అధిక ధర తో ఐ ఫోన్ 15  ప్రో, ప్రో మ్యాక్స్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ లభిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో ఆపిల్ ఐఫోన్స్ కూడా ఒకటి. వీటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మందికి తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్ ను వినియోగించాలనే కోరిక ఉంటుంది. ప్రపంచప్రఖ్యాత ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఆపిల్, ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ సరికొత్త ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మొత్తం […]

Share:

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ లభిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో ఆపిల్ ఐఫోన్స్ కూడా ఒకటి. వీటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మందికి తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్ ను వినియోగించాలనే కోరిక ఉంటుంది.

ప్రపంచప్రఖ్యాత ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఆపిల్, ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ సరికొత్త ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు మోడళ్ళు ఉండనున్నట్లు కొన్ని ఆన్ లైన్ నివేదికల ద్వారా తెలుస్తుంది. వాటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్ళు ఉండనున్నాయి. 

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అంచనా తగ్గుదల ఉన్నప్పటికీ, ఆపిల్ఐఫోన్ 15 ప్రోమరియు ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ధరలను పెంచడం ద్వారా తన మొత్తం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది ఆపిల్.

మరొకవైపు ఆపిల్ మినీ సిరీస్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే. వీటి సేల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కంపెనీ వీటిని ప్రొడక్షన్ ను నిలిపివేసింది. దీనితో ఐఫోన్ 15 సిరీస్ లో ఐఫోన్ 15 మినీ మోడల్ దాదాపు లేనట్లేనని చెప్పవచ్చు. 

ఆపిల్ తన రాబోయే ప్రో మోడళ్ల ధరల ను పెంచవచ్చని గతంలో పుకార్లు వచ్చాయి. మేలో, డైనమిక్ ఐలాండ్ మరియు 48MP కెమెరా వంటి ప్రో మోడళ్లకు ప్రత్యేకమైన ఫీచర్లు ఈ సంవత్సరం నాన్-ప్రో డివైజ్‌ల నుండి యాపిల్ తమ ధరలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఐఫోన్ 15 సిరీస్ లోని ప్రో మోడళ్ల ధరలను కంపెనీ భారీగా పెంచనున్నట్లు తెలుస్తుంది.

ఐఫోన్ 15 ప్రో మోడళ్ల ధరలను సుమారు 200 డాలర్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతంలో కూడా ఆయన ఐఫోన్ 14 సిరీస్ ధరల పెంపు విషయంలో చేసిన అంచనా నిజం అయ్యింది. దీంతో ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ ధరల పెంపు విషయంలో ఆయన అంచనా కూడా నిజం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ ధరల పెరుగుదల అనేది ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో మాత్రమే ఉంటుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం అమెరికాలో ఐఫోన్ 14 ప్రారంభ వేరియంట్ ధర 799 డాలర్లు గాను, అలాగే ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర 899 డాలర్లు గాను, అదే విధంగా ఐఫోన్ 14 ప్రో ప్రారంభ వేరియంట్ ధర 999 డాలర్లు గాను, ఇక ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ వేరియంట్ ధర 1099 డాలర్లుగా ఉంది.

రాబోయే iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max Wi-Fi 6E మద్దతుతో మొదటి ఐఫోన్‌లు అవుతాయని మరొక నివేదిక ఇటీవల వెల్లడించింది, అయితే iPhone 15 మరియు iPhone 15 Plus సాధారణ Wi-Fi 6ని కలిగి ఉండే అవకాశం ఉంది.

MacRumors ప్రకారం, Wi-Fi 6E ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయమైన వైర్‌లెస్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. Wi-Fi 6 2.4GHz మరియు 5GHz బ్యాండ్‌లపై పనిచేస్తుంది.

బ్యాండ్‌విడ్త్ పెరగడం తో Wi-Fi 6E 6GHz బ్యాండ్‌పై కూడా పని చేస్తుంది.