ఐఫోన్ 15 సిరీస్ లో యూఎస్బి- టైప్ సి పోర్ట్..!

టెక్ కంపెనీ ఆపిల్ కొత్త ఐఫోన్ లైనప్‌ను మంగళవారం ఆవిష్కరించింది. సాధారణంగా ఐఫోన్‌లలో ఉండే లైట్నింగ్ ఛార్జర్ పోర్ట్ కొత్త ఐఫోన్ 15 మోడల్‌లలో టైప్- సీతో  రీప్లేస్ చేసింది. ఐరోపా యూనియన్ తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణమని చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్‌లో అమ్మే  అన్ని మొబైల్ ఫోన్‌లు 2024 చివరి నాటికి యూఎస్బి-సి ఛార్జింగ్ తో  ఉండాలని యూరోపియన్ యూనియన్ చెప్పిన తర్వాత, ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌లకు యూఎస్బి- సీ పోర్ట్ సౌకర్యాన్ని […]

Share:

టెక్ కంపెనీ ఆపిల్ కొత్త ఐఫోన్ లైనప్‌ను మంగళవారం ఆవిష్కరించింది. సాధారణంగా ఐఫోన్‌లలో ఉండే లైట్నింగ్ ఛార్జర్ పోర్ట్ కొత్త ఐఫోన్ 15 మోడల్‌లలో టైప్- సీతో  రీప్లేస్ చేసింది. ఐరోపా యూనియన్ తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణమని చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్‌లో అమ్మే  అన్ని మొబైల్ ఫోన్‌లు 2024 చివరి నాటికి యూఎస్బి-సి ఛార్జింగ్ తో  ఉండాలని యూరోపియన్ యూనియన్ చెప్పిన తర్వాత, ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌లకు యూఎస్బి- సీ పోర్ట్ సౌకర్యాన్ని అందించింది.  

యూఎస్బి-సి ఛార్జర్‌ల కంటే  లైటెనింగ్ ఛార్జర్ చాలా సురక్షితమైనదని ఆపిల్ చాలా కాలంగా వాదిస్తోంది. లైటెనింగ్ ఛార్జర్ ఇతర ఆపిల్ డివైజెస్ లో  కూడా ఉపయోగించబడుతుంది. కానీ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ  శామ్‌సంగ్‌తో సహా అనేక ఆండ్రాయిడ్ మొబైల్ తయారీదారుల మొబైల్‌లలో యూఎస్బి- సి పోర్ట్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది. 

“యూఎస్బి-సి విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది, కాబట్టి మేము ఐఫోన్ 15 తో యూఎస్బి-సి ని తీసుకువస్తున్నాము” అని ఆపిల్ ఐఫోన్   మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాన్స్ చెప్పారు.

ఆపిల్  ఐఫోన్‌ల సేల్స్  క్షీణించడం ఇంకా  చాలా మంది కాస్ట్  మోడల్‌లకు మారాలని ఆలోచిస్తున్నందున కస్టమర్లను ఆకర్షించడానికి ఐఫోన్ లలో యూఎస్బి- సి ఛార్జింగ్ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ సంస్థ అమెరికా, చైనాల మధ్య వివాదంలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం, చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం పౌర సేవకులు ఐఫోన్లను ఉపయోగించకుండా నిషేధించింది. 

ఆపిల్ కొత్త ఛార్జింగ్ పోర్ట్‌ల కంటే ఇతర కొత్త ఫీచర్‌లపైనే ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తోంది. అయితే యూఎస్బి-C పోర్ట్ కి మారడమే పెద్ద వార్త అంటున్నారు గాడ్జెట్ ప్రియులు. యాపిల్ ఈ మార్పు చేయదలచుకోలేదు, కానీ అది తప్పనిసరి రూల్ కావడంతో మార్పు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆండ్రాయిడ్ యూజర్లు ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్‌కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఎందుకో చూద్దాం. 

యూఎస్బి-సి తో ఛార్జింగ్:

ఒక కొత్త సర్వే ప్రకారం, ఈ మార్పుతో లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఐఫోన్లకు మారడానికి టెంప్ట్ కావచ్చు. ఎందుకంటే యూఎస్బి-సి అనేది చాలా ఆండ్రాయిడ్ ఫోన్లకు, డివైజ్‌లకు స్టాండర్డ్ ఛార్జింగ్ పోర్ట్. ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర యాక్సెసరీ డివైజ్‌ల కోసం ఒకటే యూఎస్బి-సి ఛార్జర్‌ని యూజర్లు వాడుతున్నారు. యూఎస్బి-సి పోర్ట్ యూనివర్సల్ కంపాటబిలిటీ, ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూరబులిటీలకు బాగా ప్రసిద్ధిగాంచింది. ఐఫోన్‌కి కూడా ఇదే ఛార్జింగ్ పోర్ట్ ఇస్తే ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. కొత్త లైట్నింగ్‌ పోర్ట్‌ ఛార్జర్‌ కొనాల్సిన అవసరం కూడా రాదు కాబట్టి డబ్బు ఆదా అవుతుంది.

ఇతర ఆపిల్ పరికరాలను ఛార్జ్ చేయడం

ఎయిర్‌పాడ్‌లు మరియు ఆపిల్ వాచ్ వంటి ఇతర ఆపిల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఐఫోన్ 15ని ఉపయోగించవచ్చు. ఇది ఐప్యాడ్‌లలో కనిపించే ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇక్కడ మీ ఐఫోన్ యొక్క బ్యాటరీ పవర్ ని పంచుకోవచ్చు.

వేగవంతమైన డేటా బదిలీ (ప్రో మోడల్‌ల కోసం):

మీరు ఐఫోన్ 15 ప్రో లేదా 15 ప్రో మాక్స్ ని  కలిగి ఉన్నట్లయితే, యూఎస్బి 3.2 ప్రమాణాన్ని ఉపయోగించి మీరు వేగవంతమైన డేటా బదిలీ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సెకనుకు 10 గిగాబిట్ల వేగంతో డేటాను బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, ఆపిల్ బాక్స్‌లో యూఎస్బి-సి 2.0 కేబుల్‌ని కలిగి ఉందని గమనించాలి, కాబట్టి మీరు ఈ వేగవంతమైన వేగం కోసం ప్రత్యేకంగా అనుకూలమైన కేబుల్‌ను కొనుగోలు చేయాలి.