ఈ ఒక్క ఫోటో.. లైకుల మీదు లైకులు..!

FIDE చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన భారతదేశానికి చెందిన R ప్రజ్ఞానానంద దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇటీవల జరిగిన చెస్ వరల్డ్ కప్ లో చివరి రౌండ్‌లో టాప్-ర్యాంక్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీ పడ్డాడు, కాకపోతే ఉత్కంఠ భరతమైన ఆటతీరుతో సాగిన వరల్డ్ కప్ లో రన్నరప్‌గా నిలిచాడు మన భారతదేశ ఛాంపియన్. టోర్నమెంట్ మొత్తం, అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగింది. ఈవెంట్‌కు వచ్చిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ అంతేకాకుండా అతని తల్లి సోషల్ మీడియాలో గణనీయమైన […]

Share:

FIDE చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన భారతదేశానికి చెందిన R ప్రజ్ఞానానంద దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇటీవల జరిగిన చెస్ వరల్డ్ కప్ లో చివరి రౌండ్‌లో టాప్-ర్యాంక్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీ పడ్డాడు, కాకపోతే ఉత్కంఠ భరతమైన ఆటతీరుతో సాగిన వరల్డ్ కప్ లో రన్నరప్‌గా నిలిచాడు మన భారతదేశ ఛాంపియన్. టోర్నమెంట్ మొత్తం, అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగింది. ఈవెంట్‌కు వచ్చిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ అంతేకాకుండా అతని తల్లి సోషల్ మీడియాలో గణనీయమైన ఆదర అభిమానాలను సంపాదించుకున్నారు. 

వైరల్ గా మారిన ఫోటో క్యాప్షన్:

చెస్ ఫోటోగ్రాఫర్ మరియా ఎమెలియనోవా తీసిన ప్రజ్ఞానంద మరియు అతని తల్లి ఫోటో వైరల్ అయ్యింది. ఇది ట్విట్టర్లో ప్రస్తుతం లో 4.1 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. ఎమెలియనోవా ఈ ఫోటోకు గాను ఒక చక్కని ఆకర్షణీయమైన క్యాప్షన్ ‘ఒక లెజెండ్, ఇంకా ఆమె కొడుకుతో సెల్ఫీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్యాప్షన్ తో వచ్చిన చెస్ ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఎంతోమంది ఆ క్యాప్షన్ చూసి కరెక్ట్ మీరు చెప్పింది నిజం అంటున్నారు. వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ లో రన్నర్ అప్ నిలిచిన ప్రగ్నానంద చెస్ ఫోటోగ్రాఫర్ పోస్ట్ చేసిన ఫోటో టైప్ చేసి దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ ని హైలెట్ చేస్తూ, ‘కాప్షన్🔥❤’ అంటూ ఫోటో పోస్ట్ చేస్తూ రాయడం జరిగింది

కామెంట్ లో వర్షం కురిపిస్తున్న అభిమానులు: 

చెస్ ఫోటోగ్రాఫర్ మరియా ఎమెలియనోవా ప్రస్తుతం పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారిన విషయం వైరల్ గా మారింది. అంతేకాకుండా చెస్ చాంపియన్ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చిన ఫోటోగ్రాఫర్ ని అభినందిస్తూ, అంతేకాకుండా భారతదేశాన్ని మరో స్థాయిలో నిల్చోపెట్టిన చెస్ ఛాంపియన్ కి అభినందనలు తెలుపుతున్నారు ప్రియమైన అభిమానులు, అంతేకాకుండా కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ ఫోటో లో ఉన్న క్యాప్షన్ ని చూసి అవును మీరు చెప్పింది నిజమే. నిజంగా లెజెండ్స్కి లెజెండ్స్ లాంటి పిల్లలు ఉంటారు అంటూ ఒకరు, మరి కొంతమంది మీరు చేసిన కృషి మీ బిడ్డ సాధించడంలో తెలుస్తోంది అంటూ చెస్ ఛాంపియన్ తల్లిని పొగుడుతున్నారు మరి కొంతమంది. చెస్ ఛాంపియన్ నిజంగా భారతదేశాన్ని గర్వించదగ్గ విషయంలో, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన విషయంలో అందరికన్నా ముందు ఉన్నాడు అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఇలా తమదైన శైలిలో చాలామంది అభిమానులు తమ ప్రేమను కామెంట్ల రూపంలో వ్యక్తపరిచారు. 

చెస్ ఛాంపియన్ ఆనంద్ ప్రశంసలు: 

టై బ్రేకర్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోవడంతో ప్రగ్నానంద టోర్నమెంట్‌లో అన్ని విధాలా ముందుకు సాగలేకపోయాడు. భారత తొలి గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ టీనేజర్ ఓటమి గురించి ఎన్‌డిటివితో మాట్లాడుతూ, ప్రజ్ఞానంద నిజంగా ఒక మంచి ఆటను ఎదుర్కొన్నాడు అంటూ.. అతను బాగా పోరాడాడు మరియు టై-బ్రేక్‌కు చేరుకోవడం కూడా మంచి ఫలితం అన్నాడు ఆనంద్. అంతేకాకుండా ఈ రోజు, టోర్నమెంట్ ముగింపులో, అలసట కారణంగా ఫలితం రన్నరప్‌ అందించింది అని.. అతను ఇటీవల చాలా పెద్ద గేమ్‌లు ఆడాడు, ప్రపంచ కప్ కన్నా ముందు ముందు కూడా హంగేరీలో కప్ మరియు గ్లోబల్ చెస్ లీగ్ అంటూ మరొకసారి గుర్తు చేశారు ఆనంద్. అతనికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మరియు అతను ఇప్పుడు లక్ష్యం చేరుకోవడానికి దగ్గరలో ఉన్నట్లు మరోసారి పొగిడారు ఆనంద్.