Hardik Pandya: ఆందోళన కలిగిస్తున్న పాండ్యా గాయం..!

చీలమండ గాయంతో న్యూజిలాండ్‌(New Zealand)తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఇంగ్లండ్‌(England)తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఆడకపోవడంతో మహ్మద్ షమీ(Mohammed Shami), సూర్యకుమార్ యాదవ్‌(Surya Kumar Yadav)లను ప్లేయింగ్ 11లో చేర్చే అవకాశాలు పెరిగాయి. స్వదేశంలో జరగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో వరుస విజయాలతో టీమిండియా(Team india) జోరు మీదుంది. ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్‌ సేన… పాయింట్ల […]

Share:

చీలమండ గాయంతో న్యూజిలాండ్‌(New Zealand)తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఇంగ్లండ్‌(England)తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఆడకపోవడంతో మహ్మద్ షమీ(Mohammed Shami), సూర్యకుమార్ యాదవ్‌(Surya Kumar Yadav)లను ప్లేయింగ్ 11లో చేర్చే అవకాశాలు పెరిగాయి.

స్వదేశంలో జరగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో వరుస విజయాలతో టీమిండియా(Team india) జోరు మీదుంది. ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్‌ సేన… పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 29న తన తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌(England)పై విజయం సాధించి 2019 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే చీలమండ గాయంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబర్ 29న భారత్-ఇంగ్లండ్(India-England) మధ్య జరిగే మ్యాచ్‌తో పాటు నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు కూడా హార్దిక్(Hardik) అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం హార్దిక్‌ పాండ్యా లక్నో వెళ్తాడని బీసీసీఐ(BCCI) గతంలో ప్రకటించింది. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. హార్దిక్ ఇంకా టాబ్లెట్స్‌ వాడుతున్నాడని.. చీలమండపై వాపు బాగా తగ్గిందని.. కానీ అప్పుడే అతను బౌలింగ్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.

 హార్ధిక్ పాండ్యా ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు బీసీసీఐ(BCCI) వ‌ర్గాలు వెల్లడించాయి. పాండ్యాను మ‌రో మూడు మ్యాచ్‌ల వ‌ర‌కు దూరం పెట్టే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మశాల(Dharamshala) వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. హార్దిక్ లేకపోవటంతో కివీస్‌తో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే టీమిండియా ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ తొలుత భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ.. ఆరో బౌలర్ లేకపోవటంతో రోహిత్ కుల్దీప్‌నే కొనసాగించాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ టీమిండియా(Team India) విజయాల్లో హార్దిక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

 ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తో ఇంకా మెరుపులు మెరిపించనప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ రాణించాడు. పాండ్యా ఈ వారాంతానికి కోలుకునే అవకాశం ఉందని… కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వడం ముఖ్యమని ఎన్సిఏ(NCA) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత్‌ సెమీస్‌ ముంగిట నిలిచినందున నాకౌట్‌ మ్యాచులకు ముందు  హార్దిక్‌(Hardik)కు విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు చీలమండ గాయం(Ankle injury) తగ్గుతోందని… అదృష్టవశాత్తూ కాలుకు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని బీసీసీఐ(BCCI) వైద్య బృందం తెలిపినట్లు తెలుస్తోంది. అతను తదుపరి రెండు మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పింది. 

న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ భారత్‌కు అత్యంత కఠినమైన సవాల్‌గా మారనుంది. న్యూజిలాండ్ జట్టు కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్- 1లో కొనసాగుతోంది.

జట్టులో పాండ్యా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav), మహ్మద్ షమీ(Mohammed Shami) వంటి ఇతర ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయి. టోర్నమెంట్‌లోని తన మొదటి గేమ్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.అయితే, భారత్ బౌలింగ్, బ్యాటింగ్ మధ్య సమతుల్యతను కాపాడుకోవాలనుకుంటే అశ్విన్ ఆడటం కూడా ఒక ఎంపిక. ఇలాంటి పరిస్థితుల్లో జడేజాను 6వ ర్యాంక్‌లోకి మార్చవచ్చు. శార్దూల్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేయగా, అశ్విన్ 8వ స్థానంలో ఆడనున్నాడు. అశ్విన్ ఆట కారణంగా భారత బ్యాటింగ్ ఖచ్చితంగా కొద్దిగా బలహీనంగా ఉంటుంది. అయితే జట్టుకు 6 బౌలింగ్ ఎంపికలు కూడా ఉన్నాయి.