Password: ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే పాస్​వర్డ్​లు ఇవే..

ఈ లిస్ట్ లో మీ పాస్​వర్డ్​ ఉంటే మార్చుకోండి

Courtesy: Twitter

Share:

Password: ఇతర దేశాలకు చెందిన నెటిజన్లతో పోలిస్తే భారతీయులు పాస్​వర్డ్ (Password) సెట్​ చేసుకోవడంలో వెనుకబడే ఉన్నారని నార్డ్​ పాస్​ అనే సంస్థ వెల్లడించింది. ఎక్కువ మంది భారతీయులు తమ అన్ని సోషల్​ మీడియా(Social Media) అకౌంట్లకు ఒకే రకమైన పాస్​ వర్డ్​ పెట్టుకుంటున్నారని, లేదంటే సులువైన పాస్​వర్డ్​ సెట్​ చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

ప్రస్తుత ఇంటర్నెట్​ యుగంలో మన డేటా భద్రంగా ఉండాలంటే అన్ని అకౌంట్లకు పాస్​వర్డ్​ (Password) పెట్టుకోవాల్సిందే!.. లేదంటే మన డేటా చోరీ(Data theft) అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ప్రతి ఒక్కరు తమ సోషల్​ మీడియా​ అకౌంట్ (Social Media Account) నుంచి బ్యాంక్​ అకౌంట్ వరకు ప్రతి దానికి పాస్​వర్డ్​ పెట్టుకోవడం సర్వ సాధారణం. అయితే, ఇతర దేశాలకు చెందిన నెటిజన్లతో (Netizens) పోలిస్తే భారతీయులు (Indians) పాస్​వర్డ్​ సెట్​ చేసుకోవడంలో వెనుకబడే ఉన్నారని నార్డ్​ పాస్​ అనే సంస్థ తేల్చి చెప్పింది. ఎక్కువ మంది భారతీయులు తమ అన్ని సోషల్​ మీడియా అకౌంట్లకు ఒకే రకమైన పాస్​ వర్డ్​ పెట్టుకుంటున్నారని, లేదంటే సులువైన పాస్​వర్డ్​సెట్​ చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. తద్వారా, ఆయా పాస్​వర్డ్​లు సులభంగా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచంలో ఏఏ దేశాల్లో ఎలాంటి వీక్ పాస్‌వర్డ్స్(Passwords) ఉపయోగిస్తున్నారనేదానిపై నార్డ్ సెక్యూరిటీ సంస్థ(Nord Security Company) ప్రతీ ఏటా అధ్యయనం జరుపుతుంది. 2022 కి సంబంధించిన రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2022 లో సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. సొంత పాస్‌వర్డ్ మేనేజర్ అయిన నార్డ్‌పాస్(Nordpass) నివేదిక ప్రకారం ఈ జాబితాను రిలీజ్ చేసింది నార్డ్ సెక్యూరిటీ.

మరి ఈ జాబితాలో ఇండియాలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న పాస్‌వర్డ్ ఏదో తెలుసా? “password”. అవును password అనే ఇంగ్లీష్ పదాన్నే తమ అకౌంట్లకు పాస్‌వర్డ్‌గా ఉపయోగించారు యూజర్లు. ఈ అనే పదాన్ని 3.4 మిలియన్ సార్లు అంటే 34 లక్షల సార్లు పాస్‌వర్డ్‌గా ఉపయోగించినట్టు తేలింది. ఆ తర్వాతి స్థానంలో “123456” ఉండగా మూడో స్థానంలో “12345678” ఉంది. ఇలా సుమారు 200 వీక్ పాస్‌వర్డ్స్(Week passwords) ఉన్న అకౌంట్స్‌ని హ్యాక్ చేయడానికి హ్యాకర్లకు ఒక సెకండ్ కన్నా తక్కువ టైమ్ పడుతుందని నార్డ్ సెక్యూరిటీ(Nord Security) వెల్లడించింది. మరి నార్డ్ పాస్ గుర్తించిన టాప్-20 వీక్ పాస్‌వర్డ్స్ (Week passwords) ఏవో తెలుసుకోండి. 

ఈ పాస్​వర్డ్​ ఉంటే వెంటనే మార్చేయండి..!

ఇక.. ఎక్కువ సోషల్​ మీడియా(Social Media) యూజర్లు qwerty, password, dragon, and money, asdfghjkl, asdfgh, 147258369 వంటి సాధారణ పాస్‌వర్డ్‌లను కూడా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ పాస్‌వర్డ్‌లను(Password) ఒక్క సెకనులోపే క్రాక్ చేయవచ్చని నివేదిక స్పష్టం చేసింది. భారతీయులు సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల(Password) విషయానికి వస్తే,. 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఈ పాస్‌వర్డ్‌లన్నింటినీ ఒక్క నిమిషంలోపే క్రాక్ చేయవచ్చని నివేదిక పేర్కొంది. india123 మినహా, మిగతావన్నింటినీ కేవలం 17 నిమిషాల్లో క్రాక్ చేవయచ్చని తెలిపింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ స్వంత పేర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆశ్చర్యకరంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ పేర్లను, అభిమాన నటుల పేర్లను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని నివేదిక స్ఫష్టం చేసింది. ఇలాంటి కామన్ పాస్‌వర్డ్స్‌ని(Common passwords) అకౌంట్స్‌కి పెట్టుకుంటే హ్యాకర్లు చాలా సింపుల్‌గా హ్యాక్ చేస్తారు. అందుకే స్ట్రాంగ్ పాస్‌వర్డ్(Strong Password) సెట్ చేసుకోవాలి.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి?

పాస్‌వర్డ్(Password) ఎప్పుడూ ఎక్కువ క్యారెక్టర్స్‌తో ఉండాలి. పాస్‌వర్డ్‌లో కనీసం 12 క్యారెక్టర్లు ఉండాలి. అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్లు, సింబల్స్ కలిపి పాస్‌వర్డ్ సెట్ చేయాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయడానికి పాస్‌వర్డ్ జనరేటర్(Password generator) ఉపయోగించవచ్చు. ఒకే పాస్‌వర్డ్‌ని వేర్వేరు అకౌంట్లకు(Accounts) ఉపయోగించకూడదు. అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ ఉంటే హ్యాకర్ల(Hackers) పని చాలా ఈజీ అవుతుంది. మీ అకౌంట్స్‌లో ఒకటి హ్యాక్ అయితే మిగతా అకౌంట్స్ రిస్కులో పడ్డట్టే. అందుకే ప్రతీ అకౌంట్‌కు కొత్త పాస్‌వర్డ్ ఉండాలి. ఒకే పాస్‌వర్డ్‌ని ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. నిత్యం పాస్‌వర్డ్స్ మారుస్తూ ఉండాలి. మీ అకౌంట్స్ అన్నింటినీ అప్పుడప్పుడూ రివ్యూ చేస్తూ పాస్‌వర్డ్ మార్చాలి. వీక్ పాస్‌వర్డ్స్ ఉంటే మార్చేసి స్ట్రాంగ్ పాస్‌వర్డ్(Strong Password) సెట్ చేసుకోవాలి.