర్ట్‌ను తొలగించి ప్రామాణిక USB C పోర్ట్‌ను అందించే ఫస్ట్ ఐఫోన్ ఇదే అవ్వచ్చు. 

USB టైప్ -C పోర్టు పూర్తి సామర్థ్యాన్ని ఆపిల్ ద్వారా టెస్టింగ్ చేసిన MFi సర్టిఫైడ్ కేబుల్‌‌కు పరిమితం కావచ్చని భావిస్తున్నారు.  ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 అల్ట్రా, ఫిజికల్ బటన్‌లు, స్పోర్ట్స్ సాలిడ్ స్టేట్ హాప్టిక్ బటన్‌లు లేకుండా రావొచ్చు. అన్ని ఐఫోన్ 15 మోడళ్లలో ఆపిల్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉండచ్చని అంచనా. ఆపిల్ తమ ఐఫోన్లలో పెద్ద డిజైన్ మార్పులు చేయనుందని తెలిపింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ సాలిడ్-స్టేట్ హాప్టిక్ బటన్‌లను కలిగి ఉంటుందని వివరించింది.

కేబుల్‌‌ కే పరిమితం అవుతుందా.?

ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఫిజికల్ బటన్‌లు ఉండకపోవచ్చని మింగ్-చి-కువో కూడా గతంలో తెలిపారు. కొత్త సాలిడ్-స్టేట్ బటన్‌లు ఒక యూజర్ ఫిజికల్‌గా బటన్‌ను నొక్కాల్సిన అవసరం ఉండదు.  iPhone 7, iPhone 8 సహా కొన్ని ఇతర మోడళ్లలో కనిపించే హోమ్ బటన్ డిజైన్‌ను ఉండచ్చు.

ఐఫోన్ 15 సిరీస్ ముందు భాగంలో పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ సన్నగా ఉండే బెజిల్స్‌తో రావచ్చు. ఫలితంగా యూజర్లకు ఎక్కువ స్ర్కీన్ స్పేస్ లభిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ టైటానియం ఫ్రేమ్‌లతో, ఐఫోన్ 14 ప్రో మోడల్‌తో పోలిస్తే, ఎక్కువ కర్వడ్ ఎడ్జ్‌లను కలిగి ఉండవచ్చు. 

డైనమిక్ ఐలాండ్..

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ జూమ్ సామర్థ్యాల కోసం పెరిస్కోప్ లెన్స్‌తో, ఐఫోన్ 15 మోడల్‌లు ఆపిల్ డైనమిక్ ఐలాండ్ తో రావచ్చు. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లతో మాత్రమే అందించింది. చివరిగా.. లేటెస్టు లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 15 వేరియంట్‌లు సన్నని బెజెల్‌తో వస్తుంది. చిన్న-నాచ్ డిజైన్, ట్రిమ్-డౌన్ బెజెల్స్‌తో రావొచ్చు. ఆపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్‌లను ఆవిష్కరించే అవకాశం ఉంది. 2023 ఐఫోన్లు, డిజైన్, ఇతర కేటగిరీలోనూ అతిపెద్ద అప్‌గ్రేడ్‌లను అందించవచ్చునని తాజా సమాచారం.