ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయకేతనం..

తొలిసారి విజయకేతనం.. ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్ మొదటి విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి విజేతగా రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో […]

Share:

తొలిసారి విజయకేతనం..

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్ మొదటి విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి విజేతగా రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందుంచింది.

టైటిల్ ఫేవ‌రెట్‌ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ తొలి సీజ‌న్ విజేతగా నిలిచింది. టోర్నీ మొదటి నుంచి ఆల్‌ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతున్న హ‌ర్మ‌న్‌ ప్రీత్ సేన‌ ఛాంపియ‌న్‌‌గా అవ‌త‌రించింది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌‌పై హోరాహోరీగా జ‌రిగిన ఫైన‌ల్లో 7 వికెట్ల తేడాతో విజయబావుటా ఎగురవేశారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి ఢిల్లీని ఎక్కువ పరుగులు చేయకుండా క‌ట్ట‌డి చేసిన ముంబై.. ఆ త‌ర్వాత‌ కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్, నాట్ స్కీవ‌ర్ బ్రంట్ సాధికార ఇన్నింగ్స్ ఆడ‌డంతో సులువుగా విజ‌యం సాధించింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు పోరాడిన ఢిల్లీ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది.

గేర్ మార్చిన ఢిల్లీ క్యాపిటల్.. 

నాలుగో ఓవర్ వేసిన జొనాసేన్.. మాథ్యూస్ ను పెవిలియన్ పంపింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ముంబై స్కోరు వేగం తగ్గింది. అనవసరంగా షాట్లకు పోయి వికెట్లు కోల్పోవడం ఎందుకని భావించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ సీవర్ లు నిదానంగా ఆడారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నా ఐదో ఓవర్లో 2 పరుగులు రాగా.. 6, 7 ఓవర్లలో ఒక్కొక్క పరుగే వచ్చింది. తర్వాత కూడా ముంబై ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. 10 ఓవర్ వేసిన క్యాప్సీ బౌలింగ్ లో తొలి బంతికి ఫోర్ కొట్టిన కౌర్.. రెండో బంతికి సింగిల్ తీయడంతో ఆ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ తర్వాత రాధా యాదవ్ వేసిన 11వ ఓవర్లో కూడా 4 పరుగులు వచ్చాయి. వికెట్లు కాపాడుకున్న సీవర్, కౌర్ లు సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో గేర్ మార్చారు. క్యాప్సీ వేసిన 12వ ఓవర్లో ఇద్దరూ తలా ఓ ఫోర్ కొట్టారు. జొనాసేన్ బౌలింగ్ లో కూడా కౌర్.. బౌండరీ సాధించింది. రాధా యాదవ్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి కౌర్ ఫోర్ కొట్టింది. శిఖా పాండే వేసిన 16వ ఓవర్లో సీవర్ కూడా బంతిని బౌండరీకి తరలించింది. అలా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది.

ముంబై ఇండియన్స్ 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి.. 19.3 ఓవర్లలో 3 వికెట్లు పోగొట్టుకున్నా 134 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. సెమీస్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన నాట్ సీవర్.. 55 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి 60 పరుగులు తీసి నాటౌట్‌‌గా నిలబడి మరోసారి మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. 39 బంతుల్లో 5 ఫోర్లు తీసి 37 పరుగులతో రాణించింది.