11ఏళ్ళకే అరుదైన ఘనత సాధించిన మలయాళీ బాలిక.. తెలిస్తే షాక్.

సాధారణంగా 11 ఏళ్ల బాలికలు ఆడుకుంటారు, స్కూల్‌కి వెళ్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అందుకు భిన్నం. అసలు ఎవరు ఈమె? ఏం చేసింది? ఎక్కడైనా సరే 11 సంవత్సరాల బాలబాలికలు ఆడుకోవడం లేదా స్కూల్ కి వెళ్లడం లాంటివే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది చిన్న వయసు కాబట్టి.. పెద్దగా లోకజ్ఞానం తెలియదు. అలాంటి వారు ఇలా ఆటపాటలకే పరిమితం అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది పిల్లలు చాలా హైపర్ […]

Share:

సాధారణంగా 11 ఏళ్ల బాలికలు ఆడుకుంటారు, స్కూల్‌కి వెళ్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అందుకు భిన్నం. అసలు ఎవరు ఈమె? ఏం చేసింది?

ఎక్కడైనా సరే 11 సంవత్సరాల బాలబాలికలు ఆడుకోవడం లేదా స్కూల్ కి వెళ్లడం లాంటివే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది చిన్న వయసు కాబట్టి.. పెద్దగా లోకజ్ఞానం తెలియదు. అలాంటి వారు ఇలా ఆటపాటలకే పరిమితం అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు.  ఎంతలా అంటే సైంటిస్టులు కూడా కనుగొనలేని కొన్ని అద్భుతాలను వీరు సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రమంలోనే 11 సంవత్సరాల ఒక బాలిక కంటి వ్యాధులను గుర్తించడానికి ఏఐ ఆధారిత యాప్ ను రూపొందించి అందరి చేత మన్నలను పొందుతోంది.

ఐవోఎస్ యాప్ డెవలపర్..

అసలు విషయంలోకి వెళ్తే..  అతి చిన్న వయస్కురాలిగా ఐవోఎస్ యాప్ డెవలపర్గా అవతరించి Apple CEO టిమ్ కుక్ నుండి గుర్తింపు పొందిన 9 సంవత్సరాల బాలిక హనా రఫీక్ మీకు గుర్తుంది కదా.. అయితే హనాకు ఒక అక్క లీనా ఉన్నట్లు ఇప్పుడే తెలిసింది.  ఆమె కూడా స్వీయ బోధన కోడర్.. తాజాగా లీనా ‘లెహ్నాస్’ అనే వెబ్సైటును అభివృద్ధి చేసింది. ఈ వెబ్సైటు పిల్లలు, జంతువులు, రంగులు మరియు పదాల గురించి తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇటీవల ఆమె ఐఫోన్లు ఉపయోగించి ప్రత్యేకమైన స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు మరియు పరిస్థితులను గుర్తించగల” Ogler Eye Scan “అనే ఏఐ ఆధారిత యాప్ ని కూడా రూపొందించింది.

యాప్ స్టోర్ కు తన యాప్ నున్ సమర్పించిన తర్వాత 11 ఏళ్ల లీన లింక్డ్  ఇన్ లో తన విజయాన్ని పంచుకుంది. ఇది చూసిన వినియోగదారులు చాలామంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆర్కస్, మెలనోమా, టెరీజియం మరియు క్యాటరాక్ట్ తో సహా సంభావ్య కంటి వ్యాధులు లేదా పరిస్థితులను నిర్ధారించడానికి శిక్షణ పొందిన మోడల్స్ సహాయంతో లీనా తన యాప్  ఎలా పనిచేస్తుందో.. దానిపై వివరనాత్మక వివరణ కూడా పంచుకుంది.

లీనా లింక్డ్ ఇన్ పోస్టు..

11 సంవత్సరాల వయసు ఉన్న ఈ అమ్మాయి లింక్డ్ ఇన్ పోస్టులో తన యాప్ డెవలప్మెంట్ వెనుక ఉన్న కథనాన్ని పంచుకుంది. 10 సంవత్సరాల వయసులో దానిపై పనిచేయడం ప్రారంభించామని.. వివిధ కంటి పరిస్థితులు, కంప్యూటర్ విజన్, అల్గారిథంలు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మరియు తుది ఉత్పత్తిని రూపొందించడానికి యాపిల్ ఐవోఎస్ అభివృద్ధి యొక్క అధునాతన స్థాయిలు ఆమె వెల్లడించింది. ఈ కొత్త అనువర్తనానికి ప్రాణం పోయడానికి నాకు 6 నెలల పరిశోధన మరియు అభివృద్ధి పట్టింది. ఇందులో పాటు ఎటువంటి థర్డ్ పార్టీ లైబ్రరీలు లేదా ప్యాకేజీలు లేకుండా స్థానికంగా అభివృద్ధి చేయబడింది అంటూ లీనా వివరించింది.

ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లీనాను అభినందిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఆమె అద్భుతమైన విజయాలు సాధించినందుకు ఆమెను ప్రశంసిస్తున్నారు ఏది ఏమైనా పిల్లల్లో కూడా ఇంత తెలివితేటలు భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆలోచనలు.. సమాజానికి ఉపయోగపడాలనే కోరిక అన్నీ కూడా వారిని మరింత ప్రతిభావంతులుగా చేస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే వీరు పిల్లలు కాదు పిడుగులు అని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు లీనాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పాలి. ఏదిఏమైనా లీనా భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు నాంది పలకాలి అని కూడా పలువురు ఆకాంక్షిస్తున్నారు.