మేము అదే అనుకున్నాం: విరాట్

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా మీద ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా సులువుగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియాకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కూడా సున్నా పరుగులకే పెవిలియన్ కు చేరారు. దీంతో […]

Share:

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా మీద ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా సులువుగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియాకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కూడా సున్నా పరుగులకే పెవిలియన్ కు చేరారు. దీంతో ఇండియా 2 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. 

కంగారెత్తించారు పో… 

కొట్టాల్సినవి 200 పరుగులు మాత్రమే మన బ్యాటర్లను చూస్తే ఒక్కొక్కరు మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఇండియా గెలుపు నల్లేరు మీద నడకే అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బౌలింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మన ఇండియన్లవి వరుస వికెట్లను తీస్తూ కష్టాల్లోకి నెట్టింది. ఐద ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఔటైన ముగ్గురు బ్యాటర్లు కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరారు. దీంతో ఇక ఇండియా గెలవడం కష్టమే అని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ కొంత మందికి మాత్రం ఏదో ఒక మూలన ఆశ ఉండింది. ఆ ఆశే చివరికి విజయం సాధించింది. క్రీజులోకి వచ్చిన రాహుల్, విరాట్ క్రీజులోనే పాతుకుపోయారు. ఇండియాను విజయతీరాలకు చేర్చిన తర్వాత విరాట్ ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆల్ రౌండర్ పాండ్యాతో కలిసి స్టార్ బ్యాటర్ రాహుల్ పని పూర్తి కానిచ్చేశాడు. దీంతో కంగారూలకు నిరాశ తప్పలేదు. 

మేము అదే ఆలోచించాం.. 

విరాట్ ఆకట్టుకునే బ్యాటింగ్ చేస్తూ.. 85 పరుగులు, రాహుల్ 97* చేశారు. వారి పార్ట్ నర్ షిప్ 36 ఓవర్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో వారు అసాధారణమైన నైపుణ్యం మరియు స్థితిస్థాపకతను ప్రదర్శించారు. అంతే కాకుండా వారు అప్పుడు ఏమని అనుకున్నారో తెలుపుతూ బీసీసీఐ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మాట్లాడారు. వారు వారి పార్ట్ నర్ షిప్ గురించి మాట్లాడుతూ… సాంప్రదాయ పద్ధతిలో క్రికెట్ ఆడటానికి ఇది సహాయపడిందని, మ్యాచ్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నపుడు ప్రమాదాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇది సహాయపడుతుందని కోహ్లీ చెప్పాడు. ఇది స్పష్టంగా లోపాలను నిర్మూలించడానికి మరియు స్ట్రైక్‌ని రొటేట్ చేసేందుకు మాకు సహాయపడిందని అనుకుంటున్నట్లు విరాట్ తెలిపాడు. అంతే కాకుండా మాకు మంచి ఆరంభం లభించిందని,  అలాంటి విజయం తర్వాత జట్టు మంచి ఫీల్ పొందన్నాడు. ఈ విజయం ద్వారా ఈ టోర్నీలో మేము చాలా దూరం వెళ్లగలమని ఆశిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. 

రాహుల్ ఏం చెప్పాడంటే… 

తొలి ఇన్నింగ్స్‌లో 49.3 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి (కీపింగ్) మరలా బ్యాటింగ్ కు వెంటనే రావడం పెద్ద సవాల్ గా అనిపించిందని రాహుల్ తెలిపాడు. శరీరం అలసిపోయిందని, చెన్నైలో చాలా కష్టమైన రోజులా అనిపించదన్నాడు. ఆ సమయంలో శక్తిని క్రమంగా కోల్పోయామని రాహుల్ వెల్లడించాడు. ఒకానొక సమయంలో ఇద్దరం అలసిపోకుండా శక్తిని ఆదా చేద్దామని కోహ్లీతో అన్నట్లు వెల్లడించాడు. వీరు ఇలా రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చడం ద్వారా అందరూ వీరిని అభినందిస్తున్నారు. కేవలం జట్టులో ఉన్న క్రికెటర్లు మాత్రమే కాకుండా అనేక మంది మాజీ క్రికెటర్లు కూడా వీరిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

రికార్డు పార్ట్ నర్ షిప్

రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియాకు ఓటమి తప్పదని అందరూ అనుకున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ, స్టార్ ప్లేయర్ రాహుల్ మ్యాచ్ ను గెలిపించారు. వీరు 4వ వికెట్ కు రికార్డు స్థాయిలో పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. వీరు 165 పరుగుల పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. ఏ ఇండియన్ బ్యాటర్లు కూడా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద ఇప్పటి వరకూ 165 పరుగులు (4వ వికెట్ కు) జోడించలేదు. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఇండియా రెట్టించిన ఉత్సాహంతో నేడు పసికూన అఫ్ఘానిస్తాన్ తో తన తదుపరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అవుతోంది.