అమెజాన్ నుంచి కొత్త డివైజ్

ప్రైమ్ డే సేల్ దగ్గర పడుతున్న సందర్భంలో, గురువారం అమెజాన్ కంపెనీ మరిన్ని డివైసెస్ అలాగే మరెన్నో సర్వీసెస్ మొదలు పెడుతున్నట్లు, అది కూడా వర్జీనియా లో ఉన్న ఎర్లింగ్ టోన్లో తన రెండో కొత్త హెడ్ క్వార్టర్స్లో ప్రదర్శించబోతున్నట్లు సమాచారం.  2022 లో ఆమెజాన్ విడుదల చేసిన కొత్త డివైసెస్:  గత సంవత్సరం 2022లో జరిగిన ఈవెంట్ ప్రకారం అమెజాన్ తన సరికొత్త డివైసెస్ పరిచయం చేసింది అందులో ఆకర్షణీయంగా నిలిచినవి Kindle Scribe, Halo […]

Share:

ప్రైమ్ డే సేల్ దగ్గర పడుతున్న సందర్భంలో, గురువారం అమెజాన్ కంపెనీ మరిన్ని డివైసెస్ అలాగే మరెన్నో సర్వీసెస్ మొదలు పెడుతున్నట్లు, అది కూడా వర్జీనియా లో ఉన్న ఎర్లింగ్ టోన్లో తన రెండో కొత్త హెడ్ క్వార్టర్స్లో ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. 

2022 లో ఆమెజాన్ విడుదల చేసిన కొత్త డివైసెస్: 

గత సంవత్సరం 2022లో జరిగిన ఈవెంట్ ప్రకారం అమెజాన్ తన సరికొత్త డివైసెస్ పరిచయం చేసింది అందులో ఆకర్షణీయంగా నిలిచినవి Kindle Scribe, Halo Rise, అదే విధంగా Eero PoE 6 router ఇంకా మరెన్నో. 

హెడ్ క్వార్టర్స్ విశేషాలు: 

“ఇప్పుడు Amazon HQ2 అధికారికంగా తెరిచిన వేళ విశేషం, మరిన్ని సరికొత్త ఆకర్షణీయమైన డివైసెస్ మీ ముందుకు తీసుకురావడం నిజంగా ఆనందకరంగా ఉంది” అని అమెజాన్ డివైసెస్ మరియు సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లింప్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసారు.” తప్పకుండా మీరు ఆ డివైసెస్ రేటింగ్ 9/10 వరకు ఇవ్వచ్చు. 

కంపెనీ 2019లో అమెజాన్ కంపెనీ తన రెండవ HQ2 నిర్మాణాన్ని ప్రకటించింది, అయితే ఈ హెడ్ క్వార్టర్స్  పనులు పూర్తవడానికి 2025 వరకు పడుతుంది అని సూచించాయి. అమెజాన్ ఆ అంచనాను అందకుండా, అసలు ప్రతిష్టాత్మకమైన స్విర్ల్ డిజైన్ లేకుండానే జూన్ 15న HQ2ని ప్రారంభించింది. క్యాంపస్ స్థిరమైన నిర్మాణం మరియు రూపకల్పన యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి మరియు స్థానిక సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా అమెజాన్ రెండవ హెడ్ క్వార్టర్స్ అనేది రూపొందించబడింది. 

అమెజాన్ ప్రైమ్ డే: 

అమెజాన్ ప్రైమ్ డేని జూన్ చివరిలో ప్రకటించడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం వార్షిక షాపింగ్ మహోత్సవం వివిధ రకాల డివైసెస్ అందించబోతోంది, అంతేకాకుండా ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు మరిన్నింటిని మన ముందుకు తీసుకువస్తుంది. అమెజాన్ ప్రైమ్ చేస్తే సుమారు రెండు రోజుల ఈవెంట్, జూలై 15 అర్ధరాత్రి ప్రారంభమవుతుంది మరియు జూలై 16 వరకు కొనసాగుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, మరెన్నో డివైసెస్, ఆకర్షనీయమైన అమెజాన్ డివైసెస్ అన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. 

2023 జూలై 15 నుండి 16 వరకు మన ముందుకు రాబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా, OnePlus మొబైల్ ఫోన్‌లు మిస్ చేయకూడని అద్భుతమైన డీల్‌లను అందిస్తాయి. OnePlus దాని అసాధారణమైన పనితీరు, సొగసైన డిజైన్ మరియు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ఇందులో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు బడ్జెట్ పరంగా వన్ ప్లస్ మొబైల్ ఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే, అంతే కాకుండా బెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రైమ్ డే సెల్ ఒక అద్భుతమైన అవకాశం. అంతే కాకుండా ఎన్నో డిస్కౌంట్ అలాగే ఈఎంఐ (EMI) ఆప్షన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది.

2023 జూలై 15 నుండి 16 వరకు జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ Samsung మొబైల్ ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌లను అందించడానికి సిద్ధంగా ఉంది. Samsung దాని వినూత్న ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లేలు మరియు శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. మీరు దాని టాప్-ఆఫ్-ది-లైన్ కెమెరా సామర్థ్యాలతో ఉన్న బెస్ట్ Samsung Galaxy S21 సిరీస్‌ని తీసుకోవాలనుకున్నట్లయితే, తగ్గింపు ధరలో Samsung స్మార్ట్‌ఫోన్‌ను మీ చేతుల్లోకి తీసుకురావడానికి ఈ సేల్ అనువైన అవకాశం. 

అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ డే సెల్ సందర్భంగా అమెజాన్ మీ కోసం మరో సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ మీ ముందుకు తీసుకురాబోతోంది. అంతేకాకుండా Mi మొబైల్ పైన no EMI కాస్ట్ అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్స్ మరెన్నో డిస్కౌంట్ తో మీ ముందుకు రాబోతుంది. ఒకవేళ మీరు, బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ అమెజాన్ ప్రైమ్ చేస్తే ఒక మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మరెన్నో డివైసెస్ పైన కూడా మీకు ఎన్నో రకాల డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, అంతేకాకుండా మరింత తక్కువ ధరలో నీకు అందుబాటులోకి వస్తాయి. అందుకే జులై 15 నుంచి 16 వరకు జరగనున్న ఈ అమెజాన్ ప్రైమ్ డే సెల్ మిస్ అవకండి.