ఇషాన్ కిష‌న్‌కి ఆ రోజు విరాట్ కోహ్లీ ఏం చెప్పాడు?

ప్రస్తుతం ఇండియాకు వెస్టిండీస్ కి మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ల సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని సాధించాడు. వెస్టిండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసి, భారత జట్టుతో కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదరగొట్టాడు.  ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగిన రెండో IND vs WI టెస్ట్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఊహకి అందనంత […]

Share:

ప్రస్తుతం ఇండియాకు వెస్టిండీస్ కి మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ల సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని సాధించాడు. వెస్టిండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసి, భారత జట్టుతో కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదరగొట్టాడు. 

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగిన రెండో IND vs WI టెస్ట్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఊహకి అందనంత వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు. క్రికెట్‌లో తాను చూపించిన ఆటతీరు, వికెట్ కీపర్-బ్యాటర్ అతని మొదటి రెండు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో చూపించడంతో, కిషన్ తన రెండో ఇన్నింగ్స్ లో 4వ ప్లేయర్ పొజిషన్, అంటే విరాట్ కోహ్లీ పొజిషన్ సంపాదించుకున్నాడు.

ఇషాన్ కిషన్ మాటల్లో: 

అయితే వెస్టిండీస్ కి ఇండియా కి మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ మంచి ఆటను చక్కగా ప్రదర్శించడం జరిగింది. అయితే కేవలం 24 ఓవర్లలోనే 181/2 గల స్కోరును సాధించి చూపించారు. అయితే ఇద్దరు ఆటగాళ్లతో సాగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ముఖ్య పాత్ర పోషించాడని చెప్పుకోవాలి. కేవలం 33 బంతులలో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాకుండా 74 బంతుల్లోనే సెంచరీ చేసి భారత జట్టు రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలి. 

అయితే క్రికెటర్లు స్వేచ్ఛగా ఆడాలంటే ముందుగా కెప్టెన్ తమకు స్వేచ్ఛ ఇవ్వాలని, రోహిత్ శర్మ కాప్టెన్సీలో స్వేచ్ఛ పూర్తిగా లభిస్తుందని ఇషాన్ కిషన్ మాటల్లో తెలిపాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ఎలా క్రికెట్ సులువుగా ఆడే పద్ధతిని రోహిత్ శర్మ ఈజీగా నేర్పిస్తాడని ఆయన ప్రస్తావించాడు. అంతే కాకుండా క్రికెట్ ఆటగాళ్లకు చక్కని ప్రోత్సాహాన్ని అందించడం అతనిలో ఉన్న స్పెషాలిటీ అంటూ రోహిత్ శర్మను పొగిడాడు ఇషాన్ కిషన్. అంతేకాకుండా క్రికెట్ ఆడేటప్పుడు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, నిదానంగా ఆడే విధానం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మనకి బాగా నేర్పిస్తాడు అంటూ ఇషాన్ కిషన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఇషాన్ కిషన్, తన రెండో ఇన్నింగ్స్ లో జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడాడు. 

ఇషాన్ కిషన్ తను ఆడిన రెండో ఇన్నింగ్స్ లో, నాలుగో పొజిషన్ లో (విరాట్ కోహ్లీ పొజిషన్ లో),  ఆడినప్పుడు కూడా, తనని కెప్టెన్ రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, తనదైన ఆట శైలిలో ఆడమని అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వదు అంటూ ప్రోత్సాహాన్ని అందించినట్లు చెప్పాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలు, క్రికెటర్లకు అందించిన భరోసా అలాగే ఆత్మవిశ్వాసంతో తాను ఇప్పుడు తక్కువ సమయంలోనే అర్థ సెంచరీ పూర్తి చేయగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే టెస్ట్ మ్యాచ్‌లో బజ్ బాల్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది. కేవలం ఇది ఇంగ్లాండు టీం లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే తరహాలో మన భారత క్రికెట్ జట్టు కూడా బజ్ బాల్ అలవాటు చేసుకుంటుందా అనే క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇషాన్ కిషన్ బజ్ బాల్ గురించి కూడా ప్రస్తావించాడు. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పిచ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలని ఒక ఆటగాడికి పిచ్ మీద అవగాహన కలిగితే, క్రికెట్ విషయంలో అవలీలగా విజయం సాధించవచ్చని చెప్పుకొచ్చాడు.