రాహుల్, విరాట్ లేకుంటే మన పరిస్థితేంటి

ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ పోరు. మరి అటువంటి మ్యాచ్ లో మన ఇండియా మీద అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అంతే కాకుండా అటు పక్క ఉంది భీకర ఆసీస్. ఆసీస్ జట్టు వరల్డ్ కప్ కు ముందు ఎలా పర్ఫామ్ చేసినా కానీ వరల్డ్ కప్ లో మాత్రం ఒక రకంగా వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తుందనేది అందరికీ తెలిసిందే. ఆ జట్టుకు వరల్డ్ కప్ […]

Share:

ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ పోరు. మరి అటువంటి మ్యాచ్ లో మన ఇండియా మీద అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అంతే కాకుండా అటు పక్క ఉంది భీకర ఆసీస్. ఆసీస్ జట్టు వరల్డ్ కప్ కు ముందు ఎలా పర్ఫామ్ చేసినా కానీ వరల్డ్ కప్ లో మాత్రం ఒక రకంగా వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తుందనేది అందరికీ తెలిసిందే. ఆ జట్టుకు వరల్డ్ కప్ లో అటువంటి రికార్డు ఉంది. అందుకే అందరి కళ్లు ఈ మ్యాచ్ మీద పడ్డాయి. అంతే కాకుండా ఇండియా ఈ సారి టైటిల్ ఫేవరేట్. హోం కండిషన్లను ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుంటుందని అంతా చర్చించుకుంటున్న వేళ ఇండియా-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ పోరు షురూ అయింది. 

ఆరంభంలోనే షాక్… 

ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లోనే స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ దూరమయ్యాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో మన కెప్టెన్ శర్మ టాస్ కూడా ఓడిపోయాడు. ఇదే షాక్ అని అనుకుంటే టీం అనౌన్స్ చేస్తున్న శర్మ మరో షాకింగ్ వార్తను చెప్పాడు. అదే శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ ఆడడం లేదని. 

శుభారంభమే.. 

టాస్ ఓడి మొదటి బౌలింగ్ కు దిగిన రోహిత్ సేనకు ఆరంభంలో బౌలర్లు గుడ్ న్యూస్ అందించారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ను డకౌట్ చేశారు. ఇక దీంతో మన ఫ్యాన్స్ హమ్మయ్యా అని అనుకున్నారు. ఇక వారివి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ వారిని కేవలం 199 పరుగులకే ఆలౌట్ చేశారు. వారి ఇన్నింగ్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదంటేనే మనం చెప్పుకోవచ్చు మన బౌలర్లు ఎంతలా నిప్పులు చెరిగారో.. ఇక ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 199 కి ఆలౌట్ అయిన తర్వాత మన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మ్యాచ్ ను రోహిత్ సేన ఎలాగైనా గెలుస్తుందని అనుకున్నారు. కానీ మనోళ్లు రెండో బ్యాటింగ్ పట్టిన మొదటి ఓవర్లోనే ఇండియాకు అనుకోని షాక్ తగిలింది. గిల్ స్థానంలో జట్టులో ప్లేస్ సంపాధించిన ఇషాన్ కిషన్ మొదటి ఓవర్లోనే డకౌట్ గా వెనుదిగాడు.

వరుస షాకులు

ఇండియాకు వరుస షాకులు ఎదురయ్యాయి. 200 పరుగులే కదా సునాయసంగా చేస్తారని అనుకున్న ఫ్యాన్స్ కు దిమ్మతిరిగిపోయింది. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా 2/3తో నిలిచింది. ఇక ఈ దశలో ఇండియా గెలవడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 

వారే లేకుంటే 

మ్యాచ్ మొత్తం పూర్తయ్యాక మనం గెలిచాం అది వేరే విషయం కానీ ఇండియన్ అభిమానులకు ఒక ప్రశ్న ఎదురైంది. అసలు ఆ స్థితిలో విరాట్ కోహ్లీ, రాహుల్ నిలిచి ఉండకపోతే మన పరిస్థితి ఏమయ్యేదని వారు టెన్షన్ పడుతున్నారు.  వారు రికార్డు పార్ట్ నర్ షిప్ నెలకొల్పి మన ఇండియన్ టీం ను రక్షించారు కానీ వాళ్లే లేకపోతే మన పరిస్థితి ఏంటని ప్రతి ఫ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. వీరిద్దరూ అభేద్యంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. లేకపోతే మన ఇండియాకు ఆసీస్ మీద పరాభవం ఎదురయ్యేది. హోం లో నిర్వహిస్తూ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఓడిపోయేది. 

ఇదే మొదటి సారి కాదు… 

రాహుల్, కోహ్లీ జట్టును ఆదుకోవడం ఇదే మొదటి సారి మాత్రం కాదు. మొన్నటికి మొన్న ఆసియా కప్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీలే జట్టును విజయతీరాలకు చేర్చారు. నిన్నటి మ్యాచ్ లో కూడా సేమ్ అలాగే విక్టరీని అందించారు. ఈ పోరులో వారిద్దరూ లేకుంటే భారత్ ఆ 200 పరుగులు కూడా చేసేది గగనమే అయ్యుండేది. చెన్నై చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని మనోళ్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడించారు. ఆ ఎత్తుగడ ఫలించింది. స్పిన్నర్లలో జడ్డూ 3, కుల్దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీసుకుని కంగారూల నడ్డి విరిచారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వారిని 200 లోపే కట్టడి చేయడం అంటే మామూలు విషయం మాత్రం కాదు. 

కానీ వాళ్ల బౌలింగ్ అటాక్ కూడా మనల్ని కంగారు పెట్టింది. మనోళ్లు వారు చేసిన 199 పరుగులు అయినా చేస్తారా లేదా అని ప్రశ్నలు తలెత్తేలా చేసింది. కానీ ఆ ప్రశ్నలన్నింటికీ రాహుల్, కోహ్లీ జోడీ సమాధానాలు చెప్పింది. ఇండియాను విజయతీరాలకు చేర్చి సగర్వంగా మనం వరల్డ్ కప్ జర్నీని స్టార్ట్ చేసేలా చేసింది. లేకుంటే మనం కూడా ఓటమిని చవి చూడాల్సి వచ్చేదేమో. రాహుల్, కోహ్లీలలో ఎవరో ఒకరు ఔట్ అయితే మనకు స్పెషలిస్ట్ బ్యాటర్ ఎవరూ కూడా లేరు. తర్వాత వచ్చే హార్దిక్ పాండ్యా, జడేజా ఆల్ రౌండర్లు మాత్రమే. ఇక తర్వాత వచ్చే అశ్విన్ టెయిలెండర్ కావడం గమనార్హం. ఈ మధ్య అశ్విన్ బ్యాట్ ఝలిపిస్తున్నాడు కానీ అతడని స్పెషలిస్ట్ బ్యాటర్ అని చెప్పలేం. ఇక తర్వాత ఉన్న కుల్దీప్, బుమ్రా, సిరాజ్ లు పూర్తి టెయిలెండర్లు కావడం గమనార్హం.