Virat Kohli: కలిసిపోయిన విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్..

నిప్పు ఉప్పుగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli), అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ (naveen ul haq) ఒకరికొకరు కౌగిలించుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ శాశ్వత మితృత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదని నిరూపించారు విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్.  వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిప్పు ఉప్పుగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ […]

Share:

నిప్పు ఉప్పుగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli), అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ (naveen ul haq) ఒకరికొకరు కౌగిలించుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ శాశ్వత మితృత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదని నిరూపించారు విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్. 

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిప్పు ఉప్పుగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ ఒకరికొకరు కౌగిలించుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. అభిమానులంతా నివ్వెరపోయేలా ఈ ఇద్దరు శత్రువులు మిత్రులవ్వడం  క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ ఓవర్ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకున్నాడు. కోహ్లీ సైతం నవ్వుతూ అతన్ని హత్తుకున్నాడు. ఈ చర్యతో ఈ ఇద్దరూ ఆటగాళ్ల మధ్య ఉన్న గొడవకు ఎండ్‌కార్డ్‌ పడింది. 

కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌  హగ్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్యూటీ ఆఫ్ క్రికెట్ అని, జెంటిల్మెన్‌ గేమ్‌ అని, కోహ్లీ గొప్ప మనసుకి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శత్రువులను మిత్రులుగా మార్చే ఏకైక సాధనం ఆటనేనని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

Read More: David Warner: వరల్డ్ కప్ 2023లో స్టెప్పులు వేసిన డేవిడ్ వార్నర్

అసలు గొడవేంటంటే?

ఐపీఎల్‌ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం గొడవకు కారణమైంది. అది కాస్త పెను దుమారంగా మారింది. ఇందులో మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా తలదూర్చాడు. దాంతో గొడవ మరింత పెద్దదైంది.

విరాట్ కోహ్లీ పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్‌ అంపైర్లకు ఫిర్యాదు చేసాడు. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, తన షూస్‌కు ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్‌కు కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నవీన్‌కు విరాట్ కాలు చూపించాడని అందరూ పొరబడ్డారు. గౌతమ్ గంభీర్ కూడా ఇలానే పొరపడి.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఘాటుగా స్పందించాడు. దాంతో గొడవ పెద్దదైంది. ఈ గొడవను కోహ్లీ విడిచిపెట్టినా. నవీన్ వదిలేయలేదు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీ ఔటవ్వగా ‘స్వీట్ మ్యాంగోస్’ అని ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు నచ్చలేదు. అప్పటినుంచి నవీన్‌ను అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.

Read More: మేము అదే అనుకున్నాం: విరాట్

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ నవీన్ ఉల్ హక్‌కు విరాట్ కోహ్లీ ఫాన్స్ చుక్కలు చూపించారు. విరాట్ క్రీజులోకి అడుగుపెట్టగానే కోహ్లీ నామస్మరణంతో స్డేడియం దద్దరిల్లిపోయింది. ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరుస్తూ నవీన్‌ను ట్రోల్ చేశారు. నవీన్‌ ఫీల్డింగ్ సమయంలో, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫాన్స్ తెగ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన కోహ్లీ.. నవీన్‌ను ట్రోల్ చేయవద్దని తన సైగలతో అభిమానులను కోరాడు. కోహ్లీ సూచనలతో ఫాన్స్ సైలెంట్ అయిపోయారు. వన్డే ప్రపంచకప్‌ 2019లోనూ స్టీవ్ స్మిత్‌ను ‘ఛీటర్ ఛీటర్’ అంటూ అభిమానులు ఎగతాళి చేసినప్పుడు ‘అలా అనొద్దని’ కోహ్లీ అభిమానులను కోరాడు.