భారత్‌లో 2023 సుజుకి హయాబుసా బైక్ లాంచ్! ఫీచర్స్ అదరహో!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకి.. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి ఏ కొత్త మోటార్ సైకిల్ తీసుకువచ్చినా కూడా, అది ఓ పెద్ద విశేషమే అవుతుంది. సుజుకి భారత్ మార్కెట్లోకి కొత్త హయబుసా మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఇంజన్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కూడా.. నూతన ఉధ్గార ప్రమాణాలకు అనుగుణంగా ఓబిడి -2 తో పాటు ఈ బైక్ ను మూడు కొత్త రంగులలో తన కస్టమర్స్‌కి అందుబాటులోకి తీసుకువచ్చింది. […]

Share:

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకి.. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి ఏ కొత్త మోటార్ సైకిల్ తీసుకువచ్చినా కూడా, అది ఓ పెద్ద విశేషమే అవుతుంది. సుజుకి భారత్ మార్కెట్లోకి కొత్త హయబుసా మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఇంజన్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కూడా.. నూతన ఉధ్గార ప్రమాణాలకు అనుగుణంగా ఓబిడి -2 తో పాటు ఈ బైక్ ను మూడు కొత్త రంగులలో తన కస్టమర్స్‌కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ. దీని ధరను రూ. 16.90 లక్షలుగా నిర్ణయించింది. గత మోడల్‌తో పోలిస్తే ఇది 40,000 అదనం. బుకింగ్స్ కూడా మొదలైనట్లు ఈ కంపెనీ తాజా ప్రకటనలో తెలిపింది. 

సుజుకి కొత్త హయబుసా మోటార్ సైకిల్‌ను మూడు డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బైక్ వైట్, మెటాలిక్ గ్రే, నలుపు రంగులలో లభిస్తుంది..

ఫీచర్స్: 

సుజుకి కొత్త హయబుసా లో ఆల్ రౌండ్ ఎల్ఈడి లైటింగ్ ఉన్నాయి. టర్న్ ఇండికేటర్స్ పక్కన ఉన్న ఫేరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్  ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో టి.ఎఫ్.టి డిస్‌ప్లే కూడా ఉంటుంది. దీని ద్వారా యాంటీ లిఫ్ట్ కంట్రోల్ సిస్టం యాక్టివ్ స్పీడ్ లిమిటెడ్, కంబైన్డ్ బ్రేక్ సిస్టం, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టం వంటి అధునాతన ఫీచర్లను జోడించారు. దీని ఫ్రంట్, రియర్, సైడ్ ఫెయిరింగ్‌లో క్యాండీ రెడ్ హైలైట్లు ఉంటాయి.

ఇంజిన్: 

లేటెస్ట్ హాయబుసా ఇంజన్. దీనికి ఎటువంటి అప్డేట్స్ చేయలేదు. కాబట్టి ఇందులో అదే 1340 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బి.హెచ్.పి పవర్ 142 ఎంఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్ ద్వి బై డైరెక్షనల్ క్విక్ షిప్టర్‌తో పాటు ఆరు స్పీడ్ గేర్ బాక్సులతో జత చేయబడి ఉంటుంది.  పైగా ఇది మంచి పనితీరును కూడా అందిస్తుంది.  అల్యూమినియం ఫ్రేమ్ కలిగి, అడ్జస్టబుల్ యు.ఎస్.డి ఫోర్క్ వెనుక భాగంలో మోనోషోక్ యూనిట్ ను కలిగి ఉంటుంది.  ముందు భాగంలో డ్యూయల్ 320 మినీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రహ్మో స్టైల్ సింగిల్ పార్ట్ కాలిబర్‌,  వెనుకవైపు మిస్సింగ్ సింగిల్ పార్ట్ కాలిబర్‌ కలిగి ఉండి, 260 డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.

ఇండియాలో మూడవ తరం హయబుసా బైక్ పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమేడ తెలిపారు.. హయబుసా మోటార్‌ సైకిల్ స్టైలింగ్, పనితీరు కారణంగా ప్రపంచంలో కల్ట్ హోదా పొందింది. మా గుర్గావ్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి సుమారు అన్ని యూనిట్లు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో సేల్ చేశాయి. ఈ రెస్పాన్స్ చూసి, ఈ ఐకానిక్ సుజుకి మోటార్‌ సైకిల్‌ ను కొత్త కలర్ సిరీస్‌లో, OBD2-A కంప్లైంట్ మోడల్‌ను పరిచయం చేయాలని అనుకున్నాం. ప్రీమియం రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే కస్టమర్లు, ఈ కొత్త షేడ్స్‌ను ఇష్టపడతారని నమ్ముతున్నాం అని కెనిచి తెలిపారు.