Virat Kohli: బౌలింగ్ చేసి అదరగొట్టిన విరాట్ కోహ్లీ

నిన్న జరిగిన భారత్ (India) బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో కీలక పాత్ర పోషించి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందర్నీ అబ్బురపరిచాడు విరాట్ కోహ్లీ. ప్రత్యేకించి తన ఆట తీరులో ఎప్పటిలాగే దూసుకుపోయి సంచరి చేసి భారత జట్టును గెలిపించాడు. అంతేకాకుండా భారత్ (India) – బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో బౌలింగ్ (Bowling) చేసి తన సత్తాను చాటాడు విరాట్ కోహ్లీ.  హార్దిక్ పాండ్యాప్లేస్ లో..:  క్రికెట్ వేదికపై ట్విస్ట్‌ ఇచ్చాడు విరాట్ […]

Share:

నిన్న జరిగిన భారత్ (India) బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో కీలక పాత్ర పోషించి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందర్నీ అబ్బురపరిచాడు విరాట్ కోహ్లీ. ప్రత్యేకించి తన ఆట తీరులో ఎప్పటిలాగే దూసుకుపోయి సంచరి చేసి భారత జట్టును గెలిపించాడు. అంతేకాకుండా భారత్ (India) – బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో బౌలింగ్ (Bowling) చేసి తన సత్తాను చాటాడు విరాట్ కోహ్లీ. 

హార్దిక్ పాండ్యాప్లేస్ లో..: 

క్రికెట్ వేదికపై ట్విస్ట్‌ ఇచ్చాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)  టీమిండియా బ్యాటింగ్ లైనప్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆరేళ్ల విరామం తర్వాత వన్డేలో బౌలింగ్ (Bowling) క్రీజులోకి వచ్చి అందరిని అబ్బురపరిచాడు. పూణేలో బంగ్లాదేశ్ (Bangladesh)‌తో జరిగిన 2023 ప్రపంచ కప్ పోరులో, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) దురదృష్టవశాత్తూ గాయపడటంతో, విరాట్ కోహ్లీ (Virat Kohli) అనుకోకుండా బౌలింగ్ (Bowling) చేయాల్సి వచ్చింది. ఆటలో 9వ ఓవర్ సమయంలో, లిట్టన్ దాస్ కొట్టిన షాట్‌ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కుడి కాలుకి దెబ్బ తగిలింది, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బరిలో నిలవలేకపోయాడు. ఈ అనూహ్య పరిణామం ‘కింగ్ కోహ్లీ’ అభిమానులకు అరుదైన ట్రీట్ ఇచ్చింది. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అభిమానుల ముందు బౌలర్‌గా మారి మ్యాచ్ (Match)ని ఇంకా ఆసక్తిగా మార్చాడు.

కేవలం మూడు బంతులకు మాత్రమే విరాట్ కోహ్లీ తన బౌలింగ్ (Bowling) చేయడంతో, అభిమానులు కాస్త నిరాశలు కి వెళ్లారు. అయితే చాలా సంవత్సరాలు తర్వాత కోహ్లీ బౌలింగ్ (Bowling) చేయడంతో తమ అభిమానులు సోషల్ మీడియాలో, విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఫొటోస్ అలాగే వీడియోస్ షేర్ చేసుకున్నారు. కోహ్లి బౌలింగ్ (Bowling) కు సంబంధించి అనేకమైన మీమ్‌లు, జోకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Also Read: Hardik Pandya Injury: హార్దిక్‌కు గాయం.. ఆందోళనలో టీమిండియా

కొలంబోలో శ్రీలంకతో జరిగిన 2017 మ్యాచ్ (Match) తర్వాత ఒక బౌలర్‌గా, కోహ్లీ వన్డేలో తొలిసారిగా బౌలింగ్ (Bowling) చేశాడు. ODI ప్రపంచ కప్‌ల సందర్భంలో, ఇలా బౌలర్లగా సడన్గా ఎంట్రీ ఇవ్వడం నాలుగోసారి. గతంలో ఆస్ట్రేలియా మరియు శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచ కప్‌లో అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన 2015 ఎడిషన్‌లో కనిపించింది. 

అత్యధిక రన్స్: 

విరాట్ కోహ్లి (Virat Kohli) తన అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యేకించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (Match)‌గా నిలిచాడు. 510 మ్యాచ్ (Match)‌లలో 566 ఇన్నింగ్స్‌లలో 25923 పరుగులు చేసిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రత్యేక రికార్డ్ సాధించాడు. పూణేలో బంగ్లాదేశ్ (Bangladesh)‌తో జరిగిన ప్రపంచ కప్ (World Cup) మ్యాచ్ (Match)‌లో 77 పరుగులు చేసిన సందర్భంలోనే మరో మైలురాయిని చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. రవీంద్ర జడేజా దగ్గర నుంచి అవార్డుని దొంగలించింది చిలిపిగా క్షమాపణలు చెప్పాడు. అయితే ప్రత్యేకించి ప్రపంచ కప్ (World Cup) గేమ్‌లలో కొన్ని అర్ధసెంచరీలు సాధించినప్పటికీ, ప్రస్తుతం జరిగిన భారత్ (India)-బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ (Match) లో తప్పకుండా సెంచరీ చేసి తమ జట్టుకి ప్రోత్సాహకరంగా నిలవాలి అనుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తాను, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇద్దరు మాత్రమే ప్రపంచకప్‌ గెలిచారని, ఇంత మంది ప్రేక్షకుల ముందు ఆడడం ఆనందంగా ఉందని మీడియాతో మాట్లాడిన కోహ్లీ చెప్పారు. 

Also Read: World Cup: భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ హైలెట్స్

కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి దూకుడుతో బరిలోకి దిగి బంగ్లాదేశ్ (Bangladesh) బౌలర్లను ఒత్తిడిలోకి తోసేసాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కాస్త నెమ్మదిగా ఆరంభించాడు, అయితే రోహిత్ (Rohit Sharma) 48 పరుగుల వద్ద ఔటయ్యే ముందు తనదైన శైలిలో ఆటలో దూసుకుపోతున్నాడు. ఛేజింగ్ విషయానికొస్తే, భారత సాధించిన నాల్గవ విజయం ప్రతి ఒక్కరిని అబ్బురుపరిచింది.