నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా ముందుండేది విరాట్ కోహ్లీనే

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెటర్స్ లో ఎంతో పేరుగాంచిన క్రికెటర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ క్రికెట్ తోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాదు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో కూడా చాలా మంది కోహ్లీ ఆరాధకులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ […]

Share:

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెటర్స్ లో ఎంతో పేరుగాంచిన క్రికెటర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ క్రికెట్ తోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాదు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో కూడా చాలా మంది కోహ్లీ ఆరాధకులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ విషయాన్ని మరోసారి విజువల్ చేస్తూ పాకిస్తాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ భారత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీతో తన బంధాన్ని తెలియజేశారు.  మైదానంలో తన దూకుడు వైఖరికి పేరుగాంచిన కోహ్లీ, మైదానం వెలుపల ఇతర జట్ల ఆటగాళ్లతో చాలా మంచి రిలేషన్ ని షేర్ చేసుకుంటారు అంటూ ఈ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కోహ్లీ అభిమానులు అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు విని ఎంతో ఆనందిస్తున్నారు.

కోహ్లీ స్నేహ హస్తం 

ముందుగా కోహ్లీ గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పాకిస్తాన్ క్రికెట్ తనకు సాయం కావలసి వచ్చి, కోహ్లీని అడిగినప్పుడల్లా సాయం చేసేవాడని గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు, కోహ్లీ గురించి బాగా తెలిసిన ఈయన క్రికెట్లో కోహ్లీ బెస్ట్ ఇంకా రాలేదని, అది త్వరలోనే బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు. 

అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. క్రికెట్ గురించి నాకు ఎప్పుడు సలహాలు, సూచనలు కావాలన్నా.. కోహ్లీ నాకు హెల్ప్ చేసేవాడు. ఒక ఆటగాడిగా నేను కోహ్లీని చాలా గౌరవిస్తా’ అని చెప్పాడు. ఇది కేవలం అహ్మద్ ఒక్కడి మాటే కాదు.. టీమిండియాలో ఉన్న ఎందరో ఆటగాళ్ల మనసులోని మాట కూడా ఇదే. కోహ్లీ పైకి ఎంత కఠినంగా కనిపిస్తాడో లోపల అందరితో అంత ఆత్మీయంగా ఉంటాడు.

‘కోహ్లీ తనను తాను చాలా మార్చుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడినప్పుడు అతను బాగా లావుగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత తనను తాను కోహ్లీ అద్భుతంగా మలుచుకున్నాడు. చాలా బరువు తగ్గారు. కేవలం క్రికెట్‌లోనే కాదు మిగతా విషయాల్లో కూడా అతనిలో వచ్చిన మార్పులు చాలా గొప్పవి. టెస్టు క్రికెట్‌లో భారత్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అహ్మద్ షెహజాద్.

షెహజాద్ కోహ్లీ అనుబంధం….

అంతేకాదు విరాట్ కోహ్లీ లాగా చాలా వేగంగా  పరిస్థితులను అర్థం చేసుకొనే ఆటగాడిని తాను ఇప్పటి వరకు చూడలేదని షెహజాద్ తెలియజేశారు. ఇలా స్పోర్ట్స్ మెన్షిప్ కనబరచడం మామూలు పరిస్థితుల్లో అయితే వెంటనే కాదు కానీ.. మనం మాట్లాడుకుంటుండేది భారత్ మరియు పాకిస్తాన్ జట్ల ప్లేయర్స్ గురించి కాబట్టి ఇది కచ్చితంగా ఒక గొప్ప విశేషమే.

కోహ్లి మరియు షెహజాద్ దాదాపు ఒకే సమయంలో వారి కెరీర్‌ను ప్రారంభించారు.‌ అయితే ఈ పాకిస్తాన్ బ్యాటర్ చాలా కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక కోహ్లీ విషయానికి వస్తే కోహ్లీ తన కెరీర్‌లో 28 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో సహా 109 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8479 పరుగులు చేశాడు. 274 వన్డేల్లో 57.32 సగటుతో 46 సెంచరీలతో సహా 12898 పరుగులు చేశాడు. కోహ్లి 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఓటమి తర్వాత వెస్టిండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ మళ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మ దిగనున్నాడు. అలానే ఈ సంవత్సరం చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా విరాట్ కోహ్లీ భారత్‌కు ముఖ్య ఆటగాడిగా  మారనున్నాడు.