ఆట‌కు ముందు ఫోన్ చూస్తే ఇండియా వ‌ర్సెస్ పాక్ అని ఉంది:  నీర‌జ్

భారత్ కు శుభవార్తల మీద శుభవార్తలు వస్తున్నాయి. మొన్నే చంద్రయాన్-3 సాధించిన విక్టరీతో ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటే తాజాగా నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. గోల్డ్ మెడల్ రావడం పెద్ద విషయమేమీ కాదు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ రాలేదు. మొట్టమొదటి గోల్డ్ మెడల్ ను నీరజ్ సాధించి పెట్టాడు. […]

Share:

భారత్ కు శుభవార్తల మీద శుభవార్తలు వస్తున్నాయి. మొన్నే చంద్రయాన్-3 సాధించిన విక్టరీతో ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటే తాజాగా నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. గోల్డ్ మెడల్ రావడం పెద్ద విషయమేమీ కాదు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ రాలేదు. మొట్టమొదటి గోల్డ్ మెడల్ ను నీరజ్ సాధించి పెట్టాడు. దీంతో నీర‌జ్‌ని దేశ వ్యాప్తంగా అంతా అభినందిస్తున్నారు. తన టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు. మళ్లా నీరజ్ మన చిరకాల ప్రత్యర్థి దాయాదిగా భావించే పాక్ మీద ఫైనల్ గెలవడం మరో కొసమెరుపు. గోల్డ్ సాధించిన నీరజ్ ను అంతా మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అతడి ప్రతిభను కొనియాడుతున్నారు. నీరజ్ నామస్మరణతో సోషల్ మీడియా మార్మోగిపోతుంది. అతడు ఓ గొప్ప క్రీడాకారుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

అవును నేను అలాగే చూశాను

ఇండియా- పాక్ పోరంటే అదో యుద్ధం లాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? హాకీ మ్యాచ్ జరుగుతుందా? లేక జావెలిన్ త్రో మ్యాచ్ జరుగుతుందా? అని ఎవరూ పట్టించుకోరు. కేవలం ఇండియా- పాక్ ఆడుతున్నాయి అని మాత్రమే చూస్తారు. నీరజ్ చోప్రా కూడా స్వర్ణం గెలిచి ఇండియాకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు. ఈవెంట్ తర్వాత మ్యాచ్ గురించి నీరజ్ వైరల్ వ్యాఖ్యలు చేశాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఎలా భావించబడిందో వివరించాడు. స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఈ పోటీని భారతదేశం – పాకిస్తాన్ మధ్య యుద్ధంగా పేర్కొన్నాడు. నీరజ్, పాక్ ప్లేయర్ అర్షద్ చాలా కాలంగా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. వీరిద్దరూ కలిసి మైదానంలోకి దిగినప్పుడల్లా భారత అథ్లెట్‌నే విజయం వరించింది. ఎన్ని సార్లు ట్రై చేసినా కానీ పాక్ ప్లేయర్ మన నీరజ్ మీద పై చేయి సాధించలేకపోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ లో కూడా నీరజ్ దెబ్బకు పాక్ ప్లేయర్ రెండో ప్లేస్ కే పరిమితం అయ్యాడు. ఈ మ్యాచ్ లో నీరజ్ 88.17 మీటర్లు బల్లెం విసిరి విజేతగా నిలిచాడు. మరోవైపు నదీమ్ 87.82 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

మ్యాచ్ ముందు అది చేయను.. 

పోటీి కోసం ఎలా ప్రిపేర్ అవుతాడో నీరజ్ చోప్రా తెలిపాడు. దీంతో అతడిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. పోటీ తర్వాత నీరజ్ మాట్లాడుతూ.. పోటీకి ముందు మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించనని, కానీ ఈ రోజు నేను దానిని చూశానని చెప్పుకొచ్చాడు. ఇలా మొబైల్ చూసినపుడు కనిపించిన మొదటి విషయం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పాడు. కానీ చరిత్ర చూస్తే యూరోపియన్ అథ్లెట్లు చాలా ప్రమాదకరమైన వారని రికార్డులు చెబుతున్నాయి. ఇంత వరకు జరిగిన పోటీల్లో వారే విజేతలుగా నిలిచారు. వారు పెద్ద పెద్ద త్రోలు చేయగలరని మునుపటి మ్యాచ్ ల స్టాట్స్ పేర్కొంటున్నాయని నీరజ్ తెలిపాడు. కానీ ఇండియాలో భారత్-  పాక్ మ్యాచ్ అనే ఎక్కువ మందికి ఆసక్తి ఉంటుందని వెల్లడించాడు. ఈ పోటీలు బుడాపెస్ట్‌లో జరిగాయి. 

తదుపరి టోర్నీ అదే

బుడాపెస్ట్ పోటీల్లో స్వర్ణంతో దేశ కలను సాకారం చేసిన త్రోయర్ నీరజ్ చోప్రాకు దేశం జేజేలు పలుకుతోంది. ఫైనల్లో నీరజ్ చేతిలో ఓడిపోయిన పాక్ ప్లేయర్ అర్షద్ తో కలిసి అతడు త్వరలో ఆసియా గేమ్స్ లో  పాల్గొనబోతున్నాడు. కేవలం ఇందులో ఆసియా జట్లు మాత్రమే పాల్గొంటాయి కాబట్టి ఆసియా గేమ్స్ లో ఇండియా- పాక్ మ్యాచ్ ఫీవర్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని నీరజ్ కూడా ప్రస్తావించాడు. ఆసియన్ గేమ్స్‌లో భారత్ – పాక్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. తాను రిలాక్స్‌గా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు ట్రై చేస్తానని వెల్లడించాడు. అనవసరమైన టెన్షన్లను దగ్గరికి రానీయనని తెలిపాడు. చాలా రిలాక్స్ గా ప్రిపేర్ అవుతానన్నాడు. ఇదే నీరజ్ సక్సెస్ సీక్రెట్ అని అంతా కామెంట్లు చేస్తున్నారు.