టీమిండియా వన్డే వరల్డ్‌కప్ జట్టు ఇదే..!

అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ  భారత జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ జాబితాను మంగళవారం అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాండీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్‌ తమ వరల్డ్‌కప్‌ […]

Share:

అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ  భారత జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ జాబితాను మంగళవారం అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాండీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో పాల్గొంటోంది మరియు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించేందుకు సోమవారం 10 వికెట్ల (DLS పద్ధతి)తో నేపాల్‌ను ఓడించింది.

ధోనీ నేతృత్వంలో జట్టు చివరిసారిగా 2011లో వరల్డ్‌కప్‌ నెగ్గిన విషయం తెలిసిందే. ఊహించినట్టుగానే తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ మినహా ప్రస్తుతం ఆసియాక్‌పలో ఆడుతున్న జట్టునే మెగా టోర్నీకి పంపనున్నారు. గాయాల కారణంగా నాలుగు నెలలపాటు క్రికెట్‌కు దూరమైన వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు జట్టులో చోటు దక్కింది. అతను ప్రస్తుతం ఆసియాకప్‌ గ్రూప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. అయితే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) రాహుల్‌ ఫిట్‌నె్‌సపై సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సెలెక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌పై నమ్మకముంచారు. టీ20ల్లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నా.. వన్డేల్లో మాత్రం తను అంతగా రాణించడం లేదు. చివరి 18 ఇన్నింగ్స్‌లో ఒక్క ఫిఫ్టీ కూడా లేకపోవడం గమనార్హం. పూర్తి ఫిట్‌గా ఉన్న పేసర్‌ బుమ్రా ఐర్లాండ్‌తో సిరీస్‌తో సత్తా చాటుకున్నాడు. జడేజా, కుల్దీప్‌, అక్షర్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. అక్షర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలగడం అదనపు అర్హతగా భావించారు. మరోవైపు గిల్‌, సూర్యకుమార్‌, శ్రేయాస్‌, ఇషాన్‌, సిరాజ్‌, అక్షర్‌లకిదే తొలి వన్డే వరల్డ్‌కప్‌. 

రాహుల్‌ జట్టులోకి రావడంతో సంజూ శాంసన్‌కు అవకాశం లేకుండా పోయింది. సంజూకు అడపాదడపా అవకాశాలు ఇచ్చినా తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు ఇషాన్‌ రిజర్వ్‌ కీపర్‌గా వ్యవహరిస్తాడు. అలాగే హైదరాబాదీ తిలక్‌ వర్మపై అంచనాలున్నా.. రాహుల్‌, శ్రేయాస్‌ ఇద్దరూ అందుబాటులో ఉండడం అతడి చాన్స్‌ను దెబ్బతీసింది. ఇక భారత్‌లోనే టోర్నీ జరుగుతుండడంతో అదనపు పేసర్‌ అవసరం లేదనే భావనలో ప్రసిద్ధ్‌ను ఎంపిక చేయలేదు. వరుసగా మెగా టోర్నీల్లో చోటు దక్కించుకోలేకపోతున్న స్పిన్నర్‌ చాహల్‌తో పాటు అశ్విన్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. ఓవరాల్‌గా తాజా జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్‌ కీపర్లు, ఇద్దరు పేస్‌ ఆల్‌రౌండర్లు, మరో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు, నలుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉండేలా చూసుకున్నారు. 

అలాంటి ప్రశ్నలు వేయొద్దు: రోహిత్‌వరల్డ్‌క్‌పలో తాము అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని, అనవసర ప్రశ్నలు వేయవద్దంటూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేదనే విమర్శలపై సమాధానమివ్వాలని ఓ విలేకరి అడిగాడు. ‘వీటికి నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానమిచ్చాను. బయట ఎవరు? ఎలా? మాట్లాడుకుంటున్నారనే విషయాలను మేం పట్టించుకోం. జట్టులో అందరూ ప్రొషెషనల్‌ క్రికెటర్లు. దయచేసి అలాంటి ప్రశ్నలు అడగకండి. ఇకపై నేను వాటికి సమాధానమివ్వను. మా దృష్టంతా కప్‌ సాధించడంపైనే ఉంది’ అని రోహిత్‌ తేల్చాడు. 

వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్థూల్‌ ఠాకూర్‌.