ఐఫోన్ కు బడ్జెట్ సరిపోవడం లేదా

ఐఫోన్ .. ఐఫోన్.. ఐ ఫోన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఐ ఫోన్ నామ జపమే నడుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది టెక్ లవర్స్ ఈ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. కానీ వీటి ధర అనేది ఎక్కువగా ఉండడం మూలాన చాలా మంది కాంప్రమైజ్ అయి వేరే ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అటువంటి ఐ ఫోన్ కోసం చాలా దేశాల్లో తిండీ తిప్పలు మానేసి లైన్లు కడుతుంటారు. అలా […]

Share:

ఐఫోన్ .. ఐఫోన్.. ఐ ఫోన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఐ ఫోన్ నామ జపమే నడుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది టెక్ లవర్స్ ఈ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. కానీ వీటి ధర అనేది ఎక్కువగా ఉండడం మూలాన చాలా మంది కాంప్రమైజ్ అయి వేరే ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అటువంటి ఐ ఫోన్ కోసం చాలా దేశాల్లో తిండీ తిప్పలు మానేసి లైన్లు కడుతుంటారు. అలా ఉంటుంది ఐ ఫోన్ క్రేజ్. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఐ ఫోన్ కంపెనీ తన కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసింది. ఈ ప్రొడక్టులు అలా లాంచ్ అయ్యాయో లేదో ఇలా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. స్టాక్ లేవనే బోర్డులు దర్శనం ఇచ్చినా కానీ కొంటే యాపిల్ ఫోన్ నే కొనాలని చాలా మంది వెయిట్ చేస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం ఈ ప్రొడక్టు ధరను తట్టుకోలేక వేరే ప్రొడక్టును కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతుంటారు. మనం ఐ ఫోన్ కొనుగోలు చేయకపోయినా కానీ కింద పేర్కొన్న కొన్ని ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. మనం కొన్ని రకాల ఫోన్లను కొనుగోలు చేసి ఐ ఫోన్ వంటి ఫీచర్లను తక్కువ ధరలకే పొందొచ్చు. అవేంటంటే.. 

ఐ ఫోన్ 14 

ఐ ఫోన్ 14 అనేది ఐ ఫోన్ 15 కంటే తక్కువ ధరలో మీకు లభిస్తుంది. మీరు ఐ ఫోన్ 15ను కొనుగోలు చేయలేకపోతే తక్కువ ధరలో ఐ ఫోన్ 14ను కొనేయొచ్చు. మీకు కొన్ని ఫీచర్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఈ రెండు మోడల్స్ మధ్య దాదాపు రూ. 15 వేల ధర వ్యత్యాసం ఉంటుంది. ఐ ఫోన్ 14 కూడా మంచి స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన కెమెరా ఉంటుంది. ఇక సాఫ్ట్ వేర్ పరంగా ఈ ఫోన్ కు వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఐ ఫోన్ 15 మరియు ఐ ఫోన్ 14 అనేవి రెండు కూడా వెనకాల నుంచి చూస్తే సేమ్ ఒకేలా కనిపిస్తాయి. 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23  

సామ్ సంగ్ కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ట్రెండ్ సెటర్ గా కొనసాగుతోంది. మార్కెట్లోకి ఎన్ని రకాల కంపెనీలు వచ్చినా కానీ సామ్ సంగ్ ఫోన్లను మాత్రం అవి బీట్ చేయలేకపోయాయి. సామ్ సంగ్ కంపెనీ ఎక్కువ ధర ఫోన్లతో పాటుగా తక్కువ ధరకు వచ్చే ఫోన్లను కూడా అందిస్తోంది. ఇక ఇటీవల కంపెనీ రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్ 23 అనేది టెక్నాలజీలో దిట్టగా ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఇది శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌ సెట్ తో వస్తుంది. ఇక కెమెరాకు వస్తే ఇందులో  ప్రైమరీ కెమెరాతో సహా బహుముఖ ట్రిపుల్ కెమెరా సెటప్‌ వస్తుంది. 

గూగుల్ పిక్సెల్ 8 ప్రో… 

గూగుల్ అందించే ఫోన్లలో పిక్సెల్ ఫోన్లు బెటర్ గా ఉంటాయి. ఇందులో ఉండే కెమెరా అనేది ఎంతో బెటర్ గా ఉంటుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో ఉండే పిక్సెల్ ఫోన్స్ అద్భుతమైన ఫొటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ అనుభవాన్ని అందిస్తాయి. దీని 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ ప్లే ఐఫోన్ 15 ప్లస్ వలె పెద్దదిగా ఉంటుంది. అంతే కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌ తో ఇది వస్తుంది. 

వన్ ప్లస్ 11

మార్కెట్లో ఐ ఫోన్ ను పోలి ఉండే మరో ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్. ఇది తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇది కస్టమర్ల ద్వారా ఎంతో విశ్వసనీయతను అందుకుంది. ఇందులో ఉండే ఫాస్ట్ చార్జింగ్ మోడ్ త్వరగా చార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఇందులో 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఐ ఫోన్ కు ధర ఎక్కువ అయిందని మీరు అనుకున్నపుడు ఈ మోడల్స్ ను మీరు ట్రై చేయొచ్చు.