మారుతీ సుజుకీ, హ్యుండాయ్ తర్వాత, టాటా మోటార్స్ 50 లక్షల క్లబ్‌లో చేరింది

ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ అయిన టాటా మోటార్స్ 50 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ ప్రొడక్ట్ మార్కును సాధించినట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని చేరిన సంబరాన్ని ఎందరో అభిమానులు, ఉద్యోగుల మధ్య ప్రత్యేక వేడుకగా జరపాలని నిర్ణయించారు. టాటా మోటార్స్, న్యూ ఫరెవర్ టాటా కార్లు, SUVలు కలిపి  50 లక్షల కార్లు తయారు చేశారు. టాటా మోటార్స్ ఈ మైలురాయిని చేరడం భారతీయ కస్టమర్లలో టాటా కార్లకు ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పుకోవాలి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ […]

Share:

ప్రముఖ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ అయిన టాటా మోటార్స్ 50 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ ప్రొడక్ట్ మార్కును సాధించినట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని చేరిన సంబరాన్ని ఎందరో అభిమానులు, ఉద్యోగుల మధ్య ప్రత్యేక వేడుకగా జరపాలని నిర్ణయించారు. టాటా మోటార్స్, న్యూ ఫరెవర్ టాటా కార్లు, SUVలు కలిపి  50 లక్షల కార్లు తయారు చేశారు. టాటా మోటార్స్ ఈ మైలురాయిని చేరడం భారతీయ కస్టమర్లలో టాటా కార్లకు ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పుకోవాలి.

మారుతీ సుజుకీ, హ్యుండాయ్ తర్వాత, టాటా మోటార్స్ 50 లక్షల క్లబ్‌లో చేరింది. స్వదేశీ ఆటో మేజర్‌గా ఇది 50 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ ప్రొడక్ట్ మైలురాయిని అధిగమించిందని ఆ కంపెనీ తెలిపింది. టాటా కంపెనీ 2004లో 10 లక్షల మైలురాయిని, 2010లో 20 లక్షల మైలురాయిని సాధించింది. 2015లో 30 లక్షల యూనిట్లను, 2020లో 40 లక్షల యూనిట్లను దాటింది. ఇప్పుడు 40 లక్షల కార్ల నుంచి 50 లక్షలకు చేరుకోగలిగామని కంపెనీ తెలిపింది. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమను పీడిస్తున్న కోవిడ్, సెమీకండక్టర్ కొరత సంక్షోభం ఉన్నప్పటికీ, మూడు సంవత్సరాల లోపులోనే 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు.

టాటా కంటే ముందు, మారుతీ సుజుకి ఇండియా ఈ ఏడాది జనవరి 9న 2 కోట్ల 50 లక్షల దేశీయ విక్రయాల మైలురాయిని సాధించింది. అదే విధంగా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, జూన్ 2021లో కోటి కార్లను ఉత్పత్తి చేసిన  మైలురాయిని సాధించింది.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. “ఈ రోజు టాటా మోటార్స్ 50 లక్షల ప్రోడక్ట్స్ అమ్మిన మైలురాయిని చేరుకున్న సందర్భంగా దీన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నాము. ప్రతి పది లక్షల మార్క్ దాటే సమయంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య మేము ఈ విజయాలను సాధించాము.  మేము ఒక్కొక్క కొత్త ప్రొడక్ట్ తో భారతదేశాన్ని మారుస్తున్నాము. మేము తీసుకొని వచ్చే ప్రతి ప్రొడక్ట్ దేశ నిర్మాణంలో భాగం కావాలనే ఆలోచన నుండి వచ్చింది. మా బ్రాండ్ అనేక కొత్త టెక్నాలజీలను తీసుకురావడంతో కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. ఈ మైలురాయిని అందుకోవడానికి కారణమయిన మా కస్టమర్‌లు అందించిన అద్భుతమైన సపోర్ట్ కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఉద్యోగులు, డిస్ట్రిబ్యూటర్స్, ఛానెల్ పార్టనర్స్, ప్రభుత్వం ఇచ్చిన  నిరంతర సపోర్ట్ మరువలేనిది. మేము ఈ మైలురాయి చేరుకోవడానికి సహాయపడిన వారందరికీ ఋణపడి ఉంటాము. టాటా మోటార్స్ అందించే సురక్షితమైన, తెలివైన, చక్కని పరిష్కారాలతో ఇంకా ఎన్నో కొత్త కొత్త ప్రోడక్ట్స్ తెచ్చి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు కృషి మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాము.’ 

50 లక్షల ప్రోడక్ట్స్ మైలురాయిని పురస్కరించుకుని, టాటా మోటార్స్ భారతదేశంలోని కస్టమర్‌లు, ఉద్యోగుల కోసం ఒక వేడుక ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రచారం ద్వారా, టాటా మోటార్స్ తన డీలర్‌షిప్, సేల్స్ అవుట్‌లెట్‌లలో బ్రాండెడ్ దుస్తులు, ఈ మైలురాయిని గుర్తించడానికి సంతకం చేసిన జ్ఞాపికలను ఉంచుతుంది. ఈ కంపెనీ తమ ప్రాంతీయ కార్యాలయాల్లో నెల రోజుల పాటు వేడుకలను కొనసాగిస్తుంది.

టాటా మోటార్స్ 1998 నుండి ఎన్నో గొప్ప బ్రాండ్స్ ను తీసుకొచ్చింది. ఇవి కాలానికి అతీతంగా నిలిచాయి, ఆర్థిక సరళీకరణ అనంతర కాలంలో మోటరింగ్ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో సమగ్ర పాత్ర పోషించాయి, భారతదేశంలోని ఎన్నో ఇళ్ళలో టాటా మోటార్స్ కొలువుదీరాయి.