భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ 

సెప్టెంబరు 10, ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న 2023 ఆసియా కప్‌లో సూపర్-4 దశలో పాకిస్థాన్‌తో తలపడుతోంది భారత్. మొదటి బ్యాటింగ్ భారత్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పల్లెకెలెలో ఇటీవల జరిగిన మునుపటి మ్యాచ్ లో వర్షం మాదిరిగానే, కొలంబోలో మ్యాచ్ లో కూడా వర్షం ఒక పాత్ర పోషిస్తుంది అంటున్నారు వాతావరణ శాఖ.  మెండుగా ఉన్న వర్ష సూచిక, కానీ మ్యాచ్ని గెలిపిస్తుందా?:  కొలంబోలో పగటిపూట 93 శాతం వర్షం పడే అవకాశం […]

Share:

సెప్టెంబరు 10, ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న 2023 ఆసియా కప్‌లో సూపర్-4 దశలో పాకిస్థాన్‌తో తలపడుతోంది భారత్. మొదటి బ్యాటింగ్ భారత్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పల్లెకెలెలో ఇటీవల జరిగిన మునుపటి మ్యాచ్ లో వర్షం మాదిరిగానే, కొలంబోలో మ్యాచ్ లో కూడా వర్షం ఒక పాత్ర పోషిస్తుంది అంటున్నారు వాతావరణ శాఖ. 

మెండుగా ఉన్న వర్ష సూచిక, కానీ మ్యాచ్ని గెలిపిస్తుందా?: 

కొలంబోలో పగటిపూట 93 శాతం వర్షం పడే అవకాశం ఉంది, సాయంత్రం సమయంలో 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. కొలంబోలో ఆదివారం కూడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేయబడింది, సోమవారం కూడా ఇదే విధంగా ఉండొచ్చు అన్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇదిలా ఉండగా, రెండు రోజుల్లో ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వర్షాకాలం కారణంగా ఎప్పుడు వర్షం హఠాత్తుగా పడుతుందో తెలియని పరిస్థితి. వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ, వర్షం ఒకసారి పడొచ్చు, పడకపోవచ్చు. అయితే వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తే మాత్రం, ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 11 కు వాయిదా పడే అవకాశం ఉంటుంది.

కొలంబోలో ఇటువంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే ఊహించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సూపర్-4 దశలో పాకిస్థాన్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్‌కి రిజర్వ్ డేని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఒకవేళ వర్షం కురిసి ఆట సమయంలో ఆటను నిలిపివేస్తే, మ్యాచ్ ప్రస్తుతం ఎక్కడ వరకు అయితే జరిగిందో, ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ 11న కొనసాగుతుంది అని వెల్లడించారు మేనేజ్మెంట్. 

ఎందుకు ఈ నిర్ణయం: 

టోర్నమెంట్‌లో గత మ్యాచ్‌లు వాతావరణం వల్ల ప్రభావితమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు, నెల ప్రారంభంలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు ఆయన సంగతి అందరికీ తెలుస్తుంది.

మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు తమ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించాలని.. తాము సెప్టెంబర్ 10 కోసం తీసుకున్న టిక్కెట్లు, ఒకవేళ మ్యాచ్ సస్పెండ్ అయితే గనుక, సెప్టెంబర్ 11న జరగబోయే కంటిన్యూషన్ మ్యాచ్ కోసం ఆ టికెట్లు ఉపయోగపడుతుందని వెల్లడించారు క్రికెట్ మేనేజ్మెంట్. 

2023 ఆసియా కప్ టోర్నమెంట్ రెండవ దశకు వెళ్లింది, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా మరియు పాకిస్తాన్‌లు సూపర్-4 దశకు చేరుకున్నాయి. సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది ఫైనల్ మ్యాచ్. 

సూపర్ 4 షెడ్యూల్: 

సెప్టెంబర్ 6: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, గడాఫీ స్టేడియం, లాహోర్, స్థానిక మధ్యాహ్నం 2:30 గంటలకు

సెప్టెంబర్ 9: శ్రీలంక vs బంగ్లాదేశ్, ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 10: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 12: భారత్ vs శ్రీలంక, ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 14: పాకిస్థాన్ vs శ్రీలంక, ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 15: భారత్ vs బంగ్లాదేశ్, ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు 

చివరి:

సెప్టెంబర్ 17: TBC v TBC, R ప్రేమదాస స్టేడియం, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు స్థానికం