వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‍పై క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా ఉంది. భారత్ వేదికగా ఈ ఏడాది టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా ప్రధానమైన ఫేవరెట్‍గా ఉంది. మెగాటోర్నీకి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ,సెలెక్టర్లు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఏ ఆటగాళ్లను తీసుకోవాలో కొందరు మాజీలు కూడా సూచనలు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ […]

Share:

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‍పై క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా ఉంది. భారత్ వేదికగా ఈ ఏడాది టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా ప్రధానమైన ఫేవరెట్‍గా ఉంది. మెగాటోర్నీకి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ,సెలెక్టర్లు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఏ ఆటగాళ్లను తీసుకోవాలో కొందరు మాజీలు కూడా సూచనలు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తాజాగా ప్రపంచకప్ కోసం తన భారత జట్టును ప్రకటించారు. మెగాటోర్నీ కోసం టీమిండియాలో ఏ ఆటగాళ్లను తీసుకోవాలో సూచించారు.

15 మంది ఆటగాళ్లతో కూడిన తన భారత జట్టును ప్రపంచకప్ టోర్నీ కోసం ప్రకటించారు సౌరవ్ గంగూలీ. ఆయన జట్టును ఎంపిక చేసుకున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, తిలక్ వర్మకు తన జట్టులో చోటువ్వలేదు దాదా. అలాగే, స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍కు కూడా ప్లేస్ ఇవ్వలేదు. ఒకవేళ ఏ బ్యాటర్ అయినా గాయపడితే తిలక్‍ను తీసుకోవచ్చని, చాహల్ బ్యాకప్ స్పిన్నర్‌గా ఎంపిక చేసుకుంటానని గంగూలీ చెప్పారు. ఏ బౌలరైనా ఫిట్‍గా లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంటానని చెప్పారు. తన జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకే ఓటేశారు సౌరవ్ గంగూలీ.

అయితే ఈ సందర్భంగా 50-ఓవర్ ఫార్మాట్‌లో మెన్ ఇన్ బ్లూను వారి మూడవ టైటిల్ విజయాన్ని సాధించగల భారత జట్టులోని ముగ్గురు స్టార్ ప్రదర్శనకారులను గుర్తించారు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్‌కి కెప్టెన్సీ చేయబోతున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్, 2015, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడినా టైటిల్ దక్కించుకోలేకపోయాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌తో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో రోహిత్ శర్మ కెరీర్‌లో కూడా రెండు ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయాననే లోటుని తీర్చుకోవడానికి రోహిత్‌కి ఇదే ఆఖరి అవకాశం..

‘కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే మొదటి వన్డే వరల్డ్ కప్. ఇదే ఆఖరి వరల్డ్ కప్ కూడా. నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడడం అసాధ్యం. టీ20 వరల్డ్ కప్ ఆడినా అది వేరు! అది వన్డే వరల్డ్ కప్‌తో సమానం కాదు. వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20ల్లో కొనసాగాలని రోహిత్ అనుకుంటే, 2024 టీ20 వరల్డ్ కప్ ఆడగలడేమో. రోహిత్‌కి గత వన్డే వరల్డ్ కప్‌లో అదిరిపోయే రికార్డు ఉంది. ఒకే ఎడిషన్‌లో 5 సెంచరీలు కొట్టడం మామూలు విషయం కాదు.

విరాట్ కోహ్లీ చాలా చక్కని ఫామ్‌లో ఉన్నాడు. కొన్ని నెలలుగా అదిరిపోయే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడుతుంది. విరాట్‌కి కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. ఈ ఇద్దరూ కచ్ఛితంగా ఆఖరి వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని కసిగా ఆడతారు. ఇక శుబ్‌మన్ గిల్ సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి ఇండియాలో అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ముగ్గురూ కలిసి నిలబడి ఆడితే, టీమిండియా వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.

అయితే, టీమిండియా తదుపరి ఆసియాకప్ ఆడనుంది. ఆగస్టు 30న ఈ టోర్నీ మొదలు అయింది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‍తో జరిగే మ్యాచ్‍తో ఆసియాకప్ పోరును భారత జట్టు మొదలుపెట్టనుంది. ఆ తర్వాత ప్రపంచకప్‍పై పూర్తి దృష్టి సారించనుంది. వన్డే ప్రపంచకప్‍కు భారత జట్టును సెప్టెంబర్‌లోనే బీసీసీఐ ప్రకటించనుంది. ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.