చాహల్ ధోని గురించి ఏం చెప్పాడు?

ఎంఎస్ ధోనీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ కొత్త కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడుతున్న 42 ఏళ్ల క్రికెటర్, అతని నాయకత్వంలో టీమ్ ఇండియాను మూడు ప్రధాన ICC ట్రోఫీలకు మార్గనిర్దేశం చేశాడు. ధోని తన ప్రశాంతత మరియు కంపోజ్డ్ స్వభావం, మైదానంలో అతని అవగాహన కోసం విస్తృతంగా ప్రాచుర్యం ఉంది. అతని సాధారణ అభిమానులతో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ను ఇతర క్రికెటర్లు కూడా మెచ్చుకుంటారు మరియు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర […]

Share:

ఎంఎస్ ధోనీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ కొత్త కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడుతున్న 42 ఏళ్ల క్రికెటర్, అతని నాయకత్వంలో టీమ్ ఇండియాను మూడు ప్రధాన ICC ట్రోఫీలకు మార్గనిర్దేశం చేశాడు. ధోని తన ప్రశాంతత మరియు కంపోజ్డ్ స్వభావం, మైదానంలో అతని అవగాహన కోసం విస్తృతంగా ప్రాచుర్యం ఉంది. అతని సాధారణ అభిమానులతో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ను ఇతర క్రికెటర్లు కూడా మెచ్చుకుంటారు మరియు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అలాంటి ఒక ఉదాహరణ.

2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ భారత క్రికెట్ టీం తో పనిచేసిన చాహల్, మైదానంలో మరియు మైదానం వెలుపల తన ఉల్లాసమైన చేష్టలకు ప్రసిద్ధి చెందాడు. అయితే, ధోనీ ముందు వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్‌గా నోరు మూసుకుని ఉంటాన‌ని లెగ్ స్పిన్నర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

ఇటీవల యుజ్వేంద్ర చాహాల్కి అవమానం: 

ఆక్షన్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ చాహల్పై బిడ్ వేసింది. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం ఒక బిడ్ కూడా అతని పై వెయ్యలేదు. తానే గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్సిబి కి పని చేశానని చిన్న స్వామి స్టేడియం తనకి చాలా ఇష్టమైన స్టేడియం అని తెలిపాడు.

ఆ తరువాత చాహల్ రాజస్థాన్ రాయల్స్ టీంలో డెత్ బౌలర్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ టీం అతన్ని ఎంపిక చేసుకుంది. చాహల్ వల్ల రాజస్థాన్ రాయల్స్ టీం ఐదు నుండి పది శాతం టీం గ్రోత్ కనిపించినట్లు చెప్పాడు. చాహల్ ఎక్కువగా 16 నుంచి 17వ ఓవర్ బవుల్ చేసేవాడు. ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్లో ఇలాంటివి ఎదుర్కోవాలని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ టీం సహాయం చేసిందని చెప్పాడు. ఆర్సిబి నుంచి ఎటువంటి కాల్ రాకపోవడం బాధాకరమని తెలిపాడు. 

తన ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో ఈనాడు ఆర్సిబి టీం అతనికి దగ్గర అవ్వలేదని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ టీం 6.50 కోట్లకు తనని బిడ్ చేసిందని చెప్పాడు. తాను ఆర్సిబి టీం లో ఉన్నప్పుడు డబ్బు విషయంలో ఎటువంటి డిమాండ్ చేయలేదని చెప్పాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ టీం లో ఆడటం చాలా మంచి అనుభూతి అని చెప్పాడు. కానీ ఆర్సిబి టీం తో అనుబంధం మాత్రం ఎప్పుడూ ఉంటుందని అలాగే రాజస్థాన్ రాయల్స్  టీం తో పనిచేయడం చాలా మంచి అనుభూతి అని రాజస్థాన్ రాయల్స్ టీం తనకు చాలా సహాయం చేసిందని తెలిపాడు. ఈ వివరాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చాహల్ చెప్పాడు. 

ధోని గురించి మరింత:

20 20 వరల్డ్ కప్ గెలిచాక వన్డేల్లో కూడా ధోనీని కెప్టెన్ గా నియమించారు. తర్వాత ధోని ఇండియా క్రికెట్ నే మార్చేశాడు. ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ గెలిపించాడు. తర్వాత 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత ధోని దూకుడు కాస్త తగ్గింది. ధోని కెప్టెన్సీ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు విజయవంతమయ్యారు. ధోని ఐపిఎల్ లో కూడా గొప్ప కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కి రీసెంట్ గా కూడా ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.