చాహాల్ ఆర్సిబిలో ఎందుకు ఉండ‌లేక‌పోయాడు

యుజ్వేందర్ చాహల్ ఒక భారత క్రికెటర్. అతని ప్రయాణం 2014 నుంచి మొదలైంది. చాహల్ ఒక లెగ్స్పిన్నర్ ఈయన ఆటకు ఎంతోమంది అభిమానులు ఈ దేశమంతా ఉన్నారు. ఈయన దాదాపు నూట నలభై మ్యాచులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ సీజన్లో  ఆడారు. ఈయన అంతర్జాతీయ క్రికెటర్స్ లో ఒకరు. ఈయన 2021 ఐపిఎల్ సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉండేవారు. ఆ తర్వాత సీజన్ నుంచి బెంగళూరు టీం చాహాల్ని నిలుపుకోలేదు. […]

Share:

యుజ్వేందర్ చాహల్ ఒక భారత క్రికెటర్. అతని ప్రయాణం 2014 నుంచి మొదలైంది. చాహల్ ఒక లెగ్స్పిన్నర్ ఈయన ఆటకు ఎంతోమంది అభిమానులు ఈ దేశమంతా ఉన్నారు. ఈయన దాదాపు నూట నలభై మ్యాచులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ సీజన్లో  ఆడారు. ఈయన అంతర్జాతీయ క్రికెటర్స్ లో ఒకరు.

ఈయన 2021 ఐపిఎల్ సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉండేవారు. ఆ తర్వాత సీజన్ నుంచి బెంగళూరు టీం చాహాల్ని నిలుపుకోలేదు. ఈ విషయంపై చాలా విమర్శలు వస్తున్నాయి. చాహల్ తన ఫ్యాన్స్ దృష్టిలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్  అని చెప్తారు.

2021 ఐపీఎల్ సీజన్ తర్వాత నుంచి బెంగళూరు టీం చాహల్ని నిలపకపోవడం అతని చాలా బాధ పెట్టింది. చాహల్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ చాలా విషయాలు చెప్పాడు. చాహల్ తన గత ఎనిమిది సంవత్సరాలుగా బెంగళూరు టీం లో పనిచేశాడని కానీ ఏనాడు తన టీం తనకు క్లోజ్ అవ్వలేదని చెప్పాడు. ఈ విషయంపై విరాట్ కోహ్లీ కూడా చాలా బాధపడినట్లు చెప్పాడు. విరాట్ కోహ్లీ తన మొదటి మ్యాచ్ నుంచి తనపై చాలా నమ్మకం పెట్టుకున్నట్లు ఆ నమ్మకాన్ని చివరిదాకా కొనసాగిస్తానని చెప్పాడు. ఆక్షన్ టైంలో చాహల్ పై ఒక బిడ్ కూడా వేయలేదని అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాడు. చాహల్ తాను చాలా ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తాడని చాలామంది చెప్పుకుంటే విన్నాడని చెప్పాడు. ఆ విషయం పై స్పందించిన చాహల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

యుజ్వేంద్ర చాహాల్కి అవమానం: 

ఆక్షన్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ చాహల్పై బిడ్ వేసింది. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం ఒక బిడ్ కూడా అతని పై వెయ్యలేదు. తానే గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్సిబి కి పని చేశానని చిన్న స్వామి స్టేడియం తనకి చాలా ఇష్టమైన స్టేడియం అని తెలిపాడు.

ఆ తరువాత చాహల్ రాజస్థాన్ రాయల్స్ టీంలో డెత్ బౌలర్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ టీం అతన్ని ఎంపిక చేసుకుంది. చాహల్ వల్ల రాజస్థాన్ రాయల్స్ టీం ఐదు నుండి పది శాతం టీం గ్రోత్ కనిపించినట్లు చెప్పాడు. చాహల్ ఎక్కువగా 16 నుంచి 17వ ఓవర్ బవుల్ చేసేవాడు. ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్లో ఇలాంటివి ఎదుర్కోవాలని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ టీం సహాయం చేసిందని చెప్పాడు. ఆర్సిబి నుంచి ఎటువంటి కాల్ రాకపోవడం బాధాకరమని తెలిపాడు. 

తన ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో ఈనాడు ఆర్సిబి టీం అతనికి దగ్గర అవ్వలేదని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ టీం 6.50 కోట్లకు తనని బిడ్ చేసిందని చెప్పాడు. తాను ఆర్సిబి టీం లో ఉన్నప్పుడు డబ్బు విషయంలో ఎటువంటి డిమాండ్ చేయలేదని చెప్పాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ టీం లో ఆడటం చాలా మంచి అనుభూతి అని చెప్పాడు. కానీ ఆర్సిబి టీం తో అనుబంధం మాత్రం ఎప్పుడూ ఉంటుందని అలాగే రాజస్థాన్ రాయల్స్  టీం తో పనిచేయడం చాలా మంచి అనుభూతి అని రాజస్థాన్ రాయల్స్ టీం తనకు చాలా సహాయం చేసిందని తెలిపాడు. ఈ వివరాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చాహల్ చెప్పాడు.