ధోని కంటే విరాట్ కోహ్లీ అంత పెద్ద ఆస్తిపరుడా..?

ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ అందరి కంటే అత్యధిక సంపన్న దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , మహేంద్రసింగ్ ధోని పేర్లు నమోదు చేసుకున్నారు. ముందుగా మహేంద్రసింగ్ ధోనీ విషయానికి వస్థే .. కెప్టెన్సీ  గా వ్యవహరించిన అన్ని ఫార్మాట్లలోనూ ఇండియాకు ప్రపంచకప్ అందించడమే కాకుండా…వివిధ సీరీస్లు, ట్రోఫీలలోనూ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న  జట్టుకు అత్యధిక విజయాలు అందించి ఘనతను సొంతం చేసుకున్నాడు. అందుకే ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే   అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ […]

Share:

ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ అందరి కంటే అత్యధిక సంపన్న దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , మహేంద్రసింగ్ ధోని పేర్లు నమోదు చేసుకున్నారు. ముందుగా మహేంద్రసింగ్ ధోనీ విషయానికి వస్థే .. కెప్టెన్సీ  గా వ్యవహరించిన అన్ని ఫార్మాట్లలోనూ ఇండియాకు ప్రపంచకప్ అందించడమే కాకుండా…వివిధ సీరీస్లు, ట్రోఫీలలోనూ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న  జట్టుకు అత్యధిక విజయాలు అందించి ఘనతను సొంతం చేసుకున్నాడు. అందుకే ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే   అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ గానూ  ధోని అనేక సందర్భాల్లో వార్తల్లోకొచ్చాడు. ఇక మహేంద్రసింగ్ ధోని ఆస్తుల  విషయానికొస్తే..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆస్తులకి సంబంధించి ” స్టాక్ గ్రో ” అని సంస్థ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 

వరల్డ్ బెస్ట్ కెప్టెన్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మహేంద్రసింగ్ ధోని ఆస్తుల విలువను వెల్లడించింది. స్టాక్ గ్రో లెక్కల ప్రకారం ధోని నెట్ వర్త్ రూ.1040 కోట్లు ఉండగా.. అతనికి సొంత కంపెనీలు ఉన్నాయని తెలిపింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడటం ద్వారా ధోని ఏడాది  రూ.  12 కోట్లు తీసుకుంటున్నాడని , బ్రాండ్ ఎండార్స్మెంట్ లద్వారా రూ.4-6 కోట్లు, సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటనలకు  రూ.1-2 కోట్లు ఆర్జిస్తున్నాడని పేర్కొంది.

అలాగే వివిధ కంపెనీల్లో ధోని పెట్టుబడులు పెట్టారని అతని దగ్గర ఎన్నో విలువైన కార్లు,  బైకులు ఉన్నాయని తేలింది.  ధోని ఆస్తుల లెక్కలతో ఓ పోస్ట్ డిజైన్ చేసి విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం కొన్ని స్పోర్ట్స్ కంపెనీల్లో ధోని పెట్టుబడులను పెట్టాడు.రియల్ ఎస్టేట్లోనూ ధోని ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు. సొంతంగా కంపెనీలు కూడా ఉన్నాయట.. సెవెన్, ఖాతా బుక్ , శాకాహరి , గరుడ, ఆర్ ఐ జి ఐ, కార్స్ 24, హోమ్ లేన్ కంపెనీల లో ధోని పెట్టుబడులను పెట్టాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. మహి రెసిడెన్సి పేరిట హోటల్, బెంగుళూరులో ఎమ్మెస్ ధోని గ్లోబల్ స్కూల్ ఉన్నాయి.

రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు  రూ.17.8 కోట్లు విలువ చేసే ఇల్లు డెఫ్ డూన్ లో ఉంది. రాచీలు పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. జియో సినిమా,అన్ అకాడమీ, స్కిప్కర్, ఓరియో , వయా కమ్ 18, కోల్గేల్ , కార్స్  24, ఒప్పో , గో డాడీ , ఫోకర్స్ స్పోర్ట్స్, డ్రీమ్ ఎలేవన్, మాస్టర్ కార్డ్, రీబోక్ లావా , ఓరియంట్ అనే కంపెనీలకు ధోని ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక ప్రకటనకు ధోని రూ. 4.6 కోట్లు వసూలు చేస్తున్నాడు. పలు క్రీడా లీగ్స్ లోని జట్లకు ధోని సహా భాగస్వామిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు మూడేళ్ల క్రితం గుడ్ బై చెప్పినా … ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.  వ్యాపార ప్రకటనల కోసం ఆయా కంపెనీల్లో ఇంకా ధోని కోసం క్యూకడుతున్నారు. 

అయితే ఇంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీ కంటే రూ .10 కోట్లు తక్కువగా కలిగి ఉండడం గమనార్హం. ఇక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్ వర్త్ రూ.1050 కోట్లుగా ఉంది. కోహ్లీ మరియు  ధోని ఇద్దరూ భారీ అభిమానులను కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, కోహ్లీ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.  34 ఏళ్ల అతను తన ‘ఎ+’ టీమ్ ఇండియా కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్కో టెస్టుకు అతని మ్యాచ్ ఫీజు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడినందుకు అతనికి ఏటా రూ .15 కోట్లు లభిస్తాయి.