భారత ప్రపంచ కప్ జట్టు ప్రకటన ఎప్పుడు?

క్రికెట్ 2023 ప్రపంచ కప్ దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే చాలా ప్రకటించాయి. ఆస్ట్రేలియా తమ తాత్కాలిక ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. అలాగే ఇంగ్లండ్ కూడా. రాబోయే సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌లలో ఒకటైన బలమైన జట్టును ప్రకటించింది. భారతదేశం మినహా ప్రపంచ క్రికెట్‌లోని మిగిలిన పెద్ద దేశాలన్నీ కూడా వన్డే ప్రపంచకప్‌కు ముందంజలో ఉన్నట్లు ఈ ప్రకటనలే తెలుపుతున్నాయి. మరోవైపు ఆసియా ప్రపంచ కప్‌కు పాకిస్థాన్ కూడా ఇటీవల తమ జట్టును […]

Share:

క్రికెట్ 2023 ప్రపంచ కప్ దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే చాలా ప్రకటించాయి. ఆస్ట్రేలియా తమ తాత్కాలిక ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. అలాగే ఇంగ్లండ్ కూడా. రాబోయే సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌లలో ఒకటైన బలమైన జట్టును ప్రకటించింది. భారతదేశం మినహా ప్రపంచ క్రికెట్‌లోని మిగిలిన పెద్ద దేశాలన్నీ కూడా వన్డే ప్రపంచకప్‌కు ముందంజలో ఉన్నట్లు ఈ ప్రకటనలే తెలుపుతున్నాయి. మరోవైపు ఆసియా ప్రపంచ కప్‌కు పాకిస్థాన్ కూడా ఇటీవల తమ జట్టును ప్రకటించింది. 

క్రికెటర్ల గాయాలు ఒక కారణమే: 

భారతదేశం మినహా ప్రపంచ క్రికెట్‌లోని మిగిలిన పెద్ద దేశాలన్నీ కూడా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి తమ జట్టును ప్రకటించడంతో ముందంజలో ఉన్నట్లు ఈ ప్రకటనలే తెలుపుతున్నాయి. మరోవైపు ఆసియా ప్రపంచ కప్‌కు పాకిస్థాన్ కూడా ఇటీవల తమ జట్టును ప్రకటించింది. ప్రస్తుతానికి భారతదేశం ఇంకా తమ వైపు నుంచి జట్టుని పరిచయం చేయకపోవడం గమనాహం. ప్రకటించకపోవడంకి గల కారణం కొంతమంది క్రికెట్లు గాయాల పాలు అవ్వడమే అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నా ఐదుగురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూలై 21న మెడికల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ఇంగ్లాండ్ తాత్కాలిక ప్రపంచ కప్ జట్టు:

బ్యాటర్స్:     జో రూట్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్

ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్

వికెట్ కీపర్:   జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో

బౌలర్లు:      రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా తాత్కాలిక ప్రపంచ కప్ జట్టు:

బ్యాటర్లు:      డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్

ఆల్ రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, అష్టన్ అగర్,  సీన్ అబాట్

వికెట్ కీపర్లు:    అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్

బౌలర్లు:       పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, తన్వీర్ సంఘా, మిచెల్ స్టార్క్, ఆడమ్, జంపా

ఇంగ్లండ్ వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు:

బ్యాటర్లు:     టెంబా బావుమా, డెవాల్డ్ బ్రీవిస్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రాస్సీ, వాన్ డెర్ డుసెన్

ఆల్ రౌండర్లు: మార్కో జాన్సెన్, వేన్ పార్నెల్

వికెట్ కీపర్:   క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్

బౌలర్లు:      కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, లుంగి న్గిడి, సిసంద మగల, గెరాల్డ్ కోయెట్జీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, తబ్రైజ్ షమ్సీ, కేశవ్ మహరాజ్

ప్రపంచ కప్ ఎప్పుడు: 

భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.

క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.