Open AI: సంచలన నిర్ణయం తీసుకున్న ఓపెన్ ఏఐ

సామ్ ని సీఈవోగా తొలగించిన బోర్డు

Courtesy: Twitter

Share:

Open AI: ఈ రోజుల్లో అత్యంత ఆదరణ పొందిన టూల్ (Tool) ఏదైనా ఉందా అంటే అది ఓపెన్ AI (Open AI) అందించిన చాట్ జీపీటీ (Char GPT)నే అని అంతా ఠక్కున చెబుతారు. అంతలా ప్రజాదరణను సొంతం చేసుకుంది. అనేక మందికి ఈ చాట్ జీపీటీ (Chat GPT) పనిని సులభం చేసింది. కొన్ని చోట్ల దీని వల్ల మిస్టేక్స్ జరిగినా కానీ దీని ఉపయోగం కూడా  అదే రేంజ్ లో ఉంది. అందుకోసమే అందరూ దీనిని వాడుకుంటున్నారు. ఏటికేడు ఈ సంస్థ రెవెన్యూ  (Revenue)పెరుగుతూనే ఉంది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు అత్యధిక పారితోషకం (Salary) అందుకునే వారి జాబితాలో ఉన్నారు. అందుకోసమే ఈ మధ్య ఓపెన్ AI పేరు బాగా వినిపిస్తోంది. ఈ రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన ఇన్నోవేషన్స్ లో ఓపెన్ AI (Open AI) తొలిస్థానంలో (First Place) నిలుస్తుందని అంతా కామెంట్లు చేస్తున్నారు. అంతటి ఘనతను సొంతం చేసుకున్న ఓపెన్ AI (Open AI) సంస్థ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ (Hot Topic) గా మారింది. 

సీఈవోగా సామ్ ఔట్.. 

సామ్ ఆల్ట్ మన్ (Altman) ఓపెన్ AI సంస్థ సీఈవోగా సేవలందించాడు. బోర్డు (Board) అతనిని దాని సీఈవోగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నిర్ణయం (Decision) వెంటనే అమల్లోకి వస్తుందని కూడా తెలియజేసింది. ఇలా బోర్డు సీఈవో (CEO) గా తొలగించిన తర్వాత ఆల్ట్ మన్ ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికర కామెంట్ (Comment) చేశారు. ఇది చాలా విచిత్రమైన అనుభవం అని తెలిపారు. అయితే ఇది మీరు జీవించి ఉన్నపుడే మీకు అందే ప్రశంసలను చదివే అవకాశాన్ని కూడా ఇస్తుందని వెల్లడించాడు. సామ్ సారధ్యంలోనే ఓపెన్ AI  (Open AI)సంస్థ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అతడి ఆలోచనలు కనుక లేకపోతే ఓపెన్ AIకి ఇంత ఆదరణ దక్కి ఉండేది కాదు. అటువంటి సీఈవోను కంపెనీ నిర్దాక్షిణ్యంగా ఫైర్ (Fire) చేసింది.  

బోర్డు మీద సెటైర్స్ 

పదవి  నుంచి తొలగించబడిన తర్వాత సామ్ ఆల్ట్ మన్ ఓపెన్ AI (Open AI) బోర్డు మీద సెటైర్స్ వేశాడు. నేను కనుక వెళ్లిపోతే.. తన వద్ద ఉన్న షేర్ల (Shares) కోసం ఓపెన్ AI బోర్డు తన వెనకాల రావాలని తెలిపాడు. ఇలా పదవిని కోల్పోవడం ఓ వింత అనుభవం (Different Experience) అని వెల్లడించాడు. శుక్రవారమే బోర్డు కంపెనీ నుంచి ఆల్ట్ మన్ ను తొలగించింది. 

నమ్మకం లేదు.. 

సామ్ ఆల్ట్ మన్ మీద కంపెనీ (Company) తీవ్ర ఆరోపణలు చేసింది. అతడి సామర్థ్యం మీద బోర్డుకు (Board) నమ్మకం లేదని పేర్కొంది. నమ్మకం (Believe) లేదు కాబట్టే అతడిని సీఈవో పదవి నుంచి తొలగించామని వెల్లడించింది. అతను బోర్డుతో తన కమ్యూనికేషన్‌ (Communication) లలో స్థిరంగా నిజాయితీగా లేడని, దాని బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యానికి (Capability) ఆటంకం కలిగిస్తున్నాడని పేర్కొంది. ఆల్ట్‌మన్‌ తో కలిసి, ఓపెన్ AI (Open AI) ప్రెసిడెంట్ మరియు సహ-వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌ మాన్ కూడా ట్విటర్ లో ఒక పోస్ట్‌ (Post) చేవారు. ఈ రోజు బోర్డ్ చేసిన పనికి తాను దిగ్భ్రాంతి చెందానని అంతేకాకుండా బాధపడ్డానని అతడు వెల్లడించాడు. బోర్డ్‌ లోని ఈవెంట్‌ ల టైమ్‌ లైన్‌ ను పంచుకున్నారు. 

మధ్యలోకి గ్రోవర్… 

ఇలా సామ్ ఆల్ట్ మన్ తన ఆవేదనను వెలిబుచ్చుతున్న సమయంలో మధ్యలోకి భారత్ పే (Bharat Pe)  కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్ ఎంట్రీ ఇచ్చారు. అష్నీర్ అవినీతి చేశాడని ఆరోపిస్తూ భారత్ పే బోర్డు కూడా అతడిని పదవి నుంచి తొలగించింది. అష్నీర్ ఎంట్రీ ఇచ్చి డ్యూడ్ మనం బోర్డుల మీద ఫైట్ (Fight) చేద్దాం. మనకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు పోరాడదాం. వారు క్రిమినల్ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తారని, తనను కూడా కేసులతో భయపెట్టాలని చూశారని అన్నాడు. అయినా కానీ తాను భయపడకుండా నా షేర్ల కోసం యుద్ధం (War) చేస్తున్నానని తెలిపారు. నిన్న మొన్నటి వరకు టెక్నాలజీ ఉయోగంతో వార్తల్లో నిలిచిన ఓపెన్ AI (Open AI) సంస్థ ఇప్పుడు సడెన్ గా సీఈవోను ఫైర్ చేసి వార్తల్లో నిలిచింది. అసలు ఓపెన్ AI తన సీఈవోను తొలగించేందుకు గల కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. బోర్డు వెల్లడించిన కారణం చూసి చాలా మంది ఇది నమ్మేలా లేదని అంటున్నారు. బోర్డులో ఏదో కుట్రలు చేస్తున్నారని అందుకే సామ్ ఆల్ట్ మన్ ను ముందుగా తొలగించారని చెబుతున్నారు. ఎవరెన్ని వేసినా సామ్ ఆల్ట్ మన్ ను ఎవరూ ఏం చేయలేరని చెబుతున్నారు.