పూర్ అంపైరింగ్‌పై విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహం…

రెండో రోజు ఆటలో భారత్ పునరాగమనం చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా 47 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో భారత్‌కు తొలి రోజు శుభారంభం లభించలేదు. అయితే రెండో రోజు భారత బౌలర్లు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. భారత్‌కు మొదట్లో కొంత సమయం పట్టింది, ఆ తర్వాత భారత బౌలర్లు ఆస్ట్రేలియా చివరి 6 వికెట్లు కేవలం 11 పరుగులకే పడగొట్టింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 197 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. […]

Share:

రెండో రోజు ఆటలో భారత్ పునరాగమనం చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా 47 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో భారత్‌కు తొలి రోజు శుభారంభం లభించలేదు. అయితే రెండో రోజు భారత బౌలర్లు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. భారత్‌కు మొదట్లో కొంత సమయం పట్టింది, ఆ తర్వాత భారత బౌలర్లు ఆస్ట్రేలియా చివరి 6 వికెట్లు కేవలం 11 పరుగులకే పడగొట్టింది.

దీంతో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 197 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. అయితే జట్టు ఆశించిన రీతిలో ఆరంభం ఇవ్వలేకపోయింది. జట్టు తొలి వికెట్.. 15 పరుగుల వద్ద ఉండగా, 5 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. దీని తర్వాత, టీం ఇండియా స్కోరు 32 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. అతను 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా కలిసి ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేసేందుకు ప్రయత్నించినా ఇద్దరి మధ్య 22 పరుగుల భాగస్వామ్యం మాత్రమే కనిపించింది.

కోహ్లీకి మద్దతుగా నిలిచిన అభిమానులు

రోహిత్ శర్మను అంపైర్ నితిన్ మీనన్ రెండుసార్లు కాపాడి, ఔట్ ఉన్నా ఔట్ ఇవ్వలేదు. ఒకే ఓవర్‌లో రెండుసార్లు ఔటైనా రోహిత్ శర్మకు లైఫ్ ఇచ్చాడు, అయితే ఇండోర్ టెస్టులో రెండు లైఫ్‌ల తర్వాత కూడా రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అదే సమయంలో కోహ్లికి నితిన్ మీనన్ వెంటనే అవుట్ డెసిషన్ ఇచ్చాడు. అయితే ఈసారి రివ్యూలో రెండు అంపైర్స్ కాల్స్ కనిపించడంతో అభిమానులు కూడా విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. ఈ కారణంగా, అభిమానులు అంపైర్ నితిన్ మీనన్‌ను ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లి కొన్ని పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే దశలో మరియు గొప్ప ఫార్మ్ లో ఉన్నట్లు కనిపించాడు. కానీ.. మాథ్యూ కుహ్న్‌మాన్ అన్ని ఆశలను వమ్ము చేశాడు. అతని బంతి ఇలాగే స్పిన్ తీసుకొని షార్ట్‌గా ఉండి, నేరుగా కోహ్లీ ప్యాడ్‌లోకి వెళ్ళింది, కోహ్లి సరిగ్గా ఆడేందుకు ప్రయత్నించాడు కానీ కోహ్లి ఔట్ అయ్యాడు.

కోహ్లి కూడా నితిన్ మీనన్ వైపు చూశాడు కానీ, దాని వల్ల ఉపయోగం లేదని తెలిసి రివ్యూ తీసుకోలేదు.

పెవిలియన్‌కు వెళ్ళే సమయంలో కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేసినా.. అంపైర్ నిర్ణయం, అతని బ్యాటింగ్ పట్ల అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్పష్టమవుతోంది. 26 బంతుల్లో 13 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత్ 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది.

ఎవరు ఈ నితిన్ మీనన్…

నితిన్ నరేంద్ర మీనన్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు మరియు అంపైర్. నితిన్ 2 నవంబర్ 1983లో జన్మించాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, లిస్ట్ ఏ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇప్పుడు అంతర్జాతీయ అంపైర్.  2015-16 రంజీ ట్రోఫీ మరియు షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లలో అంపైర్ గా పనిచేశాడు. జూన్ 2020లో, అతను అంపైర్ నిగెల్ లాంగ్ స్థానంలో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి పొందాడు.