విరాట్ కోహ్లీ నికర విలువ 927 కోట్లు. ఐపీఎల్‌లో 16 సీజన్లు ఆడడం ద్వారా అతను ఈ మొత్తాన్ని సంపాదించాడు.

927 కోట్ల రూపాయల నికర విలువ కలిగిన విరాట్..  మొత్తం 16 ఐపీఎల్ సీజన్లలో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడో ఇక్కడ తెలుసుకోండి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు, లీగ్‌లో ఏ ఇతర ఆటగాడూ చేయనన్ని ఎక్కువ పరుగులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా IPL 2023 సీజన్‌లో RCBకి గొప్పగా ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక […]

Share:

927 కోట్ల రూపాయల నికర విలువ కలిగిన విరాట్..  మొత్తం 16 ఐపీఎల్ సీజన్లలో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడో ఇక్కడ తెలుసుకోండి.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు, లీగ్‌లో ఏ ఇతర ఆటగాడూ చేయనన్ని ఎక్కువ పరుగులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా IPL 2023 సీజన్‌లో RCBకి గొప్పగా ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిగా కొత్త రికార్డును నెలకొల్పారు. ఇంకా విరాట్ కోహ్లీ కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు, స్ట్రైక్ రేట్ 167 కంటే ఎక్కువ అని చెప్పవచ్చు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ రన్ మెషీన్ 36.43 సగటుతో మరియు దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 6000కు పైగా పరుగులు చేశాడు. ఇంకా అతను ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వారిలో ఒకడు కావడం విశేషం.

ఐపీఎల్ 15 ఏళ్ల చరిత్రలో కోహ్లీ ఐపీఎల్ వేలంలో ఎప్పుడూ కూడా అమ్ముడు పోకుండా ఉండలేదు. RCB 2008లో టోర్నమెంట్ యొక్క ప్రారంభ ఎడిషన్ కోసం అండర్ 19 ప్లేయర్స్ డ్రాఫ్ట్ నుండి కేవలం రూ. 12 లక్షలకు ఈ బ్యాట్స్‌మన్‌ చేత సంతకం చేయించింది. ఇక ఆ సమయంలో, కోహ్లీ అప్పుడే భారతదేశం U19 ప్రపంచ కప్ ట్రోఫీకి కెప్టెన్ గా ఉన్నాడు.

2011లో రూ. 8.2 కోట్లకు పెరగక ముందు.. అంతకు ముందు మూడు సీజన్‌లకు కోహ్లీ జీతం రూ. 12 లక్షలు మాత్రమే.

2011 నుంచి 2014 వరకు ప్రతి ఏటా రూ.8.2 కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. కాగా.. 2013లో అతను RCB జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

2015 నుంచి 2017 వరకు కోహ్లీ రూ.12.5 కోట్ల రూపాయలు అందుకున్నాడు. 2016లో 81.08 సగటుతో మరియు 152.03 స్ట్రైక్ రేట్‌తో 973 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా  అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

IPL 2018 మెగా వేలానికి ముందు, RCB.. కోహ్లీని 2021 వరకు ప్రతి సీజన్‌లో  రూ. 18 కోట్లకు కోహ్లీని రీటెయిన్ చేసుకుంది. ఇంకా 2022 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ అతనిని రూ. 15 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 2023 సీజన్‌కు కూడా అతను అంతే మొత్తాన్ని సంపాదిస్తాడు. 

ఐపీఎల్ 16 సీజన్లలో ఓవరాల్ గా కోహ్లీ రూ.173 కోట్ల 20 లక్షలు ఆర్జించాడు. స్పోర్ట్స్ కీడా ప్రకారం ,  కోహ్లీ నికర విలువ 112 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 927 కోట్లు) అని పేర్కొంది. ఫోర్బ్స్ కథనం  ప్రకారం, కోహ్లీ 2022లో అత్యధిక పారితోషికం పొందిన 61వ అథ్లెట్ మరియు అత్యధికంగా చెల్లించే క్రికెటర్, 33.9 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 279 కోట్లు) సంపాదనతో ఉన్నాడు. కేవలం కమర్షియల్‌ డీల్స్‌ ద్వారానే రూ.256 కోట్లు సంపాదించాడు. హాప్పర్ క్యూ కథనం ప్రకారం, మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రూ. 8.9 కోట్లు సంపాదిస్తాడు.  7 కోట్ల వార్షిక పారితోషికం తీసుకునే BCCI A+ కేటగిరీ కింద ఒప్పందం చేసుకున్న నలుగురు క్రికెటర్లలో అతను కూడా ఒకడు కావడం విశేషం.