జరిమానాలు సగానికి తగ్గే అవకాశం

గత వేసవిలో జరిగిన గ్రాస్ కోర్ట్ ఈవెంట్‌లలో రష్యన్‌లు, బెలారసియన్‌లపై నిషేధం విధించారు. ఈ సంవత్సరం ఆ రెండు దేశాల ఆటగాళ్లను ప్రవేశించడానికి అనుమతించినట్లయితే విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టూర్ విధించిన మిలియన్ డాలర్ల (825,850 పౌండ్ల) జరిమానా, సగానికి తగ్గించబడుతుంది. గతేడాది విధించిన నిషేధం కొనసాగుతుందో లేదో వింబుల్డన్ ఇంకా ప్రకటించలేదు. 2024లో రష్యన్లు, బెలారసియన్లు పోటీలో పాల్గొనేలా చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  “దారులు వెతుకుతోంది”. “యుద్ధం ఇంకా ఉంది. నిర్ణయం మారకూడదు” అని […]

Share:

గత వేసవిలో జరిగిన గ్రాస్ కోర్ట్ ఈవెంట్‌లలో రష్యన్‌లు, బెలారసియన్‌లపై నిషేధం విధించారు. ఈ సంవత్సరం ఆ రెండు దేశాల ఆటగాళ్లను ప్రవేశించడానికి అనుమతించినట్లయితే విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టూర్ విధించిన మిలియన్ డాలర్ల (825,850 పౌండ్ల) జరిమానా, సగానికి తగ్గించబడుతుంది.

గతేడాది విధించిన నిషేధం కొనసాగుతుందో లేదో వింబుల్డన్ ఇంకా ప్రకటించలేదు.

2024లో రష్యన్లు, బెలారసియన్లు పోటీలో పాల్గొనేలా చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  “దారులు వెతుకుతోంది”.

“యుద్ధం ఇంకా ఉంది. నిర్ణయం మారకూడదు” అని 2019 వింబుల్డన్ సెమీ-ఫైనలిస్ట్ స్విటోలినా అన్నారు.

వింబుల్డన్‌ను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ లాన్ అండ్ టెన్నిస్ క్లబ్.. ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో రష్యన్, బెలారసియన్ ఆటగాళ్లపై నిషేధాన్ని కొనసాగించాలనుకుంటోందో లేదో ఇంకా చెప్పలేదు.

“నిషేధాన్ని అమలులో ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. ఇది మారాలని నేను అనుకోను” అని ప్రసూతి సెలవు నుండి మళ్ళీ వచ్చిన మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ స్విటోలినా అన్నారు.

“ఇప్పటికీ ప్రజలు బాధపడుతున్నారు, ఇప్పటికీ రష్యన్ సైనికులు అమాయక ఉక్రేనియన్లను చంపుతున్నారని స్విటోలినా అన్నారు.”

2022లో లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ (ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత.. దేశాల నుండి అన్ని ఎంట్రీలనూ నిషేధించాయి.

2022లో లాన్ టెన్నిస్ అసోసియేషన్ (LTA), ఆల్ ఇంగ్లండ్ క్లబ్ (AELTC) ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఆ దేశాల ఎంట్రీలన్నింటినీ నిషేధించాయి. WTA సంస్థలకు వరుసగా 750,000 డాలర్లు (619,485 పౌండ్ల) మరియు 250,000 డాలర్లు (206,495 పౌండ్ల) జరిమానా విధించింది. వింబుల్డన్ దాని ర్యాంకింగ్ పాయింట్లను తొలగించింది. 

అప్పీల్ తర్వాత మళ్ళీ  నిషేధం ఉండకపోతే లేదా UK ప్రభుత్వంతో ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి LTA, AELTC చేసే ప్రయత్నాలపై WTA సంతృప్తి చెందితే.. జరిమానాలు సగానికి సగం తగ్గి 500,000 డాలర్ల వరకు ఉంటాయి.

పురుషల ATP టూర్లో విధించిన ఒక మిలియన్ డాలర్ల (825,850 పౌండ్ల) జరిమానాకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్ ఖర్చులను LTA న్యాయ బృందం ఇప్పటికీ అంచనా వేస్తోంది.

పురుషుల అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ టూర్ విధించిన 1 మిలియన్ డాలర్ల (825,850 పౌండ్లు) జరిమానాకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్ ఖర్చులను లాన్ టెన్నిస్ అసోసియేషన్ యొక్క న్యాయ బృందం ఇప్పటికీ అంచనా వేస్తోంది.

వింబుల్డన్ నిషేధం కొనసాగాలని ఉక్రెయిన్‌కు చెందిన స్విటోలినా పేర్కొంది.

ఇందులో ఉన్న డబ్బు ముఖ్యమైనది అయినప్పటికీ.. వింబుల్డన్‌కు ముందు ది క్వీన్స్ క్లబ్, ఈస్ట్‌బోర్న్ లోను, మరి కొన్ని చోట్ల నిర్వహించే సాంప్రదాయ టోర్నమెంట్‌లు శాశ్వతంగా కోల్పోవచ్చు అనేది లాన్ టెన్నిస్ అసోసియేషన్ యొక్క అతిపెద్ద భయం. విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ టూర్స్ రెండూ కూడా “జాతీయత ఆధారంగా వివక్ష” కొనసాగిస్తే లాన్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పాయి.


ఈ సంవత్సరం ఏమి చేయాలనే దాని గురించి అన్ని పార్టీలు చర్చలు కొనసాగిస్తున్నందున..  టెలిగ్రాఫ్ మొదట నివేదించిన అప్పీల్‌కి సంబంధించిన వార్తలు వచ్చాయి. “విధించిన జరిమానాలను మేము ఖండిస్తున్నాము” అని లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

“అయినప్పటికీ మా ప్రస్తుత దృష్టి 2023లో జరిగే ఈవెంట్‌లకు పరిష్కారాన్ని కనుగొనడానికి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్, UK ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై ఉంది.” అని తెలిపింది.

మరి ఏమి జరుగుతుందో చూడాలి.