ఇప్పటి క్రికెటర్లు అందుకే ఇలా ఉన్నారు 

భారత దిగ్గజ క్రికెటర్‌‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) ఇప్పటి తరం క్రికెటర్లపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రతిదీ తమకు తెలుసని వారు అనుకుంటూ ఉంటారని, అందుకే ఆట విషయంలో వేరే వాళ్లని అడగాల్సిన అవసరం ఏముందని క్రికెటర్లు భావిస్తుంటారని చెప్పారు. ‘‘వాళ్లు ఇలా తయారు కావడానికి కారణం,సంపద (Money), పొగరు (Arrogance), అహం(Ego). ఈ మూడు లక్షణాలు వాళ్లల్లో ఉండబట్టే సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి వారు ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈ తరం ఆటగాళ్లలో ఉన్న […]

Share:

భారత దిగ్గజ క్రికెటర్‌‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) ఇప్పటి తరం క్రికెటర్లపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రతిదీ తమకు తెలుసని వారు అనుకుంటూ ఉంటారని, అందుకే ఆట విషయంలో వేరే వాళ్లని అడగాల్సిన అవసరం ఏముందని క్రికెటర్లు భావిస్తుంటారని చెప్పారు. ‘‘వాళ్లు ఇలా తయారు కావడానికి కారణం,సంపద (Money), పొగరు (Arrogance), అహం(Ego). ఈ మూడు లక్షణాలు వాళ్లల్లో ఉండబట్టే సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి వారు ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈ తరం ఆటగాళ్లలో ఉన్న మంచి విషయం ఏంటంటే, వాళ్లందరూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రతికూల అంశం ఏమిటంటే, వారికి ప్రతిదీ తెలుసని భావిస్తారు. అనుభవం ఉన్న వ్యక్తి మీకు సహాయం చేయగలరని మీరు నమ్మాలి. కానీ, డబ్బు (Money) కట్టలు వచ్చి పడుతుంటే, అహంకారం వస్తుంది. అప్పుడు తమకు అన్నీ తెలుసని అనుకుంటారు.అదే అప్పటి, ఇప్పటి తరం క్రికెటర్ల మధ్య ఉన్న తేడా. చాలా మంది క్రికెటర్లకు సీనియర్ల అవసరం ఉందని అనుకుంటున్నాను.

సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar)‌ మీకు అందుబాటులో ఉంటాడు. ఆయనతో ఎందుకు మీరు మాట్లాడరు. మీకు ఎందుకు అహం అడ్డువస్తుంది. మేమంతా బాగా ఆడుతున్నామని అనుకోవచ్చు. కానీ, 50  ఏండ్ల పాటు క్రికెట్‌లో అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు తీసుకోవచ్చు. అతనికి క్రికెట్‌లో ఎన్నో విషయాలపై పట్టు ఉంటుంది. అవగాహన ఉంటుంది. అలాంటి వారి మాటలు వినడం వల్ల మీ ఆలోచనలో మార్పులు రావొచ్చు” అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు.  

ఇంతకుముందు మాజీ కెప్టెన్‌ సునీల్ గవాస్కర్‌‌ (Sunil Gavaskar ) కూడా ప్రస్తుత క్రికెటర్లపై ఇదే రకమైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు సలహాల కోసం తన వద్దకు రావడం చాలా అరుదు అని పేర్కొన్నాడు. ‘‘గతంలో రాహుల్‌ ద్రావిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి వారు క్రమం తప్పకుండా నా వద్దకు వచ్చేవారు. ఆటకు సంబంధించి విషయాలను చర్చించే వారు. ఈ విషయాలు వారితో చర్చించేందుకు నాకు ఎలాంటి అహం అడ్డు రాలేదు. ఇప్పుడు నేను వెళ్లి ప్రస్తుత క్రికెటర్లతో మాట్లాడగలను. కానీ, ఇప్పుడు ఇద్దరు కోచ్‌లు రాహుల్‌ ద్రావిడ్‌, విక్రమ్ రాథోడ్‌లు ఉన్నారు కాబట్టి.. ఇప్పుడు నేను వెళ్లి వారితో మాట్లాడితే, ప్లేయర్స్ కొంత గందరగోళానికి గురవుతారు. అందుకే వెళ్లడం లేదు” అని గవాస్కర్‌‌ ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో అన్నారు. 

మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ (Cricket World Cup 2023) ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ ఇండియా ప్రదర్సన కూడా ఆందోళనకరంగానే ఉంది. విండీస్ మీద మొదటి వన్డే కష్టంగా గెలిచినా కూడా రెండో వన్డే ఓడిపోయారు. బుమ్రా వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియని పరిస్థితి నెలకొన్నది. నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ కు ఎవరు వస్తారు అని కూడా కచ్చితమైన సమాచారం లేదు, రిషబ్ పంత్ వన్డే ప్రపంచ కప్పుకి అందుబాటులో ఉండే అవకాశాలు లేవు కాబట్టి వికెట్ కీపర్ విషయంలో కూడా సందిగ్ధం నెలకొంది. తాజాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆందోళన పెంచే విధంగా ఉన్నాయి.