యాపిల్ సీఈఓ టిమ్ కుక్ GQ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా?

గత 50 ఏళ్లలో, ప్రజల రోజువారీ జీవన విధానంలో మార్పు తీసుకు వచ్చిందన్న యాపిల్ సీఈఓ ప్రపంచంలోనే విలువ పరంగా, ఆదాయం పరంగా అగ్రస్థానంలో ఉన్న కంపెనీ యాపిల్.. ఐఫోన్, ఐపాడ్స్, ఐమాక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ ఆపిల్ కంపెనీ సీఈఓ గా టిమ్ కుక్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన GQ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..  ప్రతి మెయిల్ చదువుతా..  ఇటీవల GQ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ […]

Share:

గత 50 ఏళ్లలో, ప్రజల రోజువారీ జీవన విధానంలో మార్పు తీసుకు వచ్చిందన్న యాపిల్ సీఈఓ

ప్రపంచంలోనే విలువ పరంగా, ఆదాయం పరంగా అగ్రస్థానంలో ఉన్న కంపెనీ యాపిల్.. ఐఫోన్, ఐపాడ్స్, ఐమాక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ ఆపిల్ కంపెనీ సీఈఓ గా టిమ్ కుక్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన GQ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. 

ప్రతి మెయిల్ చదువుతా.. 

ఇటీవల GQ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు.. AR/ VR హెడ్‌సెట్‌పై ప్రజలు ఎక్కువగా ఎందుకు ఆసక్తి చూపుతున్నారో తెలిపారు.. గ్లోబల్ క్రియేటివిటీ అవార్డ్స్ 2023 మ్యాగజైన్ కవర్ పేజీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పర్సనల్ మెయిల్ ని వివరించాడు.  అంతేకాకుండా తన మెయిల్ కి వచ్చిన ప్రతి మెయిల్ లో ప్రతిరోజు తప్పకుండా చదువుతానని అది ఎవరు ఎందుకు పంపించారో కూడా తెలుసుకుంటానని.. వినియోగదారులు యాపిల్ ప్రొడక్ట్స్ గురించి వారు చెప్పిన ప్రతి ఒక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాను. అదేవిధంగా వాళ్ళు యాపిల్ ఫోన్ వారి వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా మమేకమై ఉందో వాళ్లు తెలిపే పర్సనల్ స్టోరీస్ కూడా వింటానని అవి తనకు ఎంతగానో ప్రేరణగా మారుతుందని కుక్  తెలిపారు. 

కస్టమర్స్ యాపిల్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రతినిత్యం నాతో పంచుకుంటారు కొన్నిసార్లు వారి సొంత జీవితాల గురించి కూడా నాతో చెబుతారు అని అన్నారు. 

యాపిల్ AR VR హెడ్‌సెట్ ..

త్వరలోనే విడుదల కానున్న యాపిల్ AR VR హెడ్‌సెట్ గురించి కూడా ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. కుక్ వాటికి సమాధానం ఇచ్చారు. ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ చూడని బెస్ట్ ఫీచర్ టెక్నాలజీతో హెడ్‌సెట్  రానుందని ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. యాపిల్ వ్యూహాత్మకంగా మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్ ను అందించేందుకు సిద్ధంగా ఉందని.. ఆ హెడ్‌సెట్ పై ఆసక్తి రేకెత్తించేలా ఆయన మాట్లాడారు. 

ఫోన్లను ఎక్కువగా వాడొద్దన్నా టిమ్ కుక్..

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రజలు ఐఫోన్లను ఎక్కువగా ఉపయోగించకూడదని, కంపెనీ ఆ విషయాన్ని ప్రోత్సహించదని అన్నారు. గ్లోబల్ క్రియేటివిటీ అవార్డ్స్ సంచిక కోసం కవర్ పేజీపై కనిపించిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము సాంకేతికతను రూపొందించేది కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం కానీ అదే పనిగా ఫోన్లను ఎక్కువగా ఉపయోగించాలని మేము కోరుకోము అని తెలిపారు మేము గోప్యత ప్రాథమిక మానవ మానవ హక్కుగా భావిస్తాము ఆ దిశగా మా ఉత్పత్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తామని కుక్ తెలిపారు జి క్యు రచయిత జాన్ జాన్ బారన్ మాట్లాడుతూ ఆపిల్ యొక్క ఆవిష్కరణలు 1976 ఆపిల్ 2 నుంచి 1977 యాపిల్ 2 తో ప్రారంభించి.. iMac, iPod, Apple watch, AirPod ల నుండి మరికొన్ని ఉత్పత్తులు వచ్చాయని తెలిపారు. నిస్సందేహంగా యాపిల్ గత 50 ఏళ్లలో, ప్రజల రోజువారీ జీవన విధానంలో మార్పు తీసుకువచ్చిందని ఆయన అన్నారు..

Tags :