విరాట్ కోహ్లీ – హార్థిక్ పాండ్య లేటెస్ట్ నెట్ ప్రాక్టీస్

ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో ఒకడు విరాట్ కోహ్లీ. ఈయన బ్యాటింగ్ కి ఫ్యాన్ కానీ వాళ్ళు ఎవరు చెప్పండి. అదే ప్రతీ మ్యాచ్ లో తన బెస్ట్ ఇవ్వడానికి నూటికి నూరుపాళ్లు కృషి చేసే అతి తక్కువమంది ఆటగాళ్లలో ఒకడు ఆయన. ఇండియన్ టీం కెప్టెన్ గా ఆయన సాధించిన విజయాలు. టీంని పటిష్టంగా మార్చిన విధానం తర్వాతి తరం ప్లేయర్స్ కి కూడా ఒక దిక్సూచి లాంటిది. ఐపీఎల్ తో ఫుల్ ఫామ్ […]

Share:

ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో ఒకడు విరాట్ కోహ్లీ. ఈయన బ్యాటింగ్ కి ఫ్యాన్ కానీ వాళ్ళు ఎవరు చెప్పండి. అదే ప్రతీ మ్యాచ్ లో తన బెస్ట్ ఇవ్వడానికి నూటికి నూరుపాళ్లు కృషి చేసే అతి తక్కువమంది ఆటగాళ్లలో ఒకడు ఆయన. ఇండియన్ టీం కెప్టెన్ గా ఆయన సాధించిన విజయాలు. టీంని పటిష్టంగా మార్చిన విధానం తర్వాతి తరం ప్లేయర్స్ కి కూడా ఒక దిక్సూచి లాంటిది. ఐపీఎల్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెస్టిండీస్‌తో విజయవంతమైన టెస్ట్ సిరీస్ తర్వాత, రాబోయే ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచులలో తన సత్తా చాటేందుకు మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకు ఆయన నిరంతరం ప్రాక్టీస్ సెషన్ మ్యాచులలో పాల్గొంటున్నాడు.

వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ – హార్థిక్ పాండ్య నెట్ ప్రాక్టీస్ వీడియో :

ఈ గురువారం నాడు వెస్టిండీస్‌తో జరగబొయ్యే తోలి ఒన్డే మ్యాచ్ లో పాల్గొనేందుకు వచ్చిన విస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కి కెప్టెన్ రోహిత్ శర్మ మరియు టీం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెస్టిండీస్ తో జరగబొయ్యే మ్యాచ్ ఎలా అయినా గెలవాలనే కసితో విరాట్ కోహ్లీ తో కలిసి హార్దిక్ పాండ్యా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వీడియో లో హార్థిక్ పాండ్య బౌలింగ్ వేస్తుండగా , కోహ్లీ వాయువేగం తో కొట్టిన షాట్ కి పాండ్య వేసిన బంతి ఆకాశం లో నక్షత్రం లాగ కనిపించింది. కోహ్లీ హిట్టింగ్ ని నోరెళ్లబెట్టిన హార్దిక్ పాండ్యా ని కాసేపు ఆటపట్టించాడు కోహ్లీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచులో అద్భుతమైన ఆటని కనబర్చిన విరాట్ కోహ్లీ, గురువారం నుండి జరగబొయ్యే ఒన్డే సిరీస్ తో చరిత్ర తిరగరాయడానికి సిద్ధం అవుతున్నాడు. ఒన్డే మ్యాచులలో కోహ్లీకి ఎవరికీ సాధ్యం కానీ రికార్డు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ గురువారం నుండి జరగబొయ్యే ఒన్డే సిరీస్ లో కోహ్లీ 13000 పరుగుల మైల్ స్టోన్ ని అందుకోబోతున్నాడు.

మొదటి ఒన్డే మ్యాచ్ కి పేస్ బౌలర్ సిరాజ్ దూరం:

వెస్టిండీస్‌తో జరిగిన  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ తన 76వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పటి వరకు కోహ్లీ 274 ఒన్డేలు ఆడగా 12898 పరుగులు చేసాడు. వెస్టిండీస్ లోని కరీబియన్ లో జరగబొయ్యే ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ లో మూడు వన్డేలు, 5 టీ౨౦ మ్యాచులు జరగనున్నాయి. అయితే జరగబొయ్యే టీ20 మ్యాచులలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోబోతుండగా, కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ పాండ్య అందుకున్నాడు. అయితే మొదటి మ్యాచు నుండి భారత జట్టు పేస్ బౌలర్ సిరాజ్ కి గాయాలు అయినా కారణం గా టీం ఇండియా అతనిని తప్పించింది. అయితే బీసీసీఐ ఇతనికి బదులుగా ఎవరిని తీసుకొస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. సిరాజ్ టెస్ట్ సిరీస్ లో 7 వికెట్లను అందుకున్నాడు. మంచి ఫామ్ తో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు తప్పుకోవడం ఇండియన్ టీం కి పెద్ద లాస్ అనే చెప్పాలి. ఇక టీ 20 సిరీస్ కి విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ కూడా ఉండరు, మరి కెప్టెన్ హార్థిక్ పాండ్య టీం ని ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.