Yuvraj Singh: రెండుసార్లు డెంగ్యూ ఉన్నా ఆడాను అంటున్న యువ‌రాజ్ సింగ్

ప్రపంచ కప్ 2023(World Cup 2023)లో భాగంగా శనివారం (అక్టోబర్ 14) భారత్- పాకిస్థాన్(India -Pakistan) జట్ల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. భారత జట్టు ఏడేళ్ల తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌తో ఆడుతోంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, శ్రీలంక, నెదర్లాండ్‌లపై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశాయి.భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ […]

Share:

ప్రపంచ కప్ 2023(World Cup 2023)లో భాగంగా శనివారం (అక్టోబర్ 14) భారత్- పాకిస్థాన్(India -Pakistan) జట్ల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. భారత జట్టు ఏడేళ్ల తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌తో ఆడుతోంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, శ్రీలంక, నెదర్లాండ్‌లపై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశాయి.భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. డెంగ్యూ(Dengue) కారణంగా అతడు తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) అతనికి ఫోన్ చేసి మ్యాచ్ ఆడమని అడిగాడు.

తాను శుభ్‌మన్ గిల్‌కి ఫోన్ చేసి పాకిస్థాన్‌తో ఆడాలని కోరినట్లు యువరాజ్((Yuvraj Singh)) ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కెరీర్‌లో రెండు సార్లు డెంగ్యూ సోకినప్పటికీ తాను ఆడానని యువీ గిల్‌తో చెప్పాడు. దీని తర్వాత గిల్ గురువారం అహ్మదాబాద్‌లో గంట పాటు ప్రాక్టీస్ చేశాడు. దీంతో గిల్‌(Gill) పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాకిస్థాన్‌(Pakistan)తో జరిగే మ్యాచ్‌ చాలా ముఖ్యమైనదని.. ఈ మ్యాచ్‌ ఆడాలని యువీ గిల్‌తో చెప్పాడు. యువీ మాట్లాడుతూ.. “నేను అతనికి ఫోన్ చేసి.. ‘నేను డెంగ్యూతో రెండుసార్లు ఆడాను, ప్రపంచకప్‌లో కూడా నాకు బాగాలేదు. కాబట్టి నిలబడి ఆడండి.. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. కానీ వైరల్ లేదా డెంగ్యూ నుండి కోలుకోవడం నిజంగా కష్టం. అవి శరీరం నుండి ప్రతిదీ పీల్చుకుంటాయి. గిల్‌ ఆ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని నేను భావిస్తున్నానని అన్నాడు.

Read More: Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్..

ఇక టీమ్ ఇండియా(Team India)పై చాలా ప్రశంసలు కురిపించాడు యువరాజ్. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించిందని చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohith Sharma) ఏకపక్షంగా ఆడి విజయం సాధించాడు. భారత జట్టు కూడా ఒత్తిడి పరిస్థితులకు సిద్ధంగా ఉండటంతో ఆటగాళ్లంతా పరుగులు చేస్తున్నారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల్లో ఒత్తిడి ఉంటుందన్నాడు. దీనికి టీమ్ సిద్ధంగా ఉంది, ఇది మంచి విషయం అన్నాడు.

భారత్‌-పాకిస్థాన్‌(India -Pakistan)  మ్యాచ్‌ గురించి ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుతం ఇది చర్చనీయాంశం. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. నేను ప్రజలతో మాట్లాడినప్పుడల్లా.. ఇది ఒక పెద్ద అవకాశం కాబట్టి దాని కోసం ఎదురుచూడమని నేను వారికి చెప్తాను. ఎందుకంటే.. ఈ సమయం తిరిగి వస్తుందో లేదో మీకు తెలియదు అని యువ‌రాజ్ వ్యాఖ్యానించాడు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఏ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు. ఇరు జట్లు ఏడుసార్లు ముఖాముఖిగా తలపడగా.. ప్రతిసారీ టీమ్ ఇండియా విజయం సాధించింది.

Read More: Virat Kohli: కలిసిపోయిన విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్..

11 ఏళ్ల క్రితం డిసెంబర్ 28, 2012న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇది టీ20 మ్యాచ్. ఇందులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్(Yuvaraj) 36 బంతుల్లో 72 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. అశోక్ దిండా 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యువరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.