Shoaib Akhtar: ఇక టీమిండియాకు తిరుగులేదు- షోయబ్ అక్తర్

వన్డే ప్రపంచకప్ 2023(World Cup 2023)లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా(Team india)పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌‌తో సత్తా చాటుతున్న టీమిండియాకు తిరుగులేదని, రోహిత్(Rohith) సేన టైటిల్ అందుకోవడం ఖాయమని జోస్యం చెప్పాడు.  ఆదివారం న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. ప్రపంచకప్‌(World […]

Share:

వన్డే ప్రపంచకప్ 2023(World Cup 2023)లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా(Team india)పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌‌తో సత్తా చాటుతున్న టీమిండియాకు తిరుగులేదని, రోహిత్(Rohith) సేన టైటిల్ అందుకోవడం ఖాయమని జోస్యం చెప్పాడు. 

ఆదివారం న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. ప్రపంచకప్‌(World Cup)లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించిన షోయబ్ అక్తర్(Shoaib Akhtar).. రోహిత్ సేన ఆటతీరును కొనియాడాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌ను అయితే ఆకాశానికెత్తాడు. ‘ఒత్తిడిలో చెలరేగే ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆ ఒత్తిడే అతనికి పరుగులతో పాటు సెంచరీ చేసే అవకాశం ఇస్తోంది. విన్నింగ్ నాక్స్(Winner Knock) ఆడటం.. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకోవడం అతనికి అలవాటుగా మారింది. దీనికి అతను పూర్తిగా అర్హుడు.

శుభ్‌మన్ గిల్(Shubman Gill), రోహిత్ శర్మ(Rohith Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), కేఎల్ రాహుల్‌(KL Rahul), సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)లతో టీమిండియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ నిర్లక్షంగా ఔటవ్వకుంటే టీమిండియాకు తిరుగుండదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా బాధ్యత తీసుకున్నాడు. రనౌటవ్వకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా బాగానే ఆడేవాడు. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ(Mohammed Shami) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 

న్యూజిలాండ్ 300-350 స్కోర్ చేయకుండా అతనే అడ్డుకున్నాడు. కాస్త పరుగులిచ్చినా.. ఐదు వికెట్లు తీసాడు. అతని సత్తా ఏంటో తెలియజేశాడు. ఇదే బౌలింగ్ అటాక్‌ను కొనసాగించాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక రోహిత్ సేన టైటిల్ గెలవడం ఎవరూ కూడా ఆపలేరు.’అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన టీమిండియా.. తదుపరి మ్యాచ్‌ను లక్నో వేదికగా ఆదివారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌(England)తో తలపడనుంది.

పీసీబీపై తీవ్ర ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan) చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్(Pakistan) జట్టుపై ఆ జట్టు మాజీలు నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకుమించిన సిగ్గు చేటు పాక్ జట్టుకు కానీ, దేశ క్రికెట్ బోర్డుకు కానీ ఉండదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా పాక్ జట్టుపై, పీసీబీ(PCB)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఆఫ్ఘన్‌పై పాక్ ఓడిన తీరుపై షోయబ్ అక్తర్(Shoaib Akhtar) తన యూట్యూబ్ చానెల్లో స్పందించాడు.

 ఆఫ్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓడిన తీరు చూసిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్న అక్తర్.. ఈ ఓటమికి పాక్ క్రికెట్ బోర్డును దోషిగా తేల్చాడు. ఎవరు పడితే వాళ్లు బోర్డు ప్రెసిడెంట్ అయిపోతున్నారని, సరైన వ్యక్తిని సరైన పోస్ట్‌లో కూర్చోబెట్టాలన్నాడు. లేకపోతే పాక్ క్రికెట్ ఇంతకంటే దిగజారిపోతుందన్నాడు.

‘గత 20, 30 ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు, చేసిన పనులకు ఈ మ్యాచ్ అసలైన ఉదాహరణ. మీరు చేసిన పనికి లభించిన ఎండ్ రిజల్ట్ ఇదే’ అంటూ పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాక్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పాక్ జట్టులో ఒక్క క్రికెటర్ కూడా తర్వాతి జనరేషన్‌‌కు ఇన్స్‌పిరేషన్ అయ్యే ఆటగాడు లేడని షోయబ్ అన్నాడు. ‘నేను వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్, వివ్ రిచర్డ్స్ వంటి గొప్ప గొప్ప ఆటగాళ్లను చూశాను. మరి ఇప్పుడున్న పాక్ జట్టులో అలాంటి ఇన్స్‌పైరింగ్ ఆటగాడు ఒక్కడైనా ఉన్నాడా..?’ అంటూ అక్తర్ నిలదీశాడు. అలాగే ఒకవేళ తాను ఇప్పుడు బాబర్‌(Babar)తో ఉండి ఉంటే.. పాక్ చరిత్రలో ఇంతకుమించిన చెత్త ప్రదర్శన మరొకటి ఉండదని, ఇలాగే ఆడితే మిగిలిన నాలుగు జట్లపై కూడా ఓటమి ఖాయమని, ఇప్పటికైనా కెప్టెన్‌గా ఎదగాలని సూచించేవాడినని అక్తర్ చెప్పుకొచ్చాడు.