Yuvraj Singh: తను, ఎంఎస్ ధోని క్లోజ్ ఫ్రెండ్స్ కాదంటున్న యువరాజ్ సింగ్

Yuvraj Singh: భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లలో ఇద్దరు, యువరాజ్ సింగ్ (Yuvraj Singh), మరొకరు MS ధోనీ. సంవత్సరాలుగా భారతదేశ జాతీయ క్రికెట్ (Cricket) జట్టులో అద్భుతాలు చేసారు. కొన్ని అతిపెద్ద ట్రోఫీలను గెలుచుకున్నారు. ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు రిటైర్ అయ్యారు, క్రికెట్ (Cricket) ఫీల్డ్ వెలుపల తమ వ్యక్తిగత జీవితాలను ఆస్వాదిస్తున్నారు. కానీ, వారి వ్యక్తిగత సంబంధం, ఒకరి మధ్య ఒకరికి ఉన్న సన్నిహిత్యం గురించి ఇటీవల మాట్లాడడం జరిగింది […]

Share:

Yuvraj Singh: భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లలో ఇద్దరు, యువరాజ్ సింగ్ (Yuvraj Singh), మరొకరు MS ధోనీ. సంవత్సరాలుగా భారతదేశ జాతీయ క్రికెట్ (Cricket) జట్టులో అద్భుతాలు చేసారు. కొన్ని అతిపెద్ద ట్రోఫీలను గెలుచుకున్నారు. ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు రిటైర్ అయ్యారు, క్రికెట్ (Cricket) ఫీల్డ్ వెలుపల తమ వ్యక్తిగత జీవితాలను ఆస్వాదిస్తున్నారు. కానీ, వారి వ్యక్తిగత సంబంధం, ఒకరి మధ్య ఒకరికి ఉన్న సన్నిహిత్యం గురించి ఇటీవల మాట్లాడడం జరిగింది యువరాజ్ సింగ్ (Yuvraj Singh). క్రికెట్ (Cricket) గ్రౌండ్ బయట MS ధోనితో తనకున్న సాన్నిహిత్యం గురించి యువరాజ్‌కి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

క్లోజ్ ఫ్రెండ్స్ కాదంటున్న యువరాజ్ సింగ్: 

టిఆర్‌ఎస్ క్లిప్‌ చాట్‌లో మాట్లాడిన యువరాజ్, తాను మరియు ధోని స్నేహితులు (Friends) అని అంగీకరించారు, ఎందుకంటే ఇద్దరూ కలిసి భారతదేశం కోసం క్రికెట్ (Cricket) ఆడారు. అయితే మరోవైపు తమ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ (Friends) కాదు అంటూ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), తమ వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడటం జరిగింది.

నిజానికి యువరాజ్ సింగ్ (Yuvraj Singh), ధోని సన్నిహిత మిత్రులు కాదని.. క్రికెట్ (Cricket)‌ వల్ల స్నేహితులం (Friends) అయ్యి, కలిసి ఆడాం అంటూ వెల్లడించాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). ఎంఎస్ ధోని (MS. Dhoni) లైఫ్‌స్టైల్‌, తన లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉండేదని, అందుకే తామిద్దరూ ఎప్పుడూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాలేకపోయారని, క్రికెట్ (Cricket)‌ వల్ల మాత్రమే స్నేహితులం (Friends) అయ్యామని చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). తాను, ఎంఎస్ ధోని (MS. Dhoni), ఇద్దరు కలిసి ఆడిన ప్రతి క్రికెట్ (Cricket) మ్యాచ్ లో 100% ఎఫర్ట్ పెట్టే వాళ్ళమని.. భారత జట్టులో ఆడేటప్పుడు ఎంఎస్ ధోని (MS. Dhoni) కెప్టెన్, తాను వైస్ కెప్టెన్ గా వ్యవహరించడం తను ఎప్పుడూ గౌరవంగానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). 

కానీ కొన్ని కొన్ని విషయాలలో ఎంఎస్ ధోని (MS. Dhoni), తనకి నచ్చని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని మాట్లాడాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). అయితే ప్రతి జట్టులో ఇది జరిగే విషయమే అంటూ మాట్లాడాడు. కానీ తన కెరీర్ చివరిలో, ఎంఎస్ ధోని (MS. Dhoni) సలహా తీసుకోవాలని యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రయత్నించాడని వెల్లడించాడు. అయితే తనని సెలక్షన్ కమిటీ తీసుకోకపోవచ్చు అంటూ, 2019 ప్రపంచ కప్ కి ముందు, ఎంఎస్ ధోని (MS. Dhoni) తనకి చెప్పిన విషయం ఇప్పటికీ గుర్తుందని వెల్లడించాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh). అయితే క్రికెట్ (Cricket) కి సంబంధించి ప్రతి జట్టులో ఒకరికొకరు స్నేహితులుగా (Friends) ఉండాల్సిన అవసరం లేదని.. కానీ మైదానంలోకి అడుగు పెట్టిన అనంతరం ప్రతి ఒక క్రికెట్ (Cricket) తమదైన శైలిలో ఆట తీరును ప్రదర్శించాల్సి ఉంటుందని యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నొక్కి చెప్పాడు. కొన్ని మ్యాచ్లలో ఎంఎస్ ధోని (MS. Dhoni)కి తాను సహాయం చేయగా, మరికొన్ని మ్యాచులలో ఎంఎస్ ధోని (MS. Dhoni),  తనకి సహాయం చేశాడని యువరాజ్ సింగ్ (Yuvraj Singh) వెల్లడించాడు.

యువరాజ్ సింగ్ గురించి మరింత: 

1981, డిసెంబరు 12 న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) భారత దేశపు క్రికెట్ (Cricket) క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2000 నుంచి వన్డే క్రికెట్ (Cricket) లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్ (Cricket) లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ (Cricket) విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. భారత ప్రభుత్వం నుండి అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2019 సంవత్సరం జూన్ 10 తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు.