USB టైప్-C పోర్టుతో యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 2 త్వరలో..

ప్రముఖ కుపెర్టినో దిగ్గజం యాపిల్..  ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్‌ ఫోన్‌ లను లాంచ్ చేయనుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ఇయర్ ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాగా..  రాబోయే ఎయిర్‌ పాడ్‌ లు లైటనింగ్ పోర్ట్‌ కు బదులుగా USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండనున్నాయి. ఈ ఎయిర్‌ పాడ్‌ ఎలాంటి ఫీచర్స్ తో మార్కెట్ లోకి రానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  యాపిల్ యూఎస్‌బీ పోర్ట్‌లకు మారడానికి […]

Share:

ప్రముఖ కుపెర్టినో దిగ్గజం యాపిల్..  ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్‌ ఫోన్‌ లను లాంచ్ చేయనుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ఇయర్ ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాగా..  రాబోయే ఎయిర్‌ పాడ్‌ లు లైటనింగ్ పోర్ట్‌ కు బదులుగా USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండనున్నాయి. ఈ ఎయిర్‌ పాడ్‌ ఎలాంటి ఫీచర్స్ తో మార్కెట్ లోకి రానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

యాపిల్ యూఎస్‌బీ పోర్ట్‌లకు మారడానికి కాస్త కష్టతరంగా అనిపిస్తుంది.. ఎందుకంటే.. ఇది విస్తృత శ్రేణి అప్లియరేన్సెస్, ఛార్జర్‌లకు సపోర్టు అందిస్తుంది. ఫలితంగా మరింత సౌకర్యవంతంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకు రానుంది కంపెనీ. యాపిల్ USB టైప్-C పోర్ట్‌ తో కూడిన AirPods ప్రో 2 ఈ సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ ఓ నివేదికలో చెప్పింది.

లేటెస్ట్ వెర్షన్లు.. 

AirPods ప్రో 2 USB-C వెర్షన్‌తో రావొచ్చునని అనుకుంటున్నారు.. యాపిల్ ప్రస్తుతం AirPods 2 & 3 USB-C వెర్షన్‌ల కోసం ఎలాంటి ప్రణాళికలను కలిగి లేదని Kuo ట్విట్టర్‌లో తెలిపారు. లేటెస్ట్ iOS 16లో మోడల్ నంబర్‌లు A3048, A2968తో కొత్త AirPod లు వస్తాయని తెలిపింది. టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో రాబోయే AirPods ప్రో 2 కావచ్చని Kuo భావిస్తున్నారు. వీటికోసం ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ యూసర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇవి యూజర్లకు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. యాపిల్ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా హార్ట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఈ ఎయిర్ పాడ్స్ కోసం కూడా యాపిల్ యూజర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఫీచర్స్..

కొత్త AirPods Pro 2 మోడల్ 2023 మిడిల్ ఎండ్ లో  ఎప్పుడైనా అందుబాటులోకి రావొచ్చునని సమాచారం. AirPods 2, 3 మోడల్ USB-C వెర్షన్‌లతో యాపిల్ లాంచ్ చేయకపోవచ్చు. ప్రీమియం డివైజ్‌లలో మాత్రమే USB-C సపోర్టు అందిస్తుంది.

యాపిల్ iPhone 15 సిరీస్‌ను USB టైప్-C పోర్ట్‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో వచ్చిన కొన్ని లీక్‌ల ప్రకారం.. యాపిల్ USB-C పోర్ట్‌కు లైటనింగ్ పోర్ట్‌లోని అథెంటికేషన్ ప్రాసెస్ మాదిరిగానే కస్టమ్ IC చిప్‌ను యాడ్ చేయొచ్చు. మేడ్ ఫర్ ఐఫోన్ ప్రోగ్రామ్‌ లో లేని యాపిల్ యేతర యాక్సెసరీలు, స్పీడ్ ఛార్జింగ్, హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ పరిమితం కావచ్చు.

USB-C యూనివర్సల్ ఇంటర్‌ఫేస్ అందించకపోతే.. EU జోక్యం చేసువచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఆపిల్ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ అక్టోబర్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ లైవ్ కాన్ఫరెన్స్‌లో యాపిల్ ఈ నిబంధనను స్పష్టంగా పాటించవలసి ఉంటుందని చెప్పారు. EU ఆదేశాల ప్రకారం Apple USB టైప్ C పోర్ట్‌కి మారుతుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఈ యాపిల్ ప్రొడక్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం ముగిసేసరికి యాపిల్ సరికొత్త ప్యాడ్స్ తో  యూజర్లకు అందుబాటులోకి రానుంది.