ఈ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా స్థానాన్ని భర్తీ చేసే అవకాశము

భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ఛతేశ్వర్‌ పుజారా స్థానాన్ని భర్తీ చేయడంపై మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో పుజారా స్థానాన్ని భర్తీ చేయగలిగిన ఆటగాడు ఎవరో చెప్పాడు. వసీం జాఫర్ ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ పుజారాకు ప్రత్యామ్నాయ ఆటగాడని,  3వ స్థానంలో ఆడే ఆటగాడని అన్నాడు. ఛతేశ్వర్ పుజారా గురించి చెప్పాలంటే.. అతను చాలా కాలంగా టెస్టు క్రికెట్‌లో భారత జట్టు తరఫున మూడో నంబర్‌లో ఆడుతున్నాడు. అతను ఈ […]

Share:

భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ఛతేశ్వర్‌ పుజారా స్థానాన్ని భర్తీ చేయడంపై మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో పుజారా స్థానాన్ని భర్తీ చేయగలిగిన ఆటగాడు ఎవరో చెప్పాడు. వసీం జాఫర్ ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ పుజారాకు ప్రత్యామ్నాయ ఆటగాడని,  3వ స్థానంలో ఆడే ఆటగాడని అన్నాడు.

ఛతేశ్వర్ పుజారా గురించి చెప్పాలంటే.. అతను చాలా కాలంగా టెస్టు క్రికెట్‌లో భారత జట్టు తరఫున మూడో నంబర్‌లో ఆడుతున్నాడు. అతను ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ చాలా పరుగులు చేశాడు మరియు సంవత్సరాలుగా జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు అతని కెరీర్ బాగా లేదు, ఫామ్ అందుకోవట్లేదు. అటువంటి పరిస్థితిలో అతని స్థానాన్ని వీలైనంత త్వరగా రీప్లేస్మెంట్ చెయ్యాల్సి ఉంటుందని ఇండియన్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.

వసీం జాఫర్‌ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. పుజారా సుదీర్ఘమైన ఆట నుండి రిటైర్మెంట్ తర్వాత నం. 3 స్థానానికి అయ్యర్ ఉత్తమ ఎంపిక అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. పుజారా ఇటీవలే భారత్ తరఫున 100వ టెస్టు మ్యాచ్ ఆడాడు మరియు అతని రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడిందని, మూడో స్థానంలో పుజారా అద్భుతంగా రాణించాడని కూడా అతన్ని ప్రశంశించాడు. పుజారా 2010 సంవత్సరంలో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు మరియు అప్పటి నుండి అతను తన కెరీర్‌లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టీమిండియా తరఫున 19 సెంచరీలు కూడా చేశాడు.

వసీం జాఫర్‌.. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ…

“నా ప్రకారం.. పుజారా స్థానంలో అంటే మూడవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపిక. అతను ముంబై తరపున మూడవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు మరియు అటాకింగ్ బ్యాట్స్‌మెన్. ఎవరైనా మూడో స్థానంలో వచ్చి బౌలర్లను అటాక్ చేస్తూ ఆడితే అది టీం ఇండియాకు ఎంతో మేలు చేస్తుంది” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో తన అభిప్రాయాన్ని తెలిపారు. మరోవైపు, అయ్యర్ ఇటీవలే తన రెడ్ బాల్ కెరీర్‌ను 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌తో ప్రారంభించాడు.

టెస్టు క్రికెట్‌లో అయ్యర్, పుజారా

అయ్యర్ భారతదేశం తరఫున మొత్తం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు మరియు 56.72 సగటుతో 624 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు టెస్టుల్లో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. అయ్యర్ డిసెంబరు 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు, అతను దేశం కోసం తన మొదటి రెడ్-బాల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 16వ భారతీయ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. అయ్యర్ చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్‌లో కనిపించాడు.అయితే అయ్యర్ విదేశాల్లో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు, ఇది టెస్టులో అతని అద్భుతమైన సగటును వివరిస్తుంది. మరోవైపు.. పుజారా ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడు, అతను టెస్ట్ క్రికెట్‌లో 100 సార్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 19 సెంచరీలు మరియు 34 అర్ధ సెంచరీలతో సహా 44.07 సగటుతో 7052 పరుగులు చేశాడు. ప్రస్తుతం అయ్యర్ మరియు పుజారా ఇద్దరూ ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగంగా ఉన్నారు.