జియో నుంచి ఒకే ప్లాన్ తో 14 OTT ప్రయోజనాలు.. ఏదో తెలుసా..!

ఇటీవల Jio కంపెనీ 14 OTT ప్రయోజనాలతో తమ ప్లాన్లలోకెల్లా అత్యంత ఖరీదైన ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. Jio అందించే అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ. 4498. ఈ ప్లాన్ 14 OTT ప్రయోజనాలతో వస్తుంది.

Courtesy: x

Share:

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో(Jio) ఎప్పటికప్పుడు అనేక కొత్త ప్లాన్‌లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల Jio తమ ప్లాన్లలోకెల్లా అత్యంత ఖరీదైన ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. Jio అందించే అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ. 4498. ఈ ప్లాన్ 14 OTT ప్రయోజనాలతో వస్తుంది. అంతేకాకుండా, సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పొందని పలు ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జియో ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 5G అపరిమిత డేటాను అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

జియో రూ. 4498 ప్రీపెయిడ్ ప్లాన్:

Reliance Jio నుండి రూ. 4498 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 మెసేజ్ లు వంటి అన్ని ప్రాథమిక ప్రయోజనాలతో వస్తుంది. దీనితో రోజుకు 2GB డేటా పొందవచ్చు.  రోజువారీ డేటా వినియోగం తర్వాత, వేగం 64 Kbpsకి పడిపోతుంది. వినియోగదారులు 14+ OTT ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో కూడా వస్తుంది.

ప్లాన్ అందించే OTT ప్రయోజనాలను ఇవే:

ఈ ప్లాన్‌ అందించే OTT ప్రయోజనాలు ఇవే. SonyLIV, ZEE5, Disney+ Hotstar, JioCinema Premium, Prime Video Mobile Edition, Discovery+, SunNXT, kanchha Lanka, Planet Marathi, Chaupal, Docubay, EpicON, Hoichoi మరియు Lionsgate Play. JioTV మరియు JioCloudతో సహా మరో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా ప్రీమియం మరియు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మినహా అన్ని OTT ప్రయోజనాలు JioTV ప్రీమియం కింద ఉంటాయి. 

ఈ ప్లాన్ నుంచి మరో ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే ఇది జియో కస్టమర్ సపోర్ట్ టీమ్ నుండి ప్రాధాన్యత మద్దతుతో వస్తుంది. JioCinema ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. రిడీమ్ చేసుకోవడానికి కూపన్ MyJio ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది.