2023 అమెజాన్ ప్రైమ్ డే వచ్చేసిందోచ్,. ఈ కార్డులు ఉపయోగించే వాళ్లకు బంపర్ ఆఫర్

ఈ కామర్స్ లో దిగ్గజ స్థాయిలో ఉన్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతీ ఏడాది తమ కస్టమర్స్ కోసం భారీ ఆఫర్లు ఇస్తూ ‘అమెజాన్ ప్రైమ్ డే’  అని గ్రాండ్ గా ఒక కార్యక్రమం నిర్వహించే సంగర్తి మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ అమెజాన్ ప్రైమ్ డే ని జులై 15 మరియు 16 వ తారీఖుల్లో గ్రాండ్ గా నిర్వహించనుంది. జులై 15 అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ […]

Share:

ఈ కామర్స్ లో దిగ్గజ స్థాయిలో ఉన్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతీ ఏడాది తమ కస్టమర్స్ కోసం భారీ ఆఫర్లు ఇస్తూ ‘అమెజాన్ ప్రైమ్ డే’  అని గ్రాండ్ గా ఒక కార్యక్రమం నిర్వహించే సంగర్తి మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ అమెజాన్ ప్రైమ్ డే ని జులై 15 మరియు 16 వ తారీఖుల్లో గ్రాండ్ గా నిర్వహించనుంది. జులై 15 అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మొదలు కానుంది. ఈ గ్రాండ్ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ , ల్యాప్ టాప్స్ , ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ గా డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వేలకు వేలు పెట్టి కొనుక్కోలేని స్థితిలో ఉండే అమెజాన్ సబ్యులకు ఇది బంగారం లాంటి అవకాశం అనే చెప్పాలి. ప్రతీ ఏడాది ఇది నిర్వహించినప్పుడల్లా అమెజాన్ సంస్థకి కనీవినీ ఎరుగని లాభాలు వచ్చేవి, అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.

ICICI మరియి స్టేట్ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ :

ఈ సేల్ లో భాగంగా క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులు ఉపయోగించే వారికి ఒక శుభవార్త. ఐసిఐసిఐ బ్యాంకు , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి  సంబంధించిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రతీ నెల EMI కట్టుకునేటప్పుడు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదే విధంగా అమెజాన్ పే – ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 5 శాతం వరకు డిస్కౌంట్ లభించబోతుందట. అంతే కాకుండా కొత్తగా వచ్చిన ఈ అమెజాన్ పే – ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా 2500 రూపాయిల వరకు వర్త్ విలువకు తగ్గ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ గ్రాండ్ సేల్ మేళా లో సుమారుగా 400 కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. వీటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించిన  ఆఫర్లు ఇప్పటికే రెవీల్ చేసింది అమెజాన్ సంస్థ, మిగిలిన విలువైన ప్రొడక్ట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క ఆఫర్స్ కోసం వినియీగదారులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీటి వివరాలను త్వరలోనే తెలియచెయ్యనుంది అమెజాన్ సంస్థ.

ఇది ఇలా ఉండగా ఈ ‘అమెజాన్ ప్రైమ్ డే’ లో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ప్రతీ నెల మార్కెట్ లో మనకి ఇష్టమైన బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ లేటెస్ట్ వెర్షన్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే విషయం మన అందరికీ తెలిసిందే. వీటిని బయట షో రూమ్స్ లో కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. బయట షో రూమ్ ధర కి మరియు ఆన్లైన్ ధర కి పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఈ ఏడాది లో విడుదలైన లేటెస్ట్ వెర్షన్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ కి ప్రత్యేకంగా భారీ ఆఫర్స్ ని ఇవ్వబోతుంది అమెజాన్ ప్రైమ్ సంస్థ. అది ఐ ఫోన్ అయినా కావొచ్చు, వన్ ప్లస్ కావొచ్చు, ఇక వేరే ఏ ఇతర బ్రాండెడ్ కంపెనీ కి చెందిన ఫోన్ అయినా కావొచ్చు. ఈ అద్భుతమైన అవకాశం ని వినియోగించుకోవడానికి లక్షలాది మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది అమెజాన్ ప్రైమ్ డే రోజు ఇచ్చిన సాధారణ ఆఫర్స్ లాగానే ఉంటుందా, లేదా దానికంటే ఎక్కువ ఆఫర్లు వస్తుందా అనేది అతి త్వరలోనే తెలియనుంది.