World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. అశ్విన్ కి ఛాన్స్..?

వరల్డ్ కప్(World cup 2023) లో సెమీస్(semis) బెర్త్ ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ఇవాళ ఇంగ్లాండ్(England) తో భారత్ బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఓడిపోని భారత్ ఈ మ్యాచ్ పై కూడా ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగగా భారత్ విజయంతో దూసుకుపోతుంటే..దీంతో టీమిండియా(Team india)లోకి హార్దిక్ పాండ్యా(Hardik pandya) స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ (Ravichandran Ashwin)ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.  సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌(World cup)లో ఎదురు […]

Share:

వరల్డ్ కప్(World cup 2023) లో సెమీస్(semis) బెర్త్ ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ఇవాళ ఇంగ్లాండ్(England) తో భారత్ బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఓడిపోని భారత్ ఈ మ్యాచ్ పై కూడా ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగగా భారత్ విజయంతో దూసుకుపోతుంటే..దీంతో టీమిండియా(Team india)లోకి హార్దిక్ పాండ్యా(Hardik pandya) స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ (Ravichandran Ashwin)ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. 

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌(World cup)లో ఎదురు లేకుండా సాగిపోతున్న టీమ్‌ఇండియా(Team india).. సెమీస్‌ బెర్తుపై గురి పెట్టింది. టోర్నీలో ఒక్క ఓటమీ లేకుండా సాగిపోతున్న ఏకైక జట్టయిన భారత్‌.. ఆదివారం (అక్టోబర్ 29) ఇంగ్లాండ్‌(England)తో పోరులోనూ ఆ రికార్డును నిలబెట్టుకుంటూ కూడా నాకౌట్‌లో అడుగు పెడుతుంది. ఇక భారత్‌ను మించి హాట్‌ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ మాత్రం ఘోరమైన ప్రదర్శన చేసింది. అయిదు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం, అది కూడా బంగ్లాదేశ్‌(Bangladesh)పై సాధించింది. అఫ్గానిస్థాన్‌, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతుల్లో ఓటమి పాలవడంతో ఆ జట్టు దాదాపుగా సెమీస్‌కు దూరమైనట్లే కనిపిస్తోంది. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, వేరే సమీకరణాలు కూడా కలిసొస్తే ముందంజ వేయగలమేమో అని ఆ జట్టు చూస్తోంది. బలమైన భారత్‌ను ఓడించి మళ్లీ గాడిన పడాలని ఇంగ్లిష్‌ జట్టు భావిస్తోంది.

రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ లక్ష్యాలను ఛేదించడంలో విజయవంతమైంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌(New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మహ్మద్ షమీ(Mohammed Shami) ఐదు వికెట్లు తీయగా, భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించారు. విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు, మరియు భారత్ మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకుంది.అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. 

అయితే ఇంగ్లండ్‍తో జరిగే ఈ మ్యాచ్‍కు కూడా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అందుబాటులో లేడు. దీంతో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ భారత తుది జట్టులో కొనసాగనున్నారు. లక్నోలోని ఎకానా పిచ్‍ స్పిన్‍కు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది. దీంతో మహమ్మద్ సిరాజ్ స్థానంలో తుది జట్టులోకి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍(Ravichandran Ashwin)ను తీసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉంది. మరి.. సిరాజ్, అశ్విన్‍లో ఎవరికి ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.

ఓపెనర్లు

ఐదు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ(Rohit sharma) ఒక సెంచరీతో పాటు మొత్తం 311 పరుగులు చేశాడు. రోహిత్ ఆట ప్రారంభంలో త్వరగా స్కోర్ చేయడంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్(Shubman Gill) పరుగులు చేయడంలో నిలకడగా ఉన్నాడు మరియు నెమ్మదిగా పిచ్ పరిస్థితుల కారణంగా అతను రాబోయే మ్యాచ్‌లో బాగా రాణిస్తాడని భావిస్తున్నారు.

మిడిల్ ఆర్డర్

ఈ టోర్నీలో విరాట్ కోహ్లి 354 పరుగులతో భారత్‌ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. అతను ఒక మ్యాచ్‌లో తన 48వ సెంచరీని సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో స్కోరింగ్ వేగాన్ని కొనసాగించడంలో శ్రేయాస్ అయ్యర్(Shreyas iyer) కీలకం మరియు అతను ఇప్పటివరకు 130 పరుగులు చేశాడు.

ఆల్ రౌండర్లు

రవీంద్ర జడేజా(Jadeja) కీలక బౌలర్‌గా, బ్యాటింగ్‌తో పాటు వికెట్లు తీశాడు. స్పిన్ అనుకూల పరిస్థితుల్లో అతను బాగా రాణిస్తాడని భావిస్తున్నారు.

ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గాయపడటంతో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యం కారణంగా ఆడే అవకాశం ఉంది.

బౌలర్లు

 జస్ప్రీత్ బుమ్రా(Bumrah) 11 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మరియు ఇన్నింగ్స్ ప్రారంభంలో మరియు చివరిలో అతని అసాధారణ బౌలింగ్‌కు పేరుగాంచాడు. కుల్దీప్ యాదవ్(Kuldeep yadav) ఇంగ్లండ్‌పై గత మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్. ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు తీయడంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కీలకపాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో 5 వికెట్లతో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు.

ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ జట్టు సత్తా చాటింది. భారత్ 3 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 4 గెలిచింది. 2011 ప్రపంచకప్ మ్యాచ్ టైగా ముగిసింది.

ఇంగ్లండ్ తుదిజట్టు (అంచనా)

డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్/హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కరన్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ