చిన్ననాటి స్నేహితుల‌ను కలిపిన లింక్డ్ఇన్

ఒకరి చిన్న నాటి స్నేహితులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ సాయపడింది. వేదిక అనే ఒకావిడ మైక్రోబ్లాగింగ్ సైట్లోని తన చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకున్న సంతోషంలో, ఇలా రాశారు “మా పాఠశాలలో మా ప్రారంభ సంవత్సరాల్లో కలిసి ఉండేవాళ్ళము, మళ్ళి కలుస్తామని అనుకోలేదు” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఆమె పాఠశాలను విడిచి పెట్టడం వలన, స్నేహితులతో కనెక్షన్ పోయింది. చిన్ననాటి స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి 15 ఏళ్ల తర్వాత లింక్డ్ఇన్ ఎలా […]

Share:

ఒకరి చిన్న నాటి స్నేహితులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ సాయపడింది. వేదిక అనే ఒకావిడ మైక్రోబ్లాగింగ్ సైట్లోని తన చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకున్న సంతోషంలో, ఇలా రాశారు “మా పాఠశాలలో మా ప్రారంభ సంవత్సరాల్లో కలిసి ఉండేవాళ్ళము, మళ్ళి కలుస్తామని అనుకోలేదు” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఆమె పాఠశాలను విడిచి పెట్టడం వలన, స్నేహితులతో కనెక్షన్ పోయింది. చిన్ననాటి స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి 15 ఏళ్ల తర్వాత లింక్డ్ఇన్ ఎలా సహాయపడిందో “సో లక్కీ”: చిన్ననాటి స్నేహితులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ ఎలా సహాయపడిందో” అన్న మైక్రోబ్లాగింగ్ సైట్లోని ఆమె సంతోషంతో రాసిన లైన్స్ నిరూపిస్తున్నాయి.

పాత స్నేహితులని వెతకటం ఎలా? 

నిజానికి ఈరోజుల్లో అందరం మాటల్లో కన్నా సోషల్ మీడియా లోనే కనెక్ట్ అయ్యి ఉన్నాము. చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడని రోజులలో మనకి దూరమైన స్నేహితులను మళ్లీ కలిసేందుకు సోషల్ మీడియా వేదికగా మారింది. కొంతమంది ఉద్యోగాలకోసం వర్కింగ్ ప్రొఫెషినల్స్ తో కనెక్ట్ అవ్వటానికి కూడా లింక్డిన్ వాడుతున్నారు. అయితే స్నేహితులతో కనెక్ట్ అయ్యి ఉండటానికి ఫేస్బుక్ అనేది ఎప్పటి నుంచో వేదికగా ఉంది. మరి ఇంకొంతమంది ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఆక్టివ్ గా ఉన్నారు. ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరో ఒకరితో ఎక్కడో అక్కడ కనెక్ట్ అయ్యే ఉన్నారు. అయితే ఈ మధ్య పని ఒత్తిడి వలన స్నేహితులు ఫ్రెండ్షిప్ డే కి కూడా కలుసుకోలేని పరిస్థితి. అయితే అందరం మన అకౌంట్లను ఓపెన్ గా పెట్టుకోము, కొంతమంది అయితే వారి పేరు కాకుండా ఇంకా ఏవేవో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, లేదా వారికి నచ్చిన పేజీలు నడుపుతూ ఉన్నారు సోషల్ మీడియా లో. అందుకని కనెక్ట్ అయ్యి ఉన్నవారితో టచ్ లో ఉండొచ్చు కానీ కొత్తగా పాత స్నేహితులని వెతకటం ఎలా?

“తూనీగా తూనీగా” కథలు ఎప్పుడు విన్నా బాగుంటాయి: 

మిస్ వేదిక “లింక్డ్ఇన్ నన్ను నా స్నేహితులతో కలిపింది” అని క్యాప్షన్ పెడుతూ తన స్నేహితురాలు బర్నాలి తో ముచ్చటించిన స్క్రీంషాట్స్ కూడా షేర్ చేసింది. అందులో వేదిక బర్నాలి గారికి చిన్ననాటి స్కూల్ ఫోటో పంపి “కుడి వైపు ఉన్నది నువ్వేనా?” అని అడగ్గా బర్నాలి గారు ఆశ్చర్యంతో “అవును నేనే! అయితే నువ్వు నిజంగానే వేదిక వా?” అని వారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి కరంగా సాగింది. అలా చిన్న వయసులో కలిసి పెరిగి, మధ్యలో విడిపోయిన స్నేహితులు ఇలా 15 ఏళ్ల తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ప్రపంచంలో, ఈ పోస్ట్ ఎంతోమందిని కదిలించింది. 3.4 లక్షల మంది ఇప్పటికే ఈ పోస్ట్ ని చూడగా రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. 

“హ్యాపీ ఎండింగ్,” అని ఒక యూజర్ అన్నాడు.”సో క్యూట్ ఓ మై గాడ్,” అని మరొక యూజర్ స్నేహితుల మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మరొకరు “స్కూల్ స్నేహం అందమైన బంధం” అని రాసుకు వచ్చారు మరికొందరు. “ఈ వీక్ లో నేను చూసిన సంతోషమైన సంబరాలు చేసుకునే విషయం ఇదే” అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. మరొకరు “చాలా అదృష్టవంతులు! గత రెండు సంవత్సరాల నుండి అతను కనీసం నా కనెక్షన్ రిక్వెస్ట్ను అంగీకరిస్తాడని ఎదురు చూస్తున్నాను” అని మరొకరు తన నిరాశని బయటపెట్టారు. “కొన్నిసార్లు సోషల్ మీడియా చాలా మంచి పనులు చేస్తుంది కదా,” కొంతమంది రాశారు.