రైట్ హ్యాండర్ గా మారిన వార్నర్

డేవిడ్ వార్నర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ వల్ల వార్నర్ మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫేవరేట్ స్టార్ గా మారిపోయాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం టీమిండియా ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో కూడా ఇండియానే విజయం సాధించడంతో సిరీస్ ఇండియా కైవసం అయింది. దీంతో […]

Share:

డేవిడ్ వార్నర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ వల్ల వార్నర్ మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫేవరేట్ స్టార్ గా మారిపోయాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం టీమిండియా ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో కూడా ఇండియానే విజయం సాధించడంతో సిరీస్ ఇండియా కైవసం అయింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ ముందు పటిష్ట జట్టైన ఆస్ట్రేలియాను ఇండియా మట్టికరిపించిందని ఇండియన్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక మూడో వన్డేలో కూడా గెలిచి ఆసీస్ ను వైట్ వాష్ చేయాలని ఇండియా ఉవ్విళ్లూరుతోంది. 

ఆ రికార్డు మీద కన్నేసిన భారత్

ఇప్పటికే రెండింటికి రెండు మ్యాచెస్ గెలిచి మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న ఇండియా మూడో వన్డేలో కూడా గెలిచి ఆసీస్ ను వైట్ వాష్ చేయాలని ఆశ పడుతోంది. ఆసీస్ జట్టును వన్డేల్లో ఇండియా ఇప్పటి వరకు వైట్ వాష్ చేయలేదు. ఆసీస్ మీద వన్డే సిరీస్ గెలవడమే ఇండియాకు గగనంగా ఉండేది. అటువంటిది ఆసీస్ వంటి స్ట్రాంగ్ టీమ్ ను వైట్ వాష్ చేయాలనే ఆలోచనే ఇండియన్స్ కు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియా టీం ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని సెక్షన్లలో తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. ఎంత పెద్ద టీమ్ వచ్చినా ఆ టీంలను అలవోకగా ఓడిస్తూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే ఆసియా కప్ గెల్చుకున్న ఇండియా అదే ఊులో ఆసీస్ ను కూడా మట్టి కరిపించింది. ఇక ఆసీస్ ను వైట్ వాష్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఆసీస్ తో మొదటి వన్డేలో కన్నా రెండో వన్డేలో ఇండియా సాధికార విజయం సాధించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండో వన్డేలో మన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫామ్ లో లేడని భావిస్తున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన సత్తా ఏంటో చాటుతూ సెంచరీ సాధించాడు. అతనితో పాటు మరో బ్యాటర్ గిల్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. ఇక కెప్టెన్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ కూడా అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇండియా రికార్డు స్థాయిలో 399 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఇండియాకు ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆసీస్ ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 

రెండో వన్డేలో విచిత్ర ఘటన

ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. డేవిడ్ వార్నర్ ఇండియన్ స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ బౌలింగ్ లో కుడిచేతి వాటంతో (రైట్ హ్యాండ్ బ్యాటింగ్) బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్నర్ ఇలా రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో వారి జట్టు ఆల్ మోస్ట్ ఓటమిని అంగీకరించే స్టేజ్ లో నిలిచింది. వార్నర్ ఎంత ఒంటరి పోరాటం చేసినా కానీ కంగారూలు మాత్రం మ్యాచ్ లో గెలవలేకపోయారు. వార్నర్ ఎడమ మరియు కుడిచేతితో బ్యాటింగ్ చేస్తూ కొన్ని సాహసోపేతమైన స్ట్రోక్స్ ఆడాడు. అతను రివర్స్ హిట్‌ లతో కూడా కొన్ని చూడ ముచ్చటైన షాట్స్ ఆడాడు. వార్నర్ ఎన్ని చక్కని షాట్స్ ఆడినా కానీ అతడికి తన సహచరుల నుంచి ఎటువంటి సహకారం అందలేదు. దీంతో ఆ జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

అబాట్ ఏం చెప్పాడంటే… 

ఇలా వార్నర్ అశ్విన్ బౌలింగ్ లో రైట్ హ్యాండ్ బ్యాటర్ గా మారడంపై ఆసీస్ ఆల్ రౌండర్ సీన్ అబాట్ స్పందించాడు. నిజాయతీగా చెప్పాలంటే అది అశ్విన్ నైపుణ్యానికి నిదర్శనమని తెలిపాడు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఎడమచేతి వాటం నుంచి కుడి చేతి వాటానికి మార్చి బ్యాటింగ్ చేసినా కానీ అశ్విన్ తన లెంగ్త్ కోల్పోకుండా బంతులేశాడని తెలిపాడు.