ప్రాక్టీస్ మొదలెట్టిన తాలా (ధోనీ).. ఖుషీ అవుతున్న తంబీలు

మహేంద్ర సింగ్ ధోనీ… అంటే ఇండియాలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో మారుమూల రాష్ట్రమైన జార్ఖండ్‌లో పుట్టిన ధోనీ.. ఇండియన్ క్రికెట్‌నే శాసించే స్థాయికి ఎదిగాడంటే మాటలు కాదు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం అనేది ధోనీ దగ్గరే చూసి నేర్చుకోవాలి. ఆయన దేశానికి ఎన్నో టోర్నీలను అందించినా కానీ.. ధోనీ మాత్రం కూల్‌గానే ఉంటాడు. మైదానం లోపల మాత్రమే కాకుండా.. మైదానం బయట కూడా తాలా కూల్‌గానే ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి […]

Share:

మహేంద్ర సింగ్ ధోనీ… అంటే ఇండియాలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో మారుమూల రాష్ట్రమైన జార్ఖండ్‌లో పుట్టిన ధోనీ.. ఇండియన్ క్రికెట్‌నే శాసించే స్థాయికి ఎదిగాడంటే మాటలు కాదు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం అనేది ధోనీ దగ్గరే చూసి నేర్చుకోవాలి. ఆయన దేశానికి ఎన్నో టోర్నీలను అందించినా కానీ.. ధోనీ మాత్రం కూల్‌గానే ఉంటాడు. మైదానం లోపల మాత్రమే కాకుండా.. మైదానం బయట కూడా తాలా కూల్‌గానే ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, తాల కుటుంబంతో మిగిలిన సమయాన్ని గడుపుతున్నాడు. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో మాత్రం ఆడుతున్నాడు. 

ధోనీకి యమ క్రేజ్ మావా..

ధోనీది తమిళనాడు (చెన్నై) కాకపోయినా అతడికి ఉండే క్రేజ్ చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ రాష్ట్రానికే చెందిన స్టార్ క్రికెటర్లకు కూడా అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. కానీ.. తాలా ధోనీకి మాత్రం వీర లెవెళ్లో ఫ్యాన్స్ ఉంటారు. అందుకోసమే చెన్నై జట్టు ఆరంభ సీజన్ నుంచి ధోనీని అట్టి పెట్టుకునే ఉంది. ఇక చెన్నై సారధిగా కూడా ధోనీ విజయం సాధించాడు. ఇప్పటి వరకు ఆ జట్టుకు 2010, 2011, 2018, 2021లలో టైటిల్ అందించిన మహీ.. కేవలం ఇది మాత్రమే కాకుండా 5 సార్లు రన్నరప్‌గా కూడా నిలిపాడు. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకే అత్యధిక విజయాల శాతం (58.98) ఉండడం గమనార్హం. చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లకు చేసిన మహీకి.. కెప్టెన్సీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అతడు నీళ్లు తాగినంత సులువుగా కెప్టెన్సీని చేస్తాడు. 

2023 సీజన్‌కు సిద్ధమవుతున్న మిస్టర్ కూల్

2023 సీజన్ కోసం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ప్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సీఎస్కే అభిమానులు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో.. ధోనీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో లైట్ల కింద ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంది. ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో రెండు విస్తారమైన డ్రైవ్‌లు ఆడాడు. అంతే కాకుండా బౌలర్ తల పైనుంచి బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఎంతో అనుభవం ఉన్న ధోనీ మళ్లీ రావడంతో CSK అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌తో మార్చి 31న ప్రారంభ మ్యాచ్‌లో తలపడుతుంది. ఐపీఎల్ లో మూడు సంవత్సరాల తర్వాత CSK తరపున MS ధోని ఈసారి చెన్నైలో ఆడుతుండడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. తమ స్టార్ ఆటగాడి భారీ సిక్సర్లు, అతడి వ్యూహాలు చూడొచ్చని వారు ఖుషీ అవుతున్నారు. IPL 2023 షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్  మాథ్యూ హేడెన్  స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చెపాక్‌లో ఆడనున్నాడని, దాంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ అతని IPL కెరీర్‌కు చివరి సీజన్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని, కాబట్టి.. అతడి అభిమానులు చివరిసారిగా తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు తప్పకుండా వస్తారని, తాను అనుకుంటున్నట్లు హెడెన్ తెలిపాడు. అతడు ఈ సీజన్‌లో ఎలా పర్ఫామ్ చేస్తాడని అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు హేడెన్ పేర్కొన్నాడు. ఇక ధోనీ తర్వాత జట్టును ముందుంచి నడిపించేదెవరనే మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రశ్నగానే ఉండి పోతుంది. గత సీజన్‌లో స్టార్ ఆల్‌రౌండర్ జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పగా.. అతడు పూర్తిగా విఫలమయ్యాడు. మధ్యలోనే ధోనీ సారధ్య బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. 2023 మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్‌ను దక్కించుకుంది. మరి 2024లో స్టోక్స్‌కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తారా? అనేది వేచి చూడాలి.