సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ పోస్ట్

విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ రన్ మెషీన్. విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. 34 సంవత్సరాల వయసులో కూడా కోహ్లీ చాలా ఫిట్ గా ఉంటాడు. ఇండియన్ టీంకి ఫిట్ నెస్ స్టాండర్డ్స్ నేర్పిందే కోహ్లీ అని చాలా మంది కామెంట్  చేస్తూ ఉంటారు. కోహ్లీ ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యతను మనం చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఇండియన్ టీంలో ఎవరూ లేనంత ఫిట్ గా విరాట్ కోహ్లీ […]

Share:

విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ రన్ మెషీన్. విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. 34 సంవత్సరాల వయసులో కూడా కోహ్లీ చాలా ఫిట్ గా ఉంటాడు. ఇండియన్ టీంకి ఫిట్ నెస్ స్టాండర్డ్స్ నేర్పిందే కోహ్లీ అని చాలా మంది కామెంట్  చేస్తూ ఉంటారు. కోహ్లీ ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యతను మనం చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఇండియన్ టీంలో ఎవరూ లేనంత ఫిట్ గా విరాట్ కోహ్లీ ఉంటాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ మీద ఎవరికీ ఎటువంటి అనుమానం ఉండదు. అసలు ఇండియన్ క్రికెట్ లోకి ఫిట్ నెస్ అనే పదం వచ్చింది విరాట్ కోహ్లీ వల్ల అని కొంత మంది చెబుతుంటారు. అటువంటి కోహ్లీ ఫిట్ నెస్ కు సంబంధించి సోషల్ మీడియాలో తన రీసెంట్ యో-యో టెస్టుకు సంబంధించన స్కోరును షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ స్టోరీ వైరల్ గా మారింది. తన ఇన్ స్టా స్టోరీలో విరాట్ ఇందుకు సంబంధించిన అప్ డేట్ ను ఉంచారు. ఆయన పోస్ట్ చేసిన క్షణాల్లోనే అది వైరల్ అయింది. 

ఆనందంగా ఉంది

విరాట్ కోహ్లీ రీసెంట్ ఆసియా కప్ టీంలో సభ్యునిగా ఉన్నాడు. ఇందుకోసం బీసీసీఐ తాజాగా యో-యో టెస్టును నిర్వహించగా.. విరాట్ అందులో పాల్గొన్నాడు. ఈ టెస్టులో విరాట్ 17.2 స్కోరును సాధించాడు. కోహ్లీ ఫిట్ నెస్ గురించి ఎవరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఎక్కువ సేపు జిమ్ లో గడుపుతూనే కనిపిస్తాడు. ఇలా 17.2తో టెస్టును ముగించినందుకు చాలా ఆనందంగా ఉందని విరాట్ తెలిపాడు. విరాట్ చాలా సార్లు ఈ టెస్టులో పాల్గొన్నా కానీ టెస్టుకు సంబంధించి రిజల్ట్ ను బయటపెట్టడం ఇదే తొలిసారి. ఇక దీంతో ఈ రిజల్ట్ కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అనేక మంది ఫ్యాన్స్ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో 16 మార్కులు వస్తే ఈ టెస్టును పాసయినట్లు పరిగణిస్తారు. లేకపోతే ఆ సభ్యుడి ఎంపికను హోల్డ్ లో ఉంచుతారు. అందుకోసమే టీమ్ లో పేరు ఉన్నా కానీ యో-యో టెస్టు ను అందరూ పాస్ కావాలని అనుకుంటారు. ఒక వేళ ఈ టెస్టు పాస్ కాకపోతే టీమ్ లో పేరు ఉన్నా కానీ అతడిని మ్యాచెస్ ఆడనివ్వరు. అతడి స్థానంలో రిజర్వ్ ఆటగాడినో లేక మరో ఆటగాడినో పంపుతారు. అందుకోసమే యో-యో టెస్ట్ అనేది చాలా ముఖ్యంగా క్రికెటర్లు భావిస్తుంటారు.

అసలేంటీ యో-యో పరీక్ష?

ఇండియన్ టీమ్ సభ్యులకు కొద్ది రోజుల నుంచి యో-యో పరీక్షను బీసీసీఐ తప్పనిసరి చేసింది. ఎవరైనా యో-యో టెస్టులో విఫలం అయితే అతడిని సిరీస్ ఆడేందుకు అనుమతించరు. కొత్త ఫిట్ నెస్ స్టాండర్డ్స్ కోసం బోర్డు ఈ మార్పును తీసుకొచ్చింది. ఈ పరీక్షలో.. రెండు సెట్ల కోన్‌లను 20 మీటర్ల దూరంలో ఉంచుతారు. బీప్ వినిపించిన తర్వాత, ఒక క్రీడాకారుడు తదుపరి బీప్ అరుపుల సమయానికి అవతలి వైపు ఉన్న మార్కర్‌ను చేరుకోవాలి. ఆ తర్వాత అతను పరుగు ఎక్కడ ప్రారంభించాడో అక్కడ నుండి మార్క్ చేయడానికి వెనుదిరిగి పరుగెత్తాలి. ప్రతి రౌండ్‌తో బీప్‌ల ఫ్రీక్వెన్సీ పెరుగుతూనే ఉంటుంది. ఒక ఆటగాడు కోన్ మరియు వెనుకకు పరుగు పూర్తి చేసిన తర్వాత పరీక్షలో విజయం సాధించినట్లు పరిగణించబడతాడు. ప్రతి ప్రయాణానికి మధ్య దాదాపు ఏడు సెకన్ల గ్యాప్ ఉంటుంది.

యో-యో పరీక్ష కోసం వేర్వేరు బృందాలు వేర్వేరు ప్రమాణాలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం, భారతదేశం 16:1ని క్వాలిఫైయింగ్ స్పీడ్ లెవెల్‌గా సెట్ చేసింది.

ఫిట్ గా లేకుంటే కష్టమే.. 

ఫిట్ గా లేని వారు యో-యో పరీక్షను క్లియర్ చేయడం చాలా కష్టం. వినేందుకు యో-యో పరీక్ష సింపుల్ గా ఉన్నా కానీ దీనిని క్లియర్ చేయడం చాలా కష్టం. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు యో-యో పరీక్షలో విఫలం అయి జట్టులో ప్లేస్ కోల్పోయారు.